Y.S.Jagan: వైయస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇటీవల సొంత నేతల నుంచి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 2019 ఎన్నికలలో భారీ మెజారిటీ సాధించిన జగన్ 2024 ఎన్నికలలో పూర్తిస్థాయిలో ఓటమిపాలు కావడంతో ఎంతోమంది కీలక నేతలు పార్టీ నుంచి దూరమవుతున్నారు. అయితే త్వరలోనే మరొక మాజీ ఎమ్మెల్యే కూడా పార్టీ వీడియో ఆలోచనలో ఉన్నారా అంటే అవును అనే తెలుస్తోంది. సింగనమల నియోజకవర్గంలో 2019 ఎన్నికలలో విజయం సాధించిన జొన్నలగడ్డ పద్మావతి ఆలూరు సాంబశివారెడ్డి దంపతులు పార్టీ కోసం ఎంతో కృషి చేశారు.
ఇకపోతే ఇటీవల కాలంలో సింగనమల నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలను మాజీ మంత్రి సాకే శైలజ నాథ్ కు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. ఈ విషయం నచ్చని జొన్నలగడ్డ పద్మావతి సాంబశివారెడ్డి దంపతులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల బుక్కరాయసముద్రంలో ఏర్పాటు చేసిన వైకాపా శింగనమల నియోజకవర్గ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సాంబశివరెడ్డి పద్మావతి దంపతులతో పాటు గత ఎన్నికలలో పోటీ చేసిన వీరాంజనేయులు కూడా దూరంగా ఉన్నారు.
ఈ కార్యక్రమానికి ఎంపీ మిధున్ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి సాకే శైలజనాథ్ వంటి తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి సాంబశివరెడ్డి దంపతులు గైహాజరు కావడంతో సాకే శైలజ నాథ్ కు నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వడంతోనే వీరు దూరంగా ఉన్నారని త్వరలోనే పార్టీ కూడా మారే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినపడుతున్నాయి. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.