సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎప్పుడు ఎవరిని వివాహం చేసుకుంటారో చెప్పలేని పరిస్థితి. అయితే అలా ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారు కూడా ఆరు నెలలకే విడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వారిలో ప్రముఖ సింగర్ నోయెల్ ఆయన మాజీ భార్య ప్రముఖ నటి ఎస్తేర్ నోరోన్హా జంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని.. ప్రేమించుకొని మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లయిన ఆరు నెలలకే విడాకులు తీసుకోవడం అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎవరికి వారు తమ వాదనలను వినిపిస్తూనే ఉంటారు. ఇకపోతే విడాకుల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఎస్తేర్ పలు చిత్రాలలో నటించింది. ముఖ్యంగా రొమాంటిక్, బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి మరీ నటిస్తోంది. అలాంటి ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక ఆసక్తికర పోస్టు పంచుకుంది.
అసలు విషయంలోకి వెళ్తే.. క్రైస్తవ మహిళలు వివాహ సమయంలో ధరించే తెలుపు రంగు గౌనును ధరించి.. పడవలో వెళ్తూ చేపలతో ఆడుకుంటున్న ఫోటోని తాజాగా షేర్ చేసింది. దీనికి క్యాప్షన్ గా “జీవితంలో మరో అందమైన సంవత్సరం.. అవకాశాలను, అద్భుతాలను ఇచ్చినందుకు భగవంతుడికి ప్రత్యేక ధన్యవాదాలు.. మీతో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ను త్వరలోనే పంచుకుంటాను ..వేచి ఉండండి” అంటూ రాసుకుంది ఎస్తేర్. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన నెటిజన్స్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నందుకు కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఇలా డ్రెస్ తోనే హింట్ ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. మరి ఈమె వివాహం చేసుకోబోయే అబ్బాయి ఎవరు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాలను మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ లో పెట్టింది ఎస్తేర్.
ఎస్తేర్ ప్రేమ, పెళ్లి విషయానికొస్తే.. నటిగా కెరియర్లో పీక్స్ లో ఉండగానే ర్యాపర్, సింగర్ అయిన నోయెల్ సీన్ ను ఈమె ప్రేమించి మరీ 2019లో పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లయిన 16 రోజులకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2020లో విడాకులు తీసుకున్నారు.
ఎస్తేర్ సినిమా జీవితం విషయానికి వస్తే.. నటిగా, సంగీత దర్శకురాలిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. తెలుగు, తమిళ్, కన్నడ, మరాఠీ, కొంకణి, హిందీ భాషా చిత్రాలలో నటించింది. 2013లో ‘1000 అపద్దాలు’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. ‘భీమవరం బుల్లోడు’ సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇక తర్వాత జయ జానకి నాయక, అధిరథ , ఆదిపర్వం లాంటి తెలుగు చిత్రాలలో నటించిన ఈమె.. ప్రస్తుతం ‘చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి’ అనే సినిమాలో నటిస్తోంది. నిన్న ఈమె పుట్టినరోజు సందర్భంగా ఈమె పాత్రను రివీల్ చేస్తూ.. చిత్ర బృందం స్పెషల్ బర్తడే విషెస్ తెలియజేసిన విషయం తెలిసిందే.