ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Food Adulteration in India: కల్తీ కబంధ హస్తాల్లో ఆరోగ్యం – అప్రమత్తతే ప్రజల రక్షణ కవచం

Food Adulteration in India
ADVERTISEMENT

Food Adulteration in India is becoming a serious public health concern. కల్తీ ఆహారం, నకిలీ మందులు, అనారోగ్యకర జీవనశైలి వల్ల పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు, నివారణ చర్యలు, ప్రజల బాధ్యతలు, ప్రభుత్వ చర్యలపై సమగ్ర విశ్లేషణ.

“ఆరోగ్యమే మహాభాగ్యం” అనే మాట భారతీయ సంస్కృతిలో శాశ్వత సత్యం. మనిషి సంపాదించే ధనం, కూడబెట్టే ఆస్తులు, సంపాదించే హోదా, పేరు ప్రతిష్ఠలు అన్నీ ఆరోగ్యం ఉన్నప్పుడే విలువైనవిగా నిలుస్తాయి. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఆహారమే అనారోగ్యానికి కారణమవుతోంది. మనం డబ్బు పెట్టి కొనుగోలు చేస్తున్న ఆహారం, మనమే అలవాటు చేసుకున్న జీవనశైలి, నిర్లక్ష్యపు ఆహారపు అలవాట్లు, కల్తీ పదార్థాలు, నకిలీ మందులు కలిసి దేశాన్ని నెమ్మదిగా రోగాల బారిన పడేస్తున్నాయి.

అధిక లాభాల కోసం కొందరు వ్యాపారులు ఆహార పదార్థాల్లో కల్తీ చేయడం సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారింది. పాలు, నెయ్యి, వంటనూనెలు, మిరపపొడి, పసుపు, మసాలాలు, తేనె, స్వీట్లు, శీతల పానీయాలు, పండ్లు, కూరగాయలు, పిల్లలు తినే చిరుతిళ్లు వరకు కల్తీ కోరల్లో చిక్కుకుంటున్నాయి. రసాయనాలతో పండించిన పండ్లు, కృత్రిమ రంగులు కలిపిన స్వీట్లు, నాణ్యతలేని నూనెలు, హానికరమైన పదార్థాలతో తయారైన ఆహారం ప్రజల ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తోంది.

రుచికరమైన ఆహారం పేరుతో నేడు అనేక మంది ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. మెరుపులాంటి ప్యాకింగ్‌లు, ఆకర్షణీయమైన ప్రకటనలు, ఆన్‌లైన్ ఆఫర్లు, తక్కువ ధరలు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. కానీ ఆ ఆహారంలోని పోషక విలువలు, రసాయనాల మోతాదు, నాణ్యత గురించి చాలా తక్కువ మంది మాత్రమే ఆలోచిస్తున్నారు. నాలుకకు నచ్చిన ప్రతి ఆహారం శరీరానికి మేలు చేయదు అనే విషయాన్ని సమాజం గుర్తించాల్సిన సమయం వచ్చింది.

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం, ఒత్తిడి, ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి, అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు పదార్థాల వినియోగం వల్ల మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులు, కాలేయ సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు నేడు యువతలో, చిన్న వయస్సు వారిలో కూడా కనిపించడం అత్యంత ఆందోళనకరమైన పరిణామం.

ఆరోగ్యంపై నిర్లక్ష్యం ఎంత ఖరీదైనదో నేడు ప్రతి కుటుంబం అనుభవిస్తోంది. ముఖ్యంగా ఇంట్లో ఒక కిడ్నీ రోగి ఉంటే సాధారణ మధ్యతరగతి కుటుంబం ఆర్థికంగా పూర్తిగా కుదేలయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. డయాలసిస్, మందులు, పరీక్షలు, ఆసుపత్రి ఖర్చులు కుటుంబం కూడబెట్టిన ఆస్తులను కరిగించేస్తున్నాయి. చాలామంది ఇళ్లు, భూములు అమ్ముకుని వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. చివరికి ఆస్తులు పోవడమే కాదు, కొన్నిసార్లు ప్రాణాలను కూడా కాపాడలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన సమయంలో నిర్లక్ష్యం చేస్తే, సంపాదించిన ధనమంతా ఆసుపత్రులకే చేరే దుస్థితి ఏర్పడుతోంది. నిజానికి నేడు ప్రజలు డబ్బు పెట్టి తినే తిండితోనే జబ్బులు కొనుగోలు చేసి, ఆ తర్వాత అదే డబ్బుతో వైద్యం చేయించుకునే విషాదకర పరిస్థితి నెలకొంది.

వ్యసనాలు కూడా ప్రజారోగ్యానికి పెద్ద శత్రువులుగా మారాయి. మద్యపానం, ధూమపానం, గుట్కా, పొగాకు, మాదక ద్రవ్యాల వినియోగం శరీరంలోని ప్రతి అవయవాన్ని దెబ్బతీస్తోంది. కాలేయం, ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అనేక రకాల క్యాన్సర్లు, గుండెపోటులు, పక్షవాతం వంటి ప్రాణాంతక వ్యాధులకు ఇవి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. వ్యసనం కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాదు, మొత్తం కుటుంబాన్ని ఆర్థికంగా, మానసికంగా కుంగదీస్తుంది.

మందుల విషయంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నకిలీ మందులు, నాణ్యతలేని ఔషధాలు, వైద్యుల సలహా లేకుండా స్వయంగా మందులు వాడడం, గుర్తు తెలియని ప్రదేశాల నుంచి ఔషధాలు కొనుగోలు చేయడం వంటి అలవాట్లు ప్రాణాలకు ముప్పుగా మారవచ్చు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కోసం పరుగులు తీయడం కంటే, వ్యాధి రాకుండా జీవనశైలిని మార్చుకోవడం ఎంతో మేలు.

ఇప్పటి పరిస్థితుల్లో చికిత్స కంటే నివారణకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. “ప్రివెంటివ్ హెల్త్” అనేది వ్యక్తిగత బాధ్యతగా మారాలి. సమతుల్య ఆహారం, ఇంటి వంట, ఆకుకూరలు, పండ్లు, తగినంత నీరు, ప్రతిరోజూ వ్యాయామం, యోగా, ధ్యానం, సమయానికి నిద్ర, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, మానసిక ప్రశాంతత వంటి అలవాట్లు అనేక వ్యాధులను ముందుగానే నివారించగలవు.

అదే సమయంలో భారతదేశంలో వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం వంటి సంప్రదాయ ఆరోగ్య విధానాలపై శాస్త్రీయ అవగాహన కూడా ప్రజల్లో పెరగాలి. ఇవి అత్యవసర వైద్యానికి ప్రత్యామ్నాయం కాకపోయినా, ఆరోగ్యకరమైన జీవనశైలి, నివారణ చర్యలు, శారీరక-మానసిక శ్రేయస్సుకు తోడ్పడే మార్గాల గురించి అవగాహన కల్పించడంలో ఉపయోగపడతాయి. ఇటువంటి అంశాలను శాస్త్రీయ దృక్పథంతో ప్రజలకు చేరవేయడం అవసరం.

ఆరోగ్య విద్యను కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయకుండా పాఠశాల స్థాయి నుంచే తప్పనిసరి అంశంగా బోధించాల్సిన అవసరం ఉంది. మంచి ఆహారపు అలవాట్లు, పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, వ్యాయామం, మానసిక ఆరోగ్యం, వ్యసనాల దుష్పరిణామాలు, ప్రాథమిక ప్రథమ చికిత్స, వ్యాధుల నివారణ, శాస్త్రీయ దృక్పథంతో సంప్రదాయ ఆరోగ్య విధానాలపై అవగాహన వంటి అంశాలతో ప్రత్యేక సబ్జెక్టు రూపొందిస్తే భవిష్యత్ తరాలు ఆరోగ్యవంతంగా ఎదుగుతాయి. పిల్లల్లో చిన్ననాటి నుంచే ఆరోగ్య సంస్కృతి పెంపొందితే దేశ భవిష్యత్తు కూడా బలోపేతమవుతుంది.

ఇప్పటికైనా సమాజం అప్రమత్తం కాకపోతే, జీవనశైలి సంబంధిత వ్యాధుల భారంతో భారత్ ప్రపంచంలో అత్యధిక రోగులున్న దేశాల్లో ఒకటిగా మారే ప్రమాదం ఉందనే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయరాదు. ఈ పరిస్థితిని మార్చాలంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. కల్తీ ఆహారంపై రాజీ లేకుండా దాడులు నిర్వహించాలి. నకిలీ మందుల తయారీదారులపై కఠిన శిక్షలు అమలు చేయాలి. ఆహార భద్రత ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలి. అదే సమయంలో నిజాయితీగా వ్యాపారం చేసే వారిని ప్రోత్సహించాలి.

ప్రజల బాధ్యత కూడా అంతే కీలకం. వస్తువులు కొనుగోలు చేసే ముందు నాణ్యత, తయారీ తేదీ, గడువు తేదీ, ధృవీకరణ గుర్తులను పరిశీలించాలి. అనుమానాస్పద ఆహార పదార్థాలు, కల్తీ వస్తువులు కనిపిస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఇంటి వంటకు ప్రాధాన్యం ఇవ్వాలి. పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పాలి. వ్యసనాలకు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే కేవలం రోగం వచ్చినప్పుడు మందులు వాడటం కాదు; రోగం రాకుండా జీవించడం. కల్తీ లేని ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి, ప్రజల అప్రమత్తత, ప్రభుత్వ కఠిన చర్యలు, వ్యాపారుల నైతిక బాధ్యత, పాఠశాల స్థాయి నుంచే ఆరోగ్య విద్య ఈ ఐదు స్తంభాలపైనే ఆరోగ్యవంతమైన భారతదేశం నిర్మాణం సాధ్యమవుతుంది.

జాగ్రత్తగా తినే ప్రతి ముద్ద ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నిర్లక్ష్యంగా తినే ప్రతి ముద్ద అనారోగ్యానికి ఆహ్వానం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. జాగ్రత్తే జీవన రక్షణ కవచం.

నరసింహారెడ్డి చందమూరి.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు.
కదిరి.

Food Safet

Tags: #EatHealthy#FakeMedicines#FoodAdulterationInIndia#FoodQuality#FoodSafety#FSSAI#HealthAwareness#HealthEducation#HealthFirst#HealthNews#HealthyLifestyle#IndiaHealth#news7telugu#Nutrition#PreventiveHealth#PublicHealth#StayHealthy#ఆయుర్వేదం#ఆరోగ్యం#ఆరోగ్యఅవగాహన#ఆరోగ్యకరజీవనశైలి#ఆహారభద్రత#కల్తీఆహారం#తెలుగువార్తలు#నకిలీమందులు#పోషకాహారం#ప్రజారోగ్యం#యోగా#వ్యసనాలకువీడ్కోలు#హెల్తీభారత్
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Neha Sharma :’చిరుత’ హీరోయిన్ నేహా శర్మ సరికొత్త ప్లాన్.. సోషల్ మీడియాతో లక్షల ఆదాయం

Next Post

Revanth Reddy Education Reforms: మంచి పనితీరు ఇచ్చినందుకు విద్యాశాఖకు రాజీనామా చేయాలా? – ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Related Posts

Revanth Reddy
Big Story

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పవర్ గేమ్.. అధిష్ఠానం కొత్త వ్యూహం వెనుక అసలు కథ ఇదే!

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?
Andhra Pradesh

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

Chandrababu Welfare Policy
Andhra Pradesh

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav
Andhra Pradesh

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

Revanth Reddy Education Speech
Big Story

Revanth Reddy Education Speech: ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు!

Ayurveda Treatment
Andhra Pradesh

Ayurveda Treatment: విరూపాక్షపురం నుంచి మూడు తరాలుగా సాగుతున్న మోహన్‌రావు కుటుంబం ఆయుర్వేద సేవా ప్రస్థానం

Next Post
Revanth Reddy Education Reforms

Revanth Reddy Education Reforms: మంచి పనితీరు ఇచ్చినందుకు విద్యాశాఖకు రాజీనామా చేయాలా? – ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పవర్ గేమ్.. అధిష్ఠానం కొత్త వ్యూహం వెనుక అసలు కథ ఇదే!

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

Chandrababu Welfare Policy

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

Recent News

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పవర్ గేమ్.. అధిష్ఠానం కొత్త వ్యూహం వెనుక అసలు కథ ఇదే!

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

Chandrababu Welfare Policy

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info