• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Duvvada Srinivas: బలిపశువును చేశారు

ఇక దువ్వాడ జీవితం మాధుర్యమే

Duvvada Srinivas: బలిపశువును చేశారు

దువ్వాడ శ్రీనివాస్ పార్టీ కార్యక్రమాలకంటే మాధురితో చెట్టాపట్టాలేసుకొని తీర్ధయాత్రలు చేస్తూ, రీల్స్ చేసుకుంటూ, టీవీ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా బిజీబిజీగా గడుపుతుంటంతో పార్టీ నుంచి సస్పెండ్ చేయక తప్పలేదు.కనుక ఇప్పుడు దువ్వాడ తన పూర్తి సమయం దివ్వెల మాధురికి కేటాయించి ఆమెతో జీవన మాధుర్యం అనుభవించవచ్చు.దువ్వాడ ఇకపై ఆమెకే పరిమితమైతే పరవాలేదు కానీ ఎలాగూ ఫ్రీ టైమ్ పెరిగింది కదాని మరొకరి ఇంట్లో ప్రేమ దీపం వెలిగిస్తేనే మాధురికి కోపం వస్తుంది!అలాగే పోతూపోతూ జగన్‌ గురించి, శ్రీకాకుళం జిల్లాలోని వైసీపీ నాయకుల గురించి దువ్వాడ శ్రీనివాస్ ఏమైనా నాలుగు ముక్కలు మాట్లాడినా ఇబ్బందే.

వైసిపి నుంచి ఎట్టకేలకు దువ్వాడ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఇంత హఠాత్తుగా ఎందుకు తీసుకున్నారు అన్నది వైసిపి నేతలకు అర్థం కావడం లేదు. వైసిపి నుంచి ఇతర పార్టీలలో చేరేందుకు రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీలు రాజీనామాలు ఆమోదించడం లేదు. కానీ పిల్లలు పుడితే జగన్ పేరు పెట్టుకుంటామని చెబుతున్న దువ్వాడ ను మాత్రం ఎమ్మెల్సీ పదవి లో ఉండగానే సస్పెండ్ చేశారు. దీనికి చాలా కార‌ణాలు ఉన్నాయ‌న్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఒక్కసారి కూడా గెలవలేదు. జగన్ ఒకసారి ఆయనకు శ్రీకాకుళం ఎంపీ సీట్లు కూడా ఇచ్చారు. ప్రతి ఎన్నికలలో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడేవి. ప్రజారాజ్యం ఆవిర్భావం తర్వాత ఒకసారి టెక్కలికి ఉప ఎన్నిక‌ వస్తే అన్ని ప్రధాన పార్టీలు ఆయనకే ఆఫర్లు ఇచ్చాయి .. అలాంటి బలమైన నేత ఇప్పుడు ఎవరికి కాకుండా పోయారు. కామెడీ స్టార్ అయిపోయాడు. వైసీపీలోకి వెళ్ళాక దువ్వాడ శ్రీనివాస్ కు ఆ పరిస్థితి వచ్చేసింది.

వైసిపి అధికారంలో ఉన్నప్పుడు దువ్వాడ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయాడు. అచ్చం నాయుడు మీద .. ఎర్ర నాయుడు కుటుంబం మీద చేసిన విమర్శలు .. దాడులు చాలా ఉన్నాయి. జగన్ ప్రమోట్ చేసి ఎమ్మెల్సీ పద‌వి ఇచ్చారు. తీరా ఇప్పుడు ఆయన పాతాళానికి పడిపోయారు. వివాహేతర సంబంధం పెట్టుకుని భార్య .. పిల్లలపై బూతులతో విరుచుకుపడిన జగన్ పట్టించుకోలేదు .. కానీ ఇప్పుడు జగన్ కంటే దువ్వాడకే ఎక్కువ పబ్లిసిటీ వస్తోంది. దువ్వాడ తన సహజీవన భాగస్వామి మాధురితో కలిసి ఒకేసారి వేరువేరు చోట మాట్లాడితే ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా దువ్వాడ ఇప్పుడు నట్టేట మునిగిపోయినట్టే .. ఆయన రాజకీయ జీవితం కూడా దాదాపు శుభం కార్డు పడినట్టే అని చెప్పాలి.

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన క్రమంలో పార్టీ హైకమాండ్ దువ్వాడ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. తనపై సస్పెన్షన్ వేటు వేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా తనకు ఇన్నాళ్లు గౌరవం ఇచ్చిన అధినేత వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూనే కీలక వ్యాఖ్యలుచేశారు. వైసీపీ కోసం తాను అహర్నిశలు శ్రమించినట్లు చెప్పుకొచ్చారు. అకారణంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత కారణాలను బూచిగా చూపించి రాజకీయ క్రీడలో బలిపశువును చేశారంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విలపించారు.
రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా పనిచేశానని…ఏనాడూ పార్టీకి ద్రోహం చేయలేదు అని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. అయితే ఈ సస్పెన్షన్‌ను తాత్కాలిక రాజకీయ విరామంగా భావిస్తానని…ఈ సస్పెన్షన్ ఉన్నంతకాలం తటస్థుడిగా ఉంటూ తనను నమ్ముకున్న కార్యకర్తలు…అభిమానుల కోసం రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని చెప్పుకొచ్చారు. తన రాజకీయ..వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలన్నింటికీ కాలమే సమాధానం చెప్తోందంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వెల్లడించారు.

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వార్తల్లో నిలిచిన సమయంలో సస్పెండ్ చేయకుండా ఇప్పుడు చేయడంపై రాజకీయంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్యవాణి పిల్లలకు మధ్య వాగ్వాదం జరిగింది. దాదాపు నెల రోజులకు పైగా ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మీడియా అంతా అక్కడే రెక్కలు కట్టుకుని వాలిపోయింది. కట్టుకున్న భార్యను కనిపెంచిన పిల్లలు ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నప్పటికీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం వెనకడుగు వేయలేదు. మరో మహిళ మాధురితో కలిసి ఉన్నారు. అయినప్పటికీ పార్టీ సస్పెండ్ చేయకుండా కేవలం మీనమేషాలు లెక్కించింది. అయితే అంతా సాఫీగా ఉన్న వేళ ఇలా సస్పెండ్ చేయడం సరికొత్త ఆలోచనలకు దారి తీస్తోంది. అయితే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘బాలయ్య తర్వాత స్వీటెస్ట్‌ పర్సన్‌ ఎవరు’ అని అడిగిన ప్రశ్నకు… ‘లోకేష్’ అని ఇద్దరూ ఏకకాలంలో సమాధానం ఇచ్చారు. రాపిడ్ ఫైర్ క్వశ్చన్‌లో లోకేశ్ గురించి ఒక్క వ్యాఖ్యం చెప్పాలంటే లోకేష్ తెలివైనవాడని…కష్టపడితే మరింత పైకి వస్తాడని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ఈ ప్రశంసలే ఎమ్మెల్సీ దువ్వాడ కొంపముంచిందనే చర్చ జరుగుతుంది.

ఇదిలా ఉంటే ఈనెల 22న తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పీఏసీ తొలి సమావేశం జరిగింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…పీఏసీ చైర్మన్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన 33 మందితో ఏర్పడిన పీఏసీ కమిటీతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. ఇదే సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మెుదటి పీఏసీ సమావేశంలోనే దువ్వాడ శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఏపీలో ఉత్తరాంధ్ర వైసీపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన దువ్వాడ శ్రీనివాస్ ను తాజాగా ఆ పార్టీ సస్పెండ్ చేసింది. వ్యక్తిగత కారణాలతో ఆయన్ను సస్పెండ్ చేశారు. దీనిపై ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో వైసీపీ నిర్ణయంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ నెల 22న వైసీపీ తనను సస్పెండ్ చేసినట్లు చేసిన ప్రకటనపై ఆ పార్టీ ఉత్తరాంధ్ర నేత దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. వైసీపీ ప్రకటనపై తాను స్పందించాల్సిన అవసరం ఉందని భావిస్తూ వీడియో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ముందుగా వైసీపీలో ఈ హోదా తనకు ఇచ్చిన జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ కోసం తాను చాలా కష్టపడ్డానని, పార్టీ గొంతై మాట్లానని, పార్టీలో ఉంటూ ప్రత్యర్థులపై విమర్శలు చేశానన్నారు. కానీ ఇప్పుడు వ్యక్తిగత కారణాలు చూపుతూ సస్పెండ్ చేశారని తెలిసిందన్నారు.ఇందుకు పార్టీ తనకు అందించిన సహకారం, రాజశేఖర్ రెడ్డితో అడుగు వేసిన తాను, జగన్ తో నడుస్తున్న తాను, తన హృదయంలో జగన్ స్ధానం సుస్దిరం అన్నారు. రాజకీయ క్రీనీడలో తాను బలైనట్లు భావిస్తున్నట్లు తెలిపారు. పాతికేళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న తాను, ప్రజాసేవనే పరమావధిగా భావించిన తాను ఏరోజూ పార్టీకి ద్రోహం చేయలేదని, లంచాలు తీసుకోలేదని, అవినీతి చేయలేదని, భూకబ్జాలు చేయలేదన్నారు.

జరిగిన పరిణామాన్ని తాను స్వీకరిస్తున్నట్లు దువ్వాడ తెలిపారు. సస్పెన్షన్ అనేది తాత్కాలిక విరామమే అన్నారు. విరామం ఎరుగక పనిచేయాలన్న గురజాడ అప్పారావు చెప్పిన ఓ మాటను ఈ సందర్బంగా ఆయన గుర్తుచేశారు. తాను అలాగే విరామం లేకుండా తనను నమ్ముకున్న ప్రజలు, గ్రామాల కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానన్నారు. తన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తన అభిమానులంతా ధైర్యంగా ఉండాలని కోరారు.

Tags: #DuvvadaSrinivas#YCPLeaderSuspended#YCPUpdates#ysjagan#YSRCongressParty#Ysrcp
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Pahalgam Terror Attack: ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన ఆర్మీ

Next Post

Samantha: అత‌నితో ప్ర‌త్యేక బంధం..!

Related Posts

Kerala: వేడెక్కిన కేరళ రాజకీయాలు..ఆ యువనేత హోటల్ కి రమ్మన్నాడు.. హీరోయిన్ సంచలన ఆరోపణలు!
Latest

Kerala: వేడెక్కిన కేరళ రాజకీయాలు..ఆ యువనేత హోటల్ కి రమ్మన్నాడు.. హీరోయిన్ సంచలన ఆరోపణలు!

Miyapur:  మియాపూర్‌లో విషాద ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
Crime

Miyapur: మియాపూర్‌లో విషాద ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Duvvada Srinuvas: సిక్కోలు రాజకీయాల్లో లెక్కలు తేలుస్తా
Andhra Pradesh

Duvvada Srinuvas: సిక్కోలు రాజకీయాల్లో లెక్కలు తేలుస్తా

Samantha: అందుకే తగ్గించా
Entertainment

Samantha: అందుకే తగ్గించా

Keerthy Suresh: కంబ్యాక్ కోసం వెయిటింగ్..?
Entertainment

Keerthy Suresh: కంబ్యాక్ కోసం వెయిటింగ్..?

Disha Patani: బ్యాక్‌ అందంతో!
Entertainment

Disha Patani: బ్యాక్‌ అందంతో!

Next Post
Samantha:  అత‌నితో ప్ర‌త్యేక బంధం..!

Samantha: అత‌నితో ప్ర‌త్యేక బంధం..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Kerala: వేడెక్కిన కేరళ రాజకీయాలు..ఆ యువనేత హోటల్ కి రమ్మన్నాడు.. హీరోయిన్ సంచలన ఆరోపణలు!

Kerala: వేడెక్కిన కేరళ రాజకీయాలు..ఆ యువనేత హోటల్ కి రమ్మన్నాడు.. హీరోయిన్ సంచలన ఆరోపణలు!

Miyapur:  మియాపూర్‌లో విషాద ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Miyapur: మియాపూర్‌లో విషాద ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Duvvada Srinuvas: సిక్కోలు రాజకీయాల్లో లెక్కలు తేలుస్తా

Duvvada Srinuvas: సిక్కోలు రాజకీయాల్లో లెక్కలు తేలుస్తా

Samantha: అందుకే తగ్గించా

Samantha: అందుకే తగ్గించా

Recent News

Kerala: వేడెక్కిన కేరళ రాజకీయాలు..ఆ యువనేత హోటల్ కి రమ్మన్నాడు.. హీరోయిన్ సంచలన ఆరోపణలు!

Kerala: వేడెక్కిన కేరళ రాజకీయాలు..ఆ యువనేత హోటల్ కి రమ్మన్నాడు.. హీరోయిన్ సంచలన ఆరోపణలు!

Miyapur:  మియాపూర్‌లో విషాద ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Miyapur: మియాపూర్‌లో విషాద ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Duvvada Srinuvas: సిక్కోలు రాజకీయాల్లో లెక్కలు తేలుస్తా

Duvvada Srinuvas: సిక్కోలు రాజకీయాల్లో లెక్కలు తేలుస్తా

Samantha: అందుకే తగ్గించా

Samantha: అందుకే తగ్గించా

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info