గుట్టుగా సాగాల్సిన సంసారాలు, సంతోషంగా నడవాల్సిన దాంపత్య జీవితాల్లో అక్రమ సంబంధం అనే వైరస్ గుట్టు రట్టై పబ్లిక్ లోకి వచ్చేస్తున్నాయి! అక్రమ సంబంధాల కారణంగా వీరి సంసార జీవితాలు స్థానిక మీడియా నుంచి జాతీయ మీడియా వరకూ పాకేస్తున్నాయి. ఈ సమయంలో తాజాగా తన సీక్రెట్స్ అన్నీ తన భర్త ఫోన్ లో ఉండటంతో భార్య ఓ ప్లాన్ చేసింది. దీంతో.. ఆమె గుట్టు మొత్తం పబ్లిక్ లోకి వచ్చేసింది.
అవును… ఢిల్లీలో ఒక రోడ్డుపై నడుస్తున్న వ్యక్తి ఫోన్ ని ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి దక్షిణ ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే… పోలీసు విచారణలో మాత్రం సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగా… ఫోన్ పోగొట్టుకున్న బాధితుడి భార్య వివాహేతర సంబంధం గుట్టు రట్టయ్యింది.
వివరాళ్లోకి వెళ్తే… ఢిల్లీలో ఒక రోడ్డుపై నడుస్తున్న వ్యక్తి ఫోన్ ని ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో బాదితుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులకు 70 సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఈ సమయంలో నీలిరంగు టీషర్ట్ ధరించిన నిందితుడు ఫోన్ లాక్కెళ్లినట్లు గుర్తించారు. నిందితులు పారిపోతున్న స్కూటర్ నెంబర్ ఆధారంగా వసంత్ కుంజ్ ప్రాంతంలో వారిని కనుగొన్నారు. స్కూటీని అద్దెకు తీసుకున్న వ్యక్తి ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ ఆధారంగా.. రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలోని బలోత్రాలో అంకిత్ గెహ్లాట్ ని అరెస్ట్ చేశారు. ఈ సమయలోనే ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా… బాధితుడి భార్య చెప్పడంతోనే ఆ ఫోన్ ను దొంగిలించినట్లు అంకిత్ గెహ్లాట్ పోలీసులకు తెలిపాడు.
ఈ సందర్భంగా స్పందించిన డీసీపీ అంకిత్ చౌహాన్… బాధితుడి భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ప్రేమికుడితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను తన భర్త మొబైల్ లో ఉండటంతో.. వాటిని ఫోన్ నుంచి తొలగించాలనే ఉద్దేశంతో ఈ ప్లాన్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో బాధితుడి భార్యతో పాటు ఇద్దరిని అరెస్ట్ చేశామని అన్నారు. వాస్తవానికి బాధితుడికి భార్య వివాహేతర సంబంధం గురించి తెలుసని.. ఆమె నిద్ర పోతున్న సమయంలో ఆమె ఫోన్ లో ఉన్న ఫోటోలను తన మొబైల్ లోకి పంపించుకున్నట్లు తెలిసిందని.. అయితే, తన భర్త ఆ ఫోటోలను కుటుంబం ముందు భయటపెడతాడనే భయంతో ఆమె ఈ ప్లాన్ చేసిందని వెల్లడించారు! దీంతో… అసలు గుట్టు రట్టయ్యింది!