జమ్మలమడుగు ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుదీర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కడంతో హైదరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
నానక్‌రామ్‌గూడ పరిసరాల్లో డ్రగ్స్ వినియోగం జరుగుతోందన్న సమాచారంతో ఈగల్ (EAGLE) టీమ్ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న సుదీర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించారు. డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ రావడంతో వెంటనే అతడిని అరెస్ట్ చేశారు.
అనంతరం చట్ట ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు, సుదీర్ రెడ్డిని డీ–అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. డ్రగ్స్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరు అయినా సరే చట్టానికి అతీతులు కాదని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ ఘటన రాజకీయ వర్గాల్లోనూ, స్థానికంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులపై ఈ తరహా ఘటనలు వెలుగులోకి రావడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. డ్రగ్స్ నిర్మూలనపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
EAGLETeam















