తెలుగు మూవీ లోఫర్‌తో ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ దిశా పటానీ. మొదటి సినిమా నిరాశ పరిచిన కూడా వెంటనే ఈ అమ్మడు తేరుకుంది. తెలుగులో ఆఫర్లు ఒకటి రెండు వచ్చినా పట్టించుకోకుండా బాలీవుడ్‌లో సినిమాలు చేయడం మొదలు పెట్టింది. బాలీవుడ్‌లో ఈమె చేసిన మొదటి సినిమా ధోనీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ కాకున్నా కూడా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ఇండస్ట్రీలో దిశా పటానీ గురించి పరిచయం అయ్యేలా చేసింది. అక్కడ నుంచి హిందీ సినిమా ఇండస్ట్రీలో దిశా పటానీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తున్న దిశా ప్రస్తుతం అక్కడ స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలగడంతో పాటు ఇన్‌స్టాల్ అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్‌గా నిలిచింది.
రెగ్యులర్‌గా సోషల్ మీడియా ద్వారా తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా దిశా పటానీ గుర్తింపు దక్కించుకుంది. ఆకట్టుకునే అందంతో పాటు, యాక్టింగ్‌లోనూ ప్రతిభ కనబర్చడం ద్వారా ముద్దుగుమ్మ దిశా పటానీ సౌత్‌లోనూ ఆఫర్లు సొంతం చేసుకుంటూ ఉంది. ఆ మధ్య ఈమె తెలుగులో కల్కి సినిమాతో వచ్చింది. తమిళ్‌లో ఈమె కంగువా సినిమాలో నటించింది. కల్కి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ ఆ సినిమాలో దిశా పాత్ర పరిమితంగా ఉండటంతో ఆమెకు కల్కి హిట్ పెద్దగా ఉపయోగపడలేదు. ఇక కంగువా సినిమాలో సూర్యకు జోడీగా నటించింది. ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ ప్రభావం దిశా పై పెద్దగా లేదు. దాంతో మరిన్ని సినిమాలను చేస్తూనే ఉంది.
సౌత్‌లో నిరాశ పర్చడంతో మరిన్ని సినిమాలు చేయాలని అనుకోవడం లేదు. ప్రస్తుతం హిందీలోనూ మూడు నాలుగు సినిమాలు చేస్తుంది. వాటిల్లో ఒకటి ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సినిమాలతో ఇంత బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇలాంటి అందమైన ఫోటోలతో ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ ఉంది. తాజాగా ఇలా బ్యాక్ అందంతో పిచ్చెక్కించేస్తూ ఫోటోలు షేర్ చేసింది. సాధారణంగానే దిశా పటానీ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఈ ఫోటోల్లో బ్యాక్ అందం చూపిస్తూ మరింతగా అందంగా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎలాంటి ఫోటోలు షేర్ చేస్తే జనాలు చూస్తారో దిశా పటానీ కి బాగా తెలుసు అని, అందుకే ఆమెకు ఇన్‌స్టాలో 61 మిలియన్‌ల ఫాలోవర్స్ ఉన్నారు అంటూ ఆమెను అభిమానించే వారు అంటూ ఉంటారు.
ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతంలో జన్మించిన దిశా పటానీది హిందూ కుమావోనీ రాజ్‌పుత్ నేపథ్యం. తండ్రి జగదీష్ సింగ్ పటానీ పోలీస్ ఆఫీసర్ కాగా, తల్లి హెల్త్ ఇన్‌స్పెక్టర్. దిశా పటానీ అక్క ఆర్మీలో సేవలు అందిస్తుండటం విశేషం. 2015 లో లోఫర్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దిశా పటానీ ఇటీవలే పదేళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకుంది. ఈ పదేళ్ల సినీ కెరీర్‌లో దిశా పటానీ చాలా ఎత్తు పల్లాలు చూసింది. సినిమాలు ఫ్లాప్ అయినా కూడా నిలదొక్కుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానంను బాలీవుడ్‌లో దక్కించుకుంది. అందుకే బాలీవుడ్‌లో ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా దక్కింది. ముందు ముందు మరిన్ని పెద్ద సినిమాల్లో, ప్రతిష్టాత్మక సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి. ఆమెకు సంబంధించినంత వరకు నటిగా గుర్తింపు తెచ్చే పాత్రలు చేయాలి అనుకుంటుందట. అయితే మేకర్స్ ఎలాంటి పాత్రల ఆఫర్లు ఇస్తే వాటిని చేసేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటాను అంది.
Hot and sexy beauty #DishaPatani is bringing the sexy back in these glam shots 😍📷. .@DishPatani pic.twitter.com/BG1Nhf47y8
— news7telugu (@news7telug2024) August 21, 2025