https://x.com/AruhiVibe/status/1953754531860549926?t=9MLr2oNCZW90c4F83x1GQg&s=19
గత కొంతకాలంగా భార్యల చేతుల్లో బలైపోతున్న భర్తలకు సంబంధించిన షాకింగ్ ఘటనలు వెలుగులోకి రాగా… తాజాగా కట్నం కోసం భార్యపై కర్కశత్వం ప్రదర్శించిన భర్త షాకింగ్ వీడియో తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వర్షంలో కింద పడేసి భార్యపై అతడు తీవ్రంగా దాడి చేయడం అందులో కనిపించింది.
అవును… జమ్మూకశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా… రూ.10 లక్షలు నగదు, కారు ఇవ్వాలన్న భర్త డిమాండ్ ను తిరస్కరించిందనే కారణంతో భార్యపై ఘోరంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది! దాడి సమయంలో ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
దాడి జరుగుతున్నంతసేపు ఆమె బాధతో అరుస్తుండగా భర్త మాత్రం కొడుతూ, తిడుతుండడం వీడియోలో కనిపిస్తుంది. ఈ దాడిలో భార్యకు తీవ్ర గాయాలు కాగా.. ఆమెను ఉధంపూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారని సమాచారం. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
దీంతో స్పందించిన పోలీసులు.. వరకట్న వేధింపులకు సంబంధించిన సెక్షన్ల కింద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు! ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని అంటున్నారు. మరోవైపు ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. తీవ్ర ఆగ్రహంతో కామెంట్లు పెడుతున్నారు. ఇది ఏమాత్రం సమర్ధనీయ చర్చ కాదని నొక్కి చెబుతున్నారు.