• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

‘Hari Hara Veera Mallu’ Movie Review: ‘హరి హర వీరమల్లు’ మూవీ రివ్యూ

‘Hari Hara Veera Mallu’ Movie Review: ‘హరి హర వీరమల్లు’ మూవీ రివ్యూ

నా సినిమాలను నేనే చూడనన్నాడు నాటి పవన్ కళ్యాణ్. కానీ నేటి డిప్యూటీ సీఎం అయ్యాక.. క్షణం తీరిక లేకున్నా కూడా.. ‘వినాలి.. వీరమల్లు చెప్తే వినాలి’ అంటూ తన సినిమాని తానే ప్రమోట్ చేసుకుంటూ రంగంలోకి దిగారు. ‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో’ తెలిసిన రియల్ పొలిటీషియన్ అనిపించాడాయన. కొందరివాడనే ముద్ర రాజకీయాల్లో చెల్లుతుందేమో కానీ.. సినిమాల్లో మాత్రం అందరివాడు అనిపించుకుంటేనే నిర్మాత జేబుకి చిల్లు పడకుండా ఉంటుందనే వాస్తవాన్ని గ్రహించి.. స్వయంగా వీరమల్లు ప్రమోషన్స్‌కి దిగారు.

తాను దిగడమే కాదు.. జనసైనికులు, కూటమి కార్యకర్తలతో గ్రామ, మండల స్థాయిలో ర్యాలీలు చేయించి మరీ ప్రమోషన్స్ చేయించి.. ‘వీరమల్లు’ విజయంపై గట్టిగానే గురిపెట్టారాయన. ప్రమోషన్స్‌లో వీక్స్ అని ముద్రపడ్డ పవర్ స్టార్.. వీరమల్లుతో పీక్స్ అనిపించి మరోమారు ట్రెండ్ సెట్టర్ అనిపించారు. ‘వినాలీ వీరమల్లు చెప్తే వినాలీ’ అని అన్న హరిహర వీరమల్లు ఏం చెప్పాడో… ఏం వినిపించాడో సమీక్షలో చూద్దాం.

హరి హర వీరమల్లు ఇది ఫిక్షనల్ స్టోరీ. చరిత్రతో ఏ మాత్రం సంబంధం లేని కల్పిత పాత్రతో అల్లిన ఊహాతీతమైన కథ. అధర్మంపై పోరాడే ఓ యోధుడి కథ. హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలన్న ఔరంగజేబుపై వీరమల్లు చేసిన యుద్ధమే హరిహర వీరమల్లు కథ. కృష్ణానదీ తీరంలో దొరికిన విలువైన కోహినూర్ వజ్రం ముహమ్మద్ కులీ కుతుబ్ షాల దగ్గర నుంచి మొఘలుల వద్దకు ఎలా చేరిందనే విషయాన్ని అంతర్లీనంగా స్పృశిస్తూ.. మొఘల్ పాలకుడు ఔరంగజేబు నిరంకుశత్వాన్ని, అతని దురాగతాలను కళ్లకి కట్టిన చిత్రం వీరమల్లు.

మనం చదువుకున్న చరిత్రలో ఎంతసేపూ మొఘల్ తాలూకా గొప్పతనం చెప్పారు తప్ప. మొఘల్ తాలూకా అరాచకాన్ని చెప్పలేదు. హిందువుగా బతకాలి అంటే జిజియా పన్ను కట్టాలనే దారుణమైన పరిస్థితుల్లో తన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం హరిహర వీరమల్లు ఎలాంటి యుద్ధాన్ని చేశాడు? అన్నదే వీరమల్లు కథ.

ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ తన సినిమా గురించి ఇంత గొప్పగా ఎప్పుడూ చెప్పుకోలేదు. విడుదలకు ముందు కూడా కూడా కనీసం తన సినిమాని ప్రమోట్ కూడా చేసుకోలేదు. కానీ.. వీరమల్లు సినిమాకి ఫుల్ ఎఫర్ట్ పెట్టాం అని పదే పదే చెప్పారు. అంతేకాదు.. ఈ సినిమాకి ఎంతో నలిగిపోయానని.. వీరమల్లు ఎన్ని రికార్డులు బద్దలకొడుతుందో కూడా చెప్పలేనని అన్నారు. పవన్ కళ్యాణ్‌లోని ఈ కాన్ఫిడెన్స్ చూసిన తరువాత.. వీరమల్లు ఏదో చేయబోతున్నాడనే నమ్మకం అయితే కలిగింది. కానీ సినిమా ఫైనల్ ఔట్‌పుట్ చూస్తే మాత్రం ఊరించి ఉసూరుమనిపించారనే అనిపిస్తుంది.

పవన్ కళ్యాణ్ సినిమాలను ఆయన ఫ్యాన్స్ ఎంతలా ఆరాధిస్తారో.. ఇంకెంత ప్రేమిస్తారంటే.. ఆయన కెరియర్‌‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాలను కూడా రీ రిలీజ్ చేస్తే హౌస్ ఫుల్ చేసిన ఘన చరిత్ర ఉంది. ఎవరు ఏమనుకున్నా కూడా.. ఫ్యాన్స్‌కి మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉన్నా నచ్చేస్తుంది. వీరమల్లు సినిమా ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు.. పవన్ కళ్యాణ్ ఎంట్రీ.. భారీ ఎలివేషన్స్‌కి ఫ్యాన్స్‌ పిచ్చెక్కిపోతారు. మరి థియేటర్‌లో మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి అంటే.. ఉర్రూతలూగుతున్న ఆ ఫ్యాన్స్‌ని అలా చూస్తుండటమే. ఎందుకంటే వీరమల్లు కథతో జర్నీ చేసే అవకాశం లేదు కనుక.

వీరమల్లుగా పవన్ కళ్యాణ్ యాక్షన్ ఫీస్ట్ అందించారు. అందులో సందేహం లేదు. ఒకరకంగా చెప్పాలంటే.. తన శక్తికి మించి పని చేశారు. మిగతా స్టార్ హీరోల మాదిరిగా తాను నటనలో స్వైర విహారం చేయలేనని.. డాన్స్‌లు చేయలేనని.. యాక్షన్ ఎపిసోడ్‌లు అంతంతమాత్రమేననే పబ్లిక్‌గానే ఒప్పుకుంటారు పవర్ స్టార్. కానీ ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్‌ల కోసం ఏ స్టార్ హీరోలతో అయితే పోటీ పడలేనని అన్నారో.. వాళ్లకి గట్టి పోటీనే ఇచ్చారు. యాక్షన్‌లో.. డైరెక్షన్‌లో.. ఫైట్స్‌లో.. పాటల్లో.. ఇలా ప్రతి క్రాఫ్ట్‌లోనూ పవర్ స్టార్ ఓ చేయి వేశారు. అయితే ఈ కథ చేతులు మారుతూ రావడంతో పవన్ కళ్యాణ్ తన భుజస్కంధాలపై నిలబెట్టడానికి ప్రయత్నించినా కూడా.. ఆయన శ్రమకి తగ్గ ఫలితం అయితే లేదు.

ఔరంగజేబు క్రూరత్వం, కోహినూర్ వజ్రం కోసం వీరమల్లు పోరాటం. ఈ రెండింటి మధ్య అంతర్లీనంగా ధర్మం కోసం జరిగిన యుద్ధం. చెప్పడానికి ఇదో చారిత్రక ధర్మ పోరాటం అనేట్టుగానే ఉంది కానీ.. ఆ ఆర్భాటమేది టేకింగ్‌లో ప్రజెంట్ చేయలేకపోయారు. ఫస్టాఫ్‌లో కథని మొదలుపెట్టిన తీరు.. పాత్రల్ని పరిచయం చేసిన విధానం చూస్తే దర్శకుడు క్రిష్ వేసిన పునాది గట్టిదే అనే నమ్మకం కలిగింది. కానీ కథ ముందుకు వెళ్తున్నకొద్దీ క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న లోటు అయితే స్పష్ఠంగా కనిపించింది. ఈ ప్రాజెక్ట్‌ని చివరి వరకూ ఆయనే డీల్ చేసి ఉంటే రిజల్ట్ మరో విధంగా ఉండేదేమో కానీ.. వీరమల్లు కథలో దర్శకత్వ లోపం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

ఫస్టాఫ్‌లో ఔరంగజేబు అరాచకాలను చూపించిన తరువాత.. అతని దగ్గరే ఉన్న కొహినూర్ వజ్రం కోసం వీరమల్లు వేట సెకండాఫ్‌లో మొదలౌతుంది. ఇక కథ క్లైమాక్స్‌కి వచ్చాక.. తిరిగి ఎక్కడ మొదలైందో అక్కడే ఆగుతుంది. చివరి 18 నిమిషాలు యాక్షన్ ఎపిసోడ్‌ని తానే డైరెక్ట్ చేశానని చెప్పి ఫ్యాన్స్‌ని ఉత్సాహపరిచారు పవన్ కళ్యాణ్. అయితే సినిమా చూసిన తరువాత ఆయన చేయకుండా ఉండి ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. ఎందుకంటే.. అంత ఘోరంగా ఉన్నాయి సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సీన్లు. మధ్యలో హిందూ ధర్మ రక్షణ అనే మంచి పాయింట్ టచ్ చేసినా.. దాన్ని బలంగా చూపించలేకపోయారు. కోహినూర్‌ వజ్రంతో మొదలైన వీరమల్లు కథ ట్రాక్‌ తప్పి సనాతన ధర్మం వైపు వెళ్లిపోతుంది. పోనీ అక్కడైనా ఉందా అంటే.. క్లైమాక్స్‌లో జౌరంగజేబు, వీరమల్లు తలబడేవరకూ తీసుకుని వెళ్లి ఎండ్‌ కార్డ్ వేసేసి పార్ట్‌2లో చూసుకోండి.. మళ్లీ హరిహర వీరమల్లు యుద్థభూమిలో కలుద్దామనేశారు.

తాను పాలిటిక్స్‌లో బిజీగా ఉండటం వల్ల.. ఆ మంగళగిరిలోనే ఓ గోడౌన్‌లో సెట్ వేసి గ్రీన్ మ్యాట్‌లోనే కీలక సన్నివేషాలను, యాక్షన్ ఎపిసోడ్‌లను చిత్రీకరించామని చాలా గొప్పగా చెప్పారు పవన్ కళ్యాణ్. కానీ.. ఆ గోడౌన్‌లో చేసిని గ్రీన్ మ్యాట్ VFX గ్రాఫిక్ సీన్లే వీరమల్లుని ట్రోలింగ్ బాట పట్టిస్తాయి అనడంలో సందేహం లేదు. ఎందుకంటే అంత ఘోరంగా ఉంది ఆ VFX వర్క్. ఈ సినిమా పలు వాయిదాల పడ్డాయంటే.. క్వాలిటీ వీఎఫ్‌ఎక్స్ కోసం అని మేకర్స్ చెప్పిన మాట. కానీ ఫైనల్‌ ఔట్‌పుట్‌లో క్వాలిటీ అయితే కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే.. ఇటీవల కాలంలో ఆదిపురుష్, కన్నప్ప సినిమాల VFX వర్క్‌పై విమర్శలు వచ్చాయి కానీ.. వీరమల్లు వాటికేం తక్కువేం కాదు అన్నంత నాసిరకంగా ఉంది గ్రాఫిక్ వర్క్. దర్శకుడు జ్యోతి కృష్ణ ట్రైలర్ వరకూ అద్భుతమైన ఔట్ పుట్ ఇచ్చి.. సినిమాను నాసిరకంగా మార్చేశారు.

సరే ఈ టెక్నికల్ విషయాలను పక్కనపెట్టి.. కథ, కథనాల విషయానికి వస్తే చారిత్రక మూలాలను గుర్తు చేసే ఇలాంటి కథలో పాత్రలు ఎంత ప్రభావం చూపిస్తాయో.. ఆ పాత్రల మధ్య ఎమోషన్స్ అంతే కీలకం. అయితే ఈ సినిమాలో కట్టిపడేసే ఎమోషన్స్ కానీ.. కళ్లు చెమ్మగిల్లే కీలక సన్నివేషాలు కానీ లేకపోవడం ప్రధాన లోపం. తెరపై పవర్ స్టార్ కనిపిస్తున్నాడు.. భారీ తారగణం ఉంది.. భారీ డైలాగ్‌లు పడుతున్నాయి.. యాక్షన్ ఎలిమెంట్‌లు ఉన్నా కూడా లోపం ఏదో వెంటాడుతుందంటే అవే బలమైన భావోద్వేగాలు లేకపోవడం. సినిమా స్టార్టింగ్‌లో ‘దొరగారి కళ్లల్లోకి కళ్లు పెట్టి నేనొక్కడ్నే కాదు.. నా వాళ్లంతా చూడాలి’ అని వీరమల్లు రొమ్ము విరుచుకుని నిలబడే సీన్‌ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఆ తరహాలో ఎంగేజింగ్‌గా అనిపించే సీన్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి.

పాత్రల పరంగా వీరమల్లుగా పవన్ కళ్యాణ్ చాలానే కష్టపడ్డారు. పంచమి పాత్రలో హీరోయిన్ నిధి అగర్వాల్ మల్టీ షేడ్స్ ఉన్న పాత్ర చేసింది. మొదట దేవదాసిగా కనిపించి.. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో సర్ ప్రైజ్ చేసింది. హావభావాలను రంగరించే పాత్రమే కాదు కాబట్టి.. వాటితో పెద్దగా పని పడలేదు కానీ.. ఆమె మేకప్ అయితే డ్రామా ఆర్టిస్ట్‌ల కంటే ఘోరంగా ఉంది. స్క్రీన్‌పై చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ క్రూరత్వాన్ని చూపించాడు. అందర్నీ డామినేట్ చేసిపారేశాడు. వీరమల్లు కథ మొదలయ్యేది సత్యరాజ్‌తోనే. యుద్ధ విద్యలు తెలిసిన పురోహితుడిగా ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించారు. సెకండాఫ్ కోసం బంధీగా ఉన్న ఇతని పాత్రను దాచిపెట్టారు. వీరితో పాటు.. సునీల్, నాజర్, సుబ్బరాజు, సచిన్ ఖేడేకర్, అనుపమ్ ఖేర్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రీ, జిషుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, అనసూయ ఇలా చాలామందే నటీనటులు వాళ్ల పాత్రల్ని వాళ్లు చేసుకుంటూ పోయారు.

ఎంఎం కీరవాణి తన సొంత సినిమాలకు అంటే.. రాజమౌళి సినిమాలకు కొట్టినంత బాగా బయట సినిమాలకు మ్యూజిక్ ఇవ్వరనే టాక్ ఉంది. అయితే వీరమల్లు సినిమాతో ఆ టాక్‌ని చెరిపేసుకోవాలనే ప్రయత్నమో ఏమో కానీ.. తన నేపథ్య సంగీతంతో నార్మల్ సీన్లను కూడా హై రేంజ్‌కి తీసుకుని వెళ్లారు. ముఖ్యంగా క్లైమాక్స్‌ వార్ సీన్‌కి మొత్తం బాదిపారేశారు. వీరమల్లుకు కీరవాణి మ్యూజిక్కే బ్యాక్‌బోన్‌. సాంగ్స్ పర్వాలేదు. మరీ గుర్తించుకుని మళ్లీ మళ్లీ పాడుకునేంత గొప్ప మ్యూజిక్ అయితే ఇవ్వలేదు. పాటలకంటే బుర్రా సాయి మాధవ్ మాటలు బాగా పేలాయి. పవర్ స్టార్ కోసం చాలానే పవర్ ఫుల్ డైలాగ్‌లు ఉన్నాయి. వినాలీ.. వీరమల్లు చెప్తే వినాలీ అని అనిపించే డైలాగ్‌లు చాలానే ఉన్నాయి. ఈ సినిమా రన్ టైమ్ భారంగా అనిపిస్తుంది. పార్ట్ 2 కోసం కథని సాగదీసినట్టుగానే ఉంటుంది. సినిమాటోగ్రఫీ.. గ్రాఫిక్స్ జోడొద్దుల ప్రయాణం లాంటివి. ఒకటి ముందుకెళ్లి.. ఒకటి వెనుకున్నా.. రెండూ వెనకబడ్డట్టే. ఎస్ జ్ఞాన శంకర్, మనోజ్ పరమహంస కెమెరా వర్క్ బాగున్నా.. గ్రాఫిక్స్‌లో చెడగొట్టేశారు. 80 పర్సెంట్ గ్రీన్ మ్యాట్ షాట్‌లే కావడంతో విజువల్స్ కోసం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
సాధారణంగా ఒక సినిమా వాయిదా పడిందంటేనో.. లేదంటే ఏళ్లకి ఏళ్లుగా సినిమా తీస్తున్నారంటేనో.. ఆటోమేటిక్‌గా నెగిటివ్ ఇంపార్ట్ క్రియేట్ అవుతుంది. కానీ ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు.. ఐదేళ్లలో ఆరుసార్లకు పైగా రిలీజ్‌ డేట్‌లను ప్రకటించి వాయిదాల మీద వాయిదాలు వేయడంతో వీరమల్లు సినిమాపై నీలినీడలు అలుముకున్నాయి. ఎవరి గురించో ఎందుకు పవన్ కళ్యాణ్‌ కూడా.. అసలు ఈ సినిమా పూర్తి అవుతుందో లేదో అని డౌటానుమానం వ్యక్తం చేశారంటే ‘వీరమల్లు’ రిలీజ్ కావడం ఎంత అనితరసాధ్యమో ఊహించుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా.. ఓజీ ఓజీ అన్నారే తప్ప.. వీరా వీరా అని అనలేదంటే దానికి కారణాలు చాలానే ఉన్నాయి

క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం.. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం.. వీరమల్లు సినిమా తిరిగి పట్టాలెక్కడం ఇక కష్టమే అనుకున్నారంతా. కానీ.. క్రిష్ మొదలుపెట్టిన ప్రాజెక్ట్‌ని నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ భుజాలనెత్తుకుని ఈ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేశారు.

🔹 కీరవాణి లాంటి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందిస్తున్నా కూడా.. ఆయన స్థాయికి తగ్గట్టుగా వీరమల్లు పాటలు లేకపోగా.. ఒక్క పాట కూడా.. జనంలోకి బలంగా వెళ్లింది లేదు. ఇది కూడా వీరమల్లుకి బజ్ క్రియేట్ కాకపోవడానికి మెయిన్ రీజన్.

🔹ఎప్పుడైతే వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయ్యిందో.. ‘వినాలీ.. వీరమల్లు చెప్తే వినాలీ’ అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్ వినిపించిందో.. చాలామంది నోళ్లు మూతలు పడిపోయాయి. నిజానికి ట్రైలర్ ఆ రేంజ్‌లో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. విజువలైజేషన్ కూడా పీక్స్ అనిపించింది. జ్యోతికృష్ణ ఏం చేస్తాడులే.. క్రిష్ వదిలేసిన దాన్ని పూర్తి చేస్తేనే గొప్ప.. అనుకున్న వాళ్లంతా వీరమల్లు ట్రైలర్ ఔట్ పుట్ చూసి.. ‘ఒడియమ్మా ఇంత బాగా తీశాడేంట్రా’ అని అవాక్కయ్యారు.

2.56 నిమిషాల నిడివితో వచ్చిన ట్రైలర్ ‘వీరమల్లు’పై అప్పటి వరకూ ఉన్న అనుమానాలు, అపోహల్ని తరిమేసింది. ‘ఇప్పటి వరకు మేకల్ని తిన్న పులుల్ని చూసి ఉంటారు.. ఇప్పుడు పులుల్ని వేటాడే బొబ్బిల్ని చూస్తారు’ అంటూ వీరమల్లు గర్జనకి యూట్యూబ్ షేక్ అయ్యింది. వినాలి.. వీరమల్లు చెప్తే వినాలి అనే డైలాగ్‌కి రీసౌండ్ గట్టిగానే వచ్చింది.

ఇవన్నీ ఒక ఎత్తైతే.. ప్రకృతి విపత్తులు, మానవ విపత్తులు, రాజకీయ విపత్తులను తట్టుకొని నిలబడిన వీరమల్లు కోసం.. పవన్ కళ్యాణ్ నిలబడటం అనూహ్య పరిణామం. ఎందుకంటే.. ఆయన సినిమాలను ఆయనే చూడడు. ఇక ప్రమోషన్స్ చేయడం? అంటే అదో అనూహ్య పరిణామమే. ఎన్నో ఒడుదుడుగుల్ని ఓర్చుచుని నిలబడ్డ నిర్మాత ఏఎం రత్నంకి అండగా నిలబడటం నా కర్తవ్యం అంటూ పవన్ కళ్యాణ్.. వీరమల్లు ప్రమోషన్స్‌ని భుజాన వేసుకోవడంతో ఈ సినిమాకి ఒక్కసారిగా హైప్ వచ్చింది.

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో భారీ బడ్జెట్ మూవీగా, క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో 2020 జనవరిలో ఈ చిత్రం అధికారికంగా ప్రకటించారు. 2020 సెప్టెంబర్‌లో సెట్స్‌ మీదికి వెళ్లిన ఈ సినిమా కంప్లీట్ అయ్యేసరికి దాదాపు ఐదేళ్ల సమయం పట్టింది. ఓ వైపు కరోనా.. మరోవైపు పవన్ పాలిటిక్స్ కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది.
మధ్యలో దర్శకుడు క్రిష్‌కి చిత్ర నిర్మాతకు మధ్య సఖ్యత లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారాయన. ఆ తరువాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతల్ని తీసుకున్నారు. ఆయన డైరెక్షన్‌లో ప్రాజెక్ట్ మరీ నత్తనడకన సాగింది.

క్రిష్ రాసిన కథను రెండు భాగాలుగా రూపొందించాలని నిర్ణయించుకుని.. ఫస్ట్ పార్ట్‌ని ‘హరి హర వీరమల్లు: స్వోర్డ్‌ అండ్‌ స్పిరిట్‌’ పేరుతో రిలీజ్‌కి సిద్దమయ్యారు. అయితే ఈ సినిమా రిలీజ్‌ని పదే పదే వాయిదాలు పడటంతో చిత్ర పరిశ్రమలో ఎక్కువసార్లు వాయిదా పడ్డ చిత్రంగా నిలిచింది. ఎట్టకేలకు జూలై 24న అది కూడా అమావాస్య నాడు రిలీజ్‌కి ముహూర్తం ఫిక్స్ చేసుకోవడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. పోయి పోయి అమావాస్య రోజున విడుదల చేస్తున్నారనే విమర్శలూ వినిపించాయి.

తెలుగుతో పాటు.. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అవుతోంది వీరమల్లు. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ పాన్ ఇండియా అని అన్నారు కానీ.. ఆ రేంజ్‌లో అయితే ఆ సినిమా రిలీజ్ కాలేదు. ఆ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ ‘వీరమల్లు’ కావడం విశేషం. అప్పటికీ ఇప్పటికీ పాన్ ఇండియా లెక్కలు మారిపోయాయి కాబట్టి పవన్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా మూవీ అంటే ‘వీరమల్లు’ అనే చెప్పొచ్చు.

ఈ సినిమా కథపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఒక పీరియడ్ డ్రామా అని.. పవన్ రాబిన్ హుడ్‌గా కోహినూర్ వజ్రం చుట్టూ జరిగే కథ అని వార్తలొచ్చాయి. అదే సందర్భంలో తెలంగాణ పోరాటవీరుడు పండుగ సాయన్న జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన కథ అనే టాక్ నడిచింది. హరిహర వీరమల్లు అనే టైటిల్ పెట్టడంతో ఇది.. హరి హర రాయలు కథ అని.. హిందూ సంస్కృతి, ధర్మాన్ని రక్షించి, భవిష్యత్ తరాలకు అందించిన హరి హర రాయలు కథని స్ఫూర్తిగా తీసుకునే వీరమల్లును తెరకెక్కిస్తున్నారని వార్తలు వచ్చాయి.

వీటన్నింటి నేపథ్యంలో వీరమల్లుని వివాదాలు చుట్టేశాయి. ఈ కథ తెలంగాణ పోరాట యోధుడు పండుగ సాయన్నను జీవితంతో పోలి ఉండటంతో బీసీ సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చింది. చరిత్రను వక్రీకరించి తీస్తున్న ఈ సినిమాను అడ్డుకుంటామంటూ హెచ్చరించారు. దాంతో మేకర్స్ వివరణ ఇచ్చి.. ఇది పూర్తి కల్పిత కథ అని వీరమల్లు కథపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు.

క్రిష్ నుంచి జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న తరువాత.. వీరమల్లు కథను పూర్తిగా మారిందని.. క్రిష్ చెప్పిన కథలో సారాన్ని అలాగే ఉంచుతూ కథలో మార్పులు చేర్పులు చేసి సరికొత్తగా మలిచారని స్పష్ఠం చేశారు.

‘హరిహర వీరమల్లు’ను శివుడు, విష్ణువుల అవతారంగా చూపించారు. హరి (విష్ణు), హర (శివుడు) అనే టైటిల్ చిత్ర సారాంశాన్ని తెలియజేస్తుంది. విష్ణువు వాహనం గరుడ పక్షి కాగా.. దాన్ని సూచిస్తూ ‘డేగ’ను వీరమల్లులో చూపించారు. అలాగే శివుడు డమరుకం.. వీరమల్లు చేతుల్లో పెట్టడాన్ని బట్టి చూస్తే.. ధర్మ రక్షణకు శివుడు, విష్ణువుల అవతారంగా వీరమల్లును చూపిస్తున్నారు.

హరిహర వీరమల్లు నటీనటులు
పవన్ కళ్యాణ్
నిధి అగర్వాల్
బాబీ డియోల్
నాజర్
సత్యరాజ్
కబీర్ దుహాన్ సింగ్
నర్గీస్ ఫక్రీ
సునీల్
పూజిత పొన్నాడ
అనసూయ భరద్వాజ్
సచిన్ ఖేడేకర్
రఘుబాబు
సుబ్బరాజు

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ
నిర్మాత: ఏఎం రత్నం, ఏ దయాకర రావు
బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్స్
మాటలు: బుర్రా సాయి మాధవ్
సంగీతం: ఎంఎం కీరవాణి
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంస
ఎడిటర్ : ప్రవీణ్ కేఎల్
ఫైట్స్ : రామ్-లక్ష్మణ్, షామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్, పవన్ కళ్యాణ్

రేటింగ్ 3.5/5

Tags: #AndhraPradesh#CinemaCelebrities#CmChandrababuNaidu#DeputyCMPawanKalyan#EntertainmentTrending#HariHaraVeeraMallu#HariHaraVeeraMalluBusiness#HariHaraVeeraMalluFirstReview#HariHaraVeeraMalluMovieReview#HariHaraVeeraMalluPreRelease#HariHaraVeeraMalluReleaseDate#HariHaraVeeraMalluReview#LatestNews#PanIndia#pawankalyan#PowerStar#TeluguNews#tollywood#TrendingNewsEntertainment
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Chiranjeevi: స్లిమ్ గా..!

Next Post

Janhvi Kapoor: ఆగ్రహం..ఆవేదన

Related Posts

Peddi: యువ‌త హృద‌యాల్ని దోచేలా
Entertainment

Peddi: యువ‌త హృద‌యాల్ని దోచేలా

Johnny Lever: చేదు అనుభవం!
Entertainment

Johnny Lever: చేదు అనుభవం!

Kareena Kapoor: యువ హీరోతో ప్రేమ‌లో..!
Entertainment

Kareena Kapoor: యువ హీరోతో ప్రేమ‌లో..!

Tamannaah Bhatia: సెన్సేష‌న‌ల్ కామెంట్స్
Entertainment

Tamannaah Bhatia: సెన్సేష‌న‌ల్ కామెంట్స్

Hari Hara Veera Mallu: పవర్ ఫుల్ గా
Entertainment

Hari Hara Veera Mallu: పవర్ ఫుల్ గా

Regina Cassandra: వారిదే కీలక పాత్ర..!
Entertainment

Regina Cassandra: వారిదే కీలక పాత్ర..!

Next Post
Janhvi Kapoor: ఆగ్రహం..ఆవేదన

Janhvi Kapoor: ఆగ్రహం..ఆవేదన

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Cm Revanth Reddy: ప్ర‌తిష్టాత్మ‌కంగా కుల గ‌ణ‌న స‌ర్వే

Cm Revanth Reddy: ప్ర‌తిష్టాత్మ‌కంగా కుల గ‌ణ‌న స‌ర్వే

Karnataka: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ధర్మస్థల హత్యల వివాదం?

Karnataka: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ధర్మస్థల హత్యల వివాదం?

Chitoor: పెద్దిరెడ్డి గన్ మ్యాన్ సస్పెండ్.. ఎందుకంటే?

Chitoor: పెద్దిరెడ్డి గన్ మ్యాన్ సస్పెండ్.. ఎందుకంటే?

Kamal Haasan: ఎట్టకేలకు నెరవేర్చుకున్న కల

Kamal Haasan: ఎట్టకేలకు నెరవేర్చుకున్న కల

Recent News

Cm Revanth Reddy: ప్ర‌తిష్టాత్మ‌కంగా కుల గ‌ణ‌న స‌ర్వే

Cm Revanth Reddy: ప్ర‌తిష్టాత్మ‌కంగా కుల గ‌ణ‌న స‌ర్వే

Karnataka: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ధర్మస్థల హత్యల వివాదం?

Karnataka: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ధర్మస్థల హత్యల వివాదం?

Chitoor: పెద్దిరెడ్డి గన్ మ్యాన్ సస్పెండ్.. ఎందుకంటే?

Chitoor: పెద్దిరెడ్డి గన్ మ్యాన్ సస్పెండ్.. ఎందుకంటే?

Kamal Haasan: ఎట్టకేలకు నెరవేర్చుకున్న కల

Kamal Haasan: ఎట్టకేలకు నెరవేర్చుకున్న కల

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info