ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Hyderabad : ఏమిటీ ఫ్యూచర్ సిటీ..హైదరాబాద్‌కి ఎటువైపు రాబోతుంది..?

Hyderabad : ఏమిటీ ఫ్యూచర్ సిటీ..హైదరాబాద్‌కి ఎటువైపు రాబోతుంది..?
ADVERTISEMENT

హైదరాబాద్.. సికింద్రాబాద్.. సైబరాబాద్.. ఇప్పుడు నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ కోర్ సిటీకి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ కొత్త నగరం రానుందని ప్రచారం చేస్తోంది.ఇందుకు అవసరమైన భూ సేకరణ చేస్తామని ప్రభుత్వం చెబుతుండగా.. రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్న ఎత్తుగడంటూ విమర్శలు చేస్తోంది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ.

 

హైదరాబాద్ నగరం మొదటగా ఏర్పడింది. చారిత్రక ఆనవాళ్లు పరిశీలిస్తే.. నగరానికి భాగ్యనగరం లేదా ముత్యాల నగరంగా కూడా పేరుంది. హైదరాబాద్‌ను 1591లో మొహమ్మద్ కులీకుతుబ్ షా కట్టినట్లుగా చారిత్రక అధారాలున్నాయి.ఆ తర్వాత మూడో నిజాం సమయంలో 1800 శతాబ్దం ప్రారంభంలో మూసీ నదికి ఉత్తరాన సికింద్రాబాద్ నగరం ఏర్పాటైంది.

 

1990ల చివర్లో సైబరాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందుతూ వచ్చింది. దీన్ని హైటెక్ సిటీగా పిలుస్తుంటారు. అప్పట్నుంచి హైదరాబాద్ నగరాన్ని మూడు ప్రాంతాలుగా పిలుస్తున్నారు ఇక్కడి ప్రజలు.గత 20, 30 ఏళ్లుగా హైదరాబాద్ నగరం విస్తరిస్తోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాలు నివాసప్రాంతాలుగా రూపాంతరం చెందాయి.

 

2011 జనాభా లెక్కల ప్రకారం 67,31,790 మంది హైదరాబాద్ నగరంలో నివసిస్తుండగా.. ఇప్పుడు ఆ సంఖ్య కోటికి చేరి ఉంటుందని అంచనా.హైదరాబాద్ శివారు ప్రాంతాలు వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్త నగరం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. దీనికితోడు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) 7,257 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది.ఇప్పుడు హెచ్ఎండీఏలోని కొన్ని ప్రాంతాలను విడదీసి ఫ్యూచర్ సిటీగా ఏర్పాటు చేస్తున్నామని చెబుతోంది ప్రభుత్వం.ఔటర్ రింగు రోడ్డు వెలుపల ఏర్పాటు కానుంది ఫ్యూచర్ సిటీ. ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

హైదరాబాద్-నాగార్జున్ సాగర్ హైవే నుంచి హైదరాబాద్- శ్రీశైలం హైవే మధ్య ఉన్న ప్రాంతమిది.తెలంగాణ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీజీఐఐసీ) ఆధ్వర్యంలో దీన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిని మొత్తం 12 జోన్లుగా విభజించనున్నారు.

 

”ఫ్యూచర్ సిటీ అనేది ప్రణాళికాబద్దమైన నగరం. మల్టీమోడల్ కనెక్టివిటీ.. బస్సు, మెట్రో రైల్, మోడ్రన్ అర్బన్ ఎమినిటీస్, రేడియల్ రోడ్స్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, క్రికెట్ స్టేడియం, ఎడ్యుకేషన్ హబ్, హెల్త్ హబ్ వస్తాయి.” అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.గతంలో దీన్ని ఫోర్త్ సిటీగా పిలవగా.. ఇప్పుడు ఫ్యూచర్ సిటీగా పేరుమార్చింది ప్రభుత్వం.

 

ఇప్పటికే ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దీనికి ఎయిర్ పోర్టు నుంచి మెట్రో రైల్ కనెక్టివిటీ ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. అందుకోసం క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేశారు.

 

అయితే, ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఉన్నాయని.. ఫ్యూచర్ సిటీ అవసరం లేదని అభిప్రాయపడ్డారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి.”ప్రస్తుతం ఉన్న నగరంలో చాలా వరకు బస్తీలు, కాలనీల్లో మౌలిక వసతులు లేవు. ముందుగా వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి” అన్నారాయన.ఈ ఏడాది మార్చి 12వ తేదీన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 765.28 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇది ఉంటుంది.

 

ఏడు మండలాల పరిధిలో 56 గ్రామాలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ ఏరియా నుంచి మినహాయించి, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కిందకు తీసుకొస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది.ఇందులో రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆమనగల్, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాలున్నాయి.ఫ్యూచర్ సిటీ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి చైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు.

 

వైస్ చైర్మన్‌గా మునిసిపల్ శాఖ మంత్రి, సభ్యులుగా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ(ఫైనాన్స్), పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్, టీజీఐఐసీసీ ఎండీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, డీటీసీపీ-హైదరాబాద్, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ ఉంటారు.

 

”చండీగఢ్ తర్వాత దేశంలో ప్రణాళికాబద్దమైన నగరం మరోటి రాలేదు. ఫ్యూచర్ సిటీ ప్రణాళికాబద్దంగా ఉంటుంది. దీన్ని లక్ష ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించాం. అన్ని రకాల పరిశ్రమలు, సాంకేతిక నైపుణ్యంతో పోటీ పడేలా ప్రణాళికలు రచిస్తున్నాం.” అని చెప్పారు రేవంత్ రెడ్డి.మరోవైపు, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీకి తెలంగాణ బడ్జెట్ 2025-26లో రూ.4701.92 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.అయితే, ఫ్యూచర్ సిటీకి ఏ ప్రాతిపదికన భూములు సేకరిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

 

” గతంలో హెచ్ఎండీఏకు విధివిధానాలు ఉండేవి. ఇప్పుడు అలాంటివి చెప్పడం లేదు. 3000 ఎకరాలకు మరోసారి నోటిఫికేషన్ ఇచ్చారు. సగం గ్రామాలు ఫ్యూచర్ సిటీలో కలిపి.. మిగిలిన గ్రామాలను బయట ఉంచి అయోమయానికి గురిచేస్తోందీ ప్రభుత్వం” అన్నారు సబితా రెడ్డి.గతంలో కందుకూరు, యాచారం మండలాల పరిధిలో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పట్లో భూసేకరణ కూడా చేపట్టింది.

 

మొత్తం 19,333 ఎకరాల్లో 5.6 లక్షల మందికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి కల్పించే ఉద్దేశంతో హైదరాబాద్ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దీనికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్) హోదాను సైతం ఇచ్చింది.అయితే, ఈ ఫార్మాసిటీ స్థానంలోనే ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తోంది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.

 

ఫార్మాసిటీ రద్దు చేస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో నిరుడు సెప్టెంబర్‌లో ప్రభుత్వం నివేదిక సమర్పించింది. దాని ప్రకారం, మొత్తం ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని, 1700 ఎకరాల్లో మాత్రమే ఫార్మసిటీ కొనసాగుతుందని నివేదించింది. అది కూడా గ్రీన్ ఫార్మాసిటీగా కొనసాగుతుందని చెప్పింది.

 

”నెట్ జీరో నగరంగా.. అంటే కాలుష్యం లేని నగరంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతాం” అని చెప్పారు రేవంత్ రెడ్డి.కానీ, ఇప్పటికే ఉన్న నగరాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు పద్మనాభరెడ్డి.

 

”నగరం కట్టడం అంటే ఒక్కరోజులో అయ్యేది కాదు, ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్, అప్పుల నేపథ్యంలో కొత్త నగరానికి ఖర్చు పెట్టడం ఏ మేరకు సాధ్యమనేది ఆలోచించాలి. దీనికి చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది” అని చెప్పారు.మరోవైపు, ఫ్యూచర్ సిటీ విషయంపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్. తమ భూములకు రియల్ ఎస్టేట్ పెంచుకునేందుకే ఫ్యూచర్ సిటీని తీసుకొచ్చారని ఫిబ్రవరిలో రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌లో జరిగిన సభలో అన్నారు.

Tags: #BuildTheFuture#FutureCityHyderabad#HITECCity2#Hyderabad2030#HyderabadDevelopment#HyderabadFutureCity#InfrastructureBoost#NextGenHyderabad#SmartCityHyd#UrbanRevolution
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Apsara Murder: పూజారి సాయికి జీవిత ఖైదు

Next Post

Toilet : మొబైల్‌ ఫోన్ పట్టుకుని వెళ్తున్నారా..?

Related Posts

Nakshatra
Entertainment

Nakshatra : ‘తెల్ల కాగితం’తో హీరోయిన్‌గా నక్షత్ర.. తొలి సినిమాతోనే అదరగొట్టిందిగా!

Rayalaseema Development
Andhra Pradesh

Rayalaseema Development: రెండేళ్లలోనే మారుతున్న రాయలసీమ రాత.. ఇండస్ట్రీ, అగ్రి, ఎనర్జీ హబ్‌గా కొత్త రూపం

Revanth Reddy KCR Family Assets Row
Big Story

Revanth Reddy KCR Family Assets Row: రేవంత్‌-కేసీఆర్‌ కుటుంబాల ఆస్తుల పంచాయితీ.. ఆరోపణలు ఎటు దారి?

Miyapur PG Student Murder
Big Story

Miyapur PG Student Murder: మియాపూర్ హోటల్‌లో పీజీ వైద్య విద్యార్థిని సృజన మృతి.. రవికుమార్ కోసం పోలీసుల గాలింపు

Telangana Cabinet
Big Story

Telangana Cabinet : ఉద్యోగులకు రెండు డీఏలు.. కరువు, విద్యుత్‌పై కీలక నిర్ణయాలు

Captain Smith Macher
Big Story

Captain Smith Macher: కత్తి దాడి జరిగినా విమానాన్ని కాపాడిన భారతీయ పైలట్.. రియల్ హీరోకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు

Next Post
Toilet : మొబైల్‌ ఫోన్ పట్టుకుని వెళ్తున్నారా..?

Toilet : మొబైల్‌ ఫోన్ పట్టుకుని వెళ్తున్నారా..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Nakshatra

Nakshatra : ‘తెల్ల కాగితం’తో హీరోయిన్‌గా నక్షత్ర.. తొలి సినిమాతోనే అదరగొట్టిందిగా!

Rayalaseema Development

Rayalaseema Development: రెండేళ్లలోనే మారుతున్న రాయలసీమ రాత.. ఇండస్ట్రీ, అగ్రి, ఎనర్జీ హబ్‌గా కొత్త రూపం

Revanth Reddy KCR Family Assets Row

Revanth Reddy KCR Family Assets Row: రేవంత్‌-కేసీఆర్‌ కుటుంబాల ఆస్తుల పంచాయితీ.. ఆరోపణలు ఎటు దారి?

Miyapur PG Student Murder

Miyapur PG Student Murder: మియాపూర్ హోటల్‌లో పీజీ వైద్య విద్యార్థిని సృజన మృతి.. రవికుమార్ కోసం పోలీసుల గాలింపు

Recent News

Nakshatra

Nakshatra : ‘తెల్ల కాగితం’తో హీరోయిన్‌గా నక్షత్ర.. తొలి సినిమాతోనే అదరగొట్టిందిగా!

Rayalaseema Development

Rayalaseema Development: రెండేళ్లలోనే మారుతున్న రాయలసీమ రాత.. ఇండస్ట్రీ, అగ్రి, ఎనర్జీ హబ్‌గా కొత్త రూపం

Revanth Reddy KCR Family Assets Row

Revanth Reddy KCR Family Assets Row: రేవంత్‌-కేసీఆర్‌ కుటుంబాల ఆస్తుల పంచాయితీ.. ఆరోపణలు ఎటు దారి?

Miyapur PG Student Murder

Miyapur PG Student Murder: మియాపూర్ హోటల్‌లో పీజీ వైద్య విద్యార్థిని సృజన మృతి.. రవికుమార్ కోసం పోలీసుల గాలింపు

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info