పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో పీరియాడికల్ మూవీగా వస్తున్న సినిమా హరి హర వీరమల్లు. ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ క్రిష్ మొదలు పెట్టగా జ్యోతి కృష్ణ ప్రాజెక్ట్ పూర్తి చేశారు. హరి హర వీరమల్లు సినిమ ఈ నెల 24న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన సాంగ్స్ ఇప్పటికే సూపర్ బజ్ ఏర్పరిచాయి. ఇక త్వరలో సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. జూలై 4న హరి హర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు.
ఐతే ఈ సినిమా ట్రైలర్ ని కొంతమంది మీడియా వారికి ఇండస్ట్రీ ప్రముఖులకు చూపించారట. ట్రైలర్ చూసి వాళ్లంతా కూడా సూపర్ అనేశారని తెలుస్తుంది. ఈమధ్య కాలంలో ఇలాంటి గ్రాండ్ ట్రైలర్ రాలేదని చెప్పుకుంటున్నారు. వీరమల్లు ట్రైలర్ అటు ఇటుగా 3 నిమిషాల నిడివితో వస్తుంది. ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ రకరకాల పాత్రల్లో కనిపించనున్నారు. ఇక విజువల్స్ అయితే ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తాయని చెబుతున్నారు. హై టెక్నికల్ వాల్యూస్ తో భారీ బడ్జెట్ తో ఈ సినిమా రబఓతుంది. ఐతే సినిమాకు పెట్టిన ప్రతి రూపాయి తెర మీద కనిపించేలా విజువల్స్ ఉన్నాయని ట్రైలర్ తోనే చూపిస్తున్నారట. ట్రైలర్ కు ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ కూడా మరో హైలెట్ అని అంటున్నారు..
ట్రైలర్ చూసిన వారంతా కూడా సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్స్, స్ట్రాంగ్ ఎమోషనల్ ఎపిసోడ్స్ ఇక ట్రైలర్ ఫైనల్ పోర్షన్ కూడా ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ కలిగించేలా చివరి 30 సెకన్లు ఉంటాయని తెలుస్తుంది. వీరమల్లు సినిమాలో బాబీ డియో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ కూడా మరో హైలెట్ పాయింట్ అవుతుందని అంటున్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా వీరమల్లులో ఒక పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు. కచ్చితంగా ఆమె తన పాత్రలో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.
హరి హర వీరమల్లులో మరో హైలెటెడ్ థింగ్.. పవన్ కళ్యాణ్ స్వయంగా కొన్ని డైలాగ్స్ రాశారట. ట్రైలర్ లో అవి చాలా కీలకమని తెలుస్తోంది. వీరమల్లు ట్రైలర్ కు వచ్చిన ఈ పాజిటివ్ టాక్ సినిమాపై ఆడియన్స్ ఇంట్రెస్ట్ ని మరింత పెంచుతుంది. ఇక మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. వీరమల్లు సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ గురి కుదిరేలా ట్రైలర్ ఉంటుందని తెలుస్తుంది. మరి ట్రైలర్ తో సినిమాపై బజ్ డబుల్ చేసేలా చూస్తున్న మేకర్స్ ప్రయత్నాలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.