జాతిరత్నాలు సినిమాలో చిట్టి పాత్రలో నటించి, తన అమాయకత్వంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఫరియా అబ్దుల్లా. ముఖ్యంగా తన నటనతో మెప్పించడమే కాకుండా తన హైట్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రభాస్, మహేష్ బాబు లాంటి దిగ్గజ హీరోలు కూడా ఈమె హైట్ చూసి ఆశ్చర్యపోయారు అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా మంచి కటౌట్ ఉన్నప్పటికీ హైట్ కారణంగా ఈమె అవకాశాలు కోల్పోతోందనే వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి.
అటు కొరియోగ్రాఫర్ గా కూడా పేరు సొంతం చేసుకున్న ఫరియా అబ్దుల్లా.. హీరోయిన్ గా కంటే అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ అందించడంలోనే తనకు అసలైన ఆనందం అంటూ ఇటీవల ఒక షో వేదికగా తెలిపింది. ప్రస్తుతం సినిమాలలో అవకాశాలు లేక డాన్స్ షోలకి జడ్జిగా వ్యవహరిస్తున్న ఈమె.. కెరియర్ ముందుకు సాగాలి అంటే అవకాశాలు రావాలని గ్రహించిందో ఏమో తెలియదు కానీ అందులో భాగంగానే ఇంస్టాగ్రామ్ వేదికదా తెగ సందడి చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చిన ఈమె అక్కడ అందాల ఆరబోత చేస్తూ యువతను ఉక్కిరిబిక్కిరిచేసింది. ఎద అందాలతో పాటు థైస్ అందాలను ఎలివేట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు ఫాలోవర్స్ కు చెమటలు పట్టిస్తోంది.ముఖ్యంగా ఈమె ఫోటోలు చూసిన నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
చిట్టి రోజు రోజుకూ మరింత హాట్ గా తయారవుతోందని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే.. మరొక నెటిజన్ ఈ అందాన్ని తట్టుకోవడం కష్టమే అంటూ కామెంట్ చేశారు. ఇంకొక నెటిజన్ భిన్నంగా స్పందిస్తూ.. నేరుగా హాలీవుడ్ కి వెళ్లి అక్కడ సినిమాలు ట్రై చేయండి. దారితప్పి సౌత్ సినిమాలలోకి వచ్చారు అంటూ కామెంట్ చేశారు.. ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలను పంచుకోవడం విశేషం.
ఫరియా అబ్దుల్లా అలియాస్ చిట్టి విషయానికి వస్తే.. 1997 జూన్ 21న హైదరాబాదులోని బంజారాహిల్స్ లో జన్మించింది. ఈమె తండ్రి పేరు సంజయ్ సుల్తానా, తల్లి పేరు కౌసర్ సుల్తానా.. హైదరాబాదులోని మెరిడియాన్ అండ్ భవన్స్ లో పదవ తరగతి వరకు చదువుకున్న ఈమె.. ఆ తర్వాత లయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసింది. మోడల్ గా కెరియర్ మొదలు పెట్టిన ఈమె సినిమాలోకి రాకముందు థియేటర్ ఆర్టిస్టుగా, యూట్యూబర్ గా పలు వీడియోలు చేసి ప్రేక్షకులను మెప్పించింది.
ఇదే కాకుండా నక్షత్ర అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది ఫరియా అబ్దుల్లా. 2021లో వచ్చిన జాతి రత్నాలు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. అశ్వినీ దత్ వారసురాలు స్వప్న దత్ నిర్మాణ సంస్థ.. స్వప్న సినిమా బ్యానర్లో ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాకి కేవీ అనుదీప్ దర్శకత్వం వహించారు. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, నరేష్ , మురళీ శర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కామెడీ ప్రధానంగా వచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది.
FARIA ABDULLAH #fariaabdullah #fariaabdullahhot #tollywoodactress #Actressworld #Actresshot #ActressHub pic.twitter.com/1zx3Lhv6Qw
— news7telugu (@news7telug2024) August 29, 2025