గ్రామీణ ప్రాంతాల్లోని భవనాలకు.. పట్టణ, నగరాల్లోని భవనాలకు చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మనం తిరిగితే ఒక కొత్త అనుభూతి లభిస్తుంది. ఎన్నడూ చూడని వెరైటీ డిజైన్‌లో బిడ్లింగ్స్ కనిపిస్తాయి. అంతేకాదు.. ఇవి సాధారణ భవనాల కంటే ఎత్తైనవిగా ఉంటాయి. కొన్ని భవనాలను ఐతే, తల పూర్తిగా పైకెత్తి చూడాల్సి వస్తుంది.
ఐతే, ఇలాంటి భవనాల మధ్య ఒక కామన్ పాయింట్ ఉంటుంది. మీరు సరిగ్గా గమనిస్తే.. ఈ ఎత్తైన భవనాలన్నీ గాజుతో నిర్మిస్తారు. గాజుతో చేయడం కారణంగా ఈ భవనాలు మరింత అందంగా.. స్టైలిష్ గా కనిపిస్తాయి. ఈ ఎత్తైన భవనాలను గాజుతో తయారు చేయడానికి కారణం లుక్ మాత్రమే కాదు.. మరో ముఖ్యమైనా రీజన్ కూడా ఉంది. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. మరి పొడవైన భవనాలను గాజుతో ఎందుకు నిర్మిస్తారో, వాటి ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విద్యుత్తు ఆదా (Electricity Saving):
పొడవైన భవనాలను గాజుతో నిర్మించడం వల్ల విద్యుత్తు ఆదా చేయడం అనేది ముఖ్యమైన ప్రయోజనం. గాజు ద్వారా బయట కాంతి భవనంలోకి వస్తుంది కాబట్టి, పగటిపూట తక్కువ లైట్లు వెలిగించాల్సి ఉంటుంది.
వేడి నియంత్రణ (Heat Control):
ఎత్తు, పొడవైన భవనాలలో ఉపయోగించే గాజు ప్రత్యేక రకానికి చెందినది. ఇది బయటనుంచి వచ్చే వేడి లేదా చల్లదనం లోపలికి అనుమతించదు. ఈ విధంగా AC లేదా హీటర్ వినియోగాన్ని తగ్గిస్తుంది. తద్వారా ఎక్కువ విద్యుత్తు ఆదా అవుతుంది.
బలమైన గాజు భవనాలు:
ఈ గాజు భవనాలు తుఫానులు, భూకంపాలు లేదా ఇతర ఒత్తిళ్లను తట్టుకునే విధంగా రూపొందిస్తారు. ఇవి తేమ (humidity) కారణంగా కూడా నష్టం చేయకుండా అన్ని సీజన్లను తట్టుకోగలవు.గాజుతో తయారు చేయబడిన భవనాలు అగ్ని ప్రమాదం నుండి రక్షణ కల్పిస్తాయి. అంతేకాకుండా.. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు బయటకు వచ్చేందుకు సమయం లభిస్తుంది. అలాగే భవనానికి పెద్దగా నష్టం జరగదు.గాజు భవనాలపై దుమ్ము, ధూళి తక్కువగా పేరుకుంటాయి. కాబట్టి, గాజు భవనాలను శుభ్రం చేయడానికి పెద్దగా ఖర్చు అవ్వదు. ఇటుక లేదా రాతి గోడల కంటే తక్కువ నిర్వహణ అవసరమవుతుంది.