అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ కు బహిరంగ వైరం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇదొక హాట్ టాపిక్ గా మారింది ఈ సమయంలో ఎలాన్ మస్క్ నెక్స్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఎలాన్ మస్క్ కు ఓ బంపర్ ఆఫర్ వెలువడింది.అవును… డొనాల్డ్ ట్రంప్ కు ఎలాన్ మస్క్ మధ్య బంధం బీటలు వారిన నేపథ్యంలో రష్యా ఎంటరైంది! ఎలాన్ మస్క్ కు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా… తమ దేశంలో రాజకీయ శరణార్థిగా ఉండేందుకు ఎలాన్ మస్క్ కు అవకాశం కల్పిస్తామని రష్యాకు చెందిన స్టేట్ డుమా ఫెడరేషన్ కమిటీ ఛైర్మన్ దిమిత్రి నోవికోవా తెలిపారు.
ఎడ్వర్డ్ స్నోడెన్ లాగానే మస్క్ కు రష్యాలో రాజకీయ శరణార్థిగా అవకాశం కల్పిస్తారా అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు స్పందించిన దిమిత్రి నోవికోవా… మస్క్ పూర్తిగా భిన్నమైన ఆట ఆడతారని తాను అనుకుంటున్నానని.. ఆయనకు రాజకీయంగా శరణార్థిగా ఉండాల్సిన అవసరం లేదని.. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే రష్యా అందుకు సహకరిస్తుందని పేర్కొన్నారు. మరోపక్క… డొనాల్డ్ ట్రంప్ – ఎలాన్ మస్క్ వ్యవహారంపై జోక్యం చేసుకునేందుకు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ నిరాకరించారు. ఇది పూర్తిగా అమెరికా సమస్య అని.. ఇందులో తమకు జోక్యం చేసుకునే ఉద్దేశ్యం లేదని.. ఆ దేశ అధ్యక్షుడే స్వయంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటారని తాము అనుకుంటున్నామని తెలిపారు.
కాగా… 2013లో ఎన్.ఎస్.ఏ. విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ జోసెఫ్ స్నోడెన్ రష్యాలో ఆశ్రయం పొందిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో… బ్రిటిష్ బ్లాగర్ గ్రాహం ఫిలిప్స్ కూడా మాస్కో లో రక్షణం పొందినవారిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో స్నోడెన్ ప్రస్థావన తేగా.. దిమిత్రి నోవికోవా ఈ విధంగా స్పందించారు. మస్క్ కు వెల్ కం చెప్పారు! ఇక.. ట్రంప్ – మస్క్ మధ్య విభేదాలు తీవ్రంగా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ బహిరంగంగానే పరస్పరం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి తానే కారణమని మస్క్ వ్యాఖ్యానించగా… తాను ఎవరి సాయం లేకుండానే ఎన్నికల్లో నెగ్గానని ట్రంప్ సమాధానం ఇచ్చిన పరిస్థితి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ – ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య కొనసాగుతున్న విభేదాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. ఈ విభేదాలు ఎలాంటి సంచలన పరిణామాలకు దారి తీస్తాయి అనేది కూడా ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఎలాన్ మస్క్ చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది.అవును… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో విభేదాలు కొనసాగుతోన్న వేళ ఎలాన్ మస్క్ తన కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి ప్రస్థావించడం గమనార్హం. ఈ నేపథ్యంలొ ఆయన ఎక్స్ వేదికగా ఓటింగ్ కూడా నిర్వహించారు. అయితే ఆశ్చర్యకరంగా 80% మంది అనుకూలంగా ఓటు వేశారని తెలిపారు.. ఈ క్రమంలోనే “ది అమెరికా పార్టీ” అంటూ ఓ పోస్ట్ చేశారు.
వివరాళ్లోకి వెళ్తే… నిన్నటి వరకూ ప్రాణ స్నేహితుల్లా, ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా కనిపించిన డొనాల్డ్ ట్రంప్ – ఎలాన్ మస్క్ ల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి నెలకొంది! ఇద్దరూ ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా.. తన వల్లే ట్రంప్ గెలిచారని మస్క్ అంటే.. మస్క్ మైండ్ కరెక్ట్ గా లేదని ట్రంప్ అంటున్నారు. ఈ సమయంలో… 80% మంది అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది తగిన సమయమా అంటూ తనకున్న 22 కోట్ల మంది ఫాలోవర్లను ఎక్స్ లో మస్క్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఓ పోల్ పెట్టారు. అనంతరం.. ఓటింగ్ ఫలితాలను ప్రకటించారు. ఈ సందర్భంగా తన ప్రతిపాదనకు 80శాతం మంది అనుకూలంగా ఓటు వేశారని అన్నారు.
80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ ఇప్పుడు అవసరమే.. దీన్ని 80% మంది అంగీకరించారు అని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే “ది అమెరికా పార్టీ” అంటూ ఎలాన్ మస్క్ ఈ పోస్ట్ చేశారు. దీంతో.. మస్క్ కొత్త పార్టీ పెట్టబోతున్నరంటూ ప్రచారం మొదలైంది. మరోవైపు… డొనాల్డ్ ట్రంప్ కు ఎలాన్ మస్క్ మధ్య బంధం బీటలు వారిన నేపథ్యంలో రష్యా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా… తమ దేశంలో రాజకీయ శరణార్థిగా ఉండేందుకు ఎలాన్ మస్క్ కు అవకాశం కల్పిస్తామని రష్యాకు చెందిన స్టేట్ డుమా ఫెడరేషన్ కమిటీ ఛైర్మన్ దిమిత్రి నోవికోవా తెలిపారు.ఎడ్వర్డ్ స్నోడెన్ లాగానే మస్క్ కు రష్యాలో రాజకీయ శరణార్థిగా అవకాశం కల్పిస్తారా అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు స్పందించిన దిమిత్రి నోవికోవా… మస్క్ పూర్తిగా భిన్నమైన ఆట ఆడతారని తాను అనుకుంటున్నానని.. ఆయనకు రాజకీయంగా శరణార్థిగా ఉండాల్సిన అవసరం లేదని.. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే రష్యా అందుకు సహకరిస్తుందని పేర్కొన్నారు.