ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు
పాలనలో ఇవాళ తీసుకున్న నిర్ణయాలన్నీ రేపటికి చరిత్ర అవుతాయి
గతంలో ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రా తదితర అంశాల్లో తీసుకువచ్చిన సంస్కరణలతో హైదరాబాద్ ఎకోసిస్టం వచ్చింది.
ప్రపంచంలోని మోస్ట్ లివబుల్ సిటిగా హైదారాబాద్ అభివృద్ధి అయ్యింది.
ఇదేమీ ఒక్కరోజులో జరిగింది కాదు. తెల్లవారు ఝామునే తనిఖీల నుంచి వివిధ నిర్ణయాలు ఈ మార్పునకు కారణం అయ్యాయి
అప్పుడు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే పంపుసెట్ గురించి మాట్లాడాలని విమర్శించారు
అయితే గతంలో తీసుకున్న స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు ఫలితాలు ఇచ్చాయి.
విభజన తర్వాత ఏపీలో ఒకే చోట పెద్ద మొత్తంలో భూమి లేదు అందుకే రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ అనే ఐడియాను తీసుకువచ్చాం
అమరావతి నిర్మాణం జరుగుతుండగా గత పాలకులు దానిని శ్మశానం అని గేలి చేసి విధ్వంసం చేశారు
ఇప్పుడు మళ్లీ దానిని పునర్నిర్మిస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్ ప్లస్ గా అమరావతి తయారవుతుంది
టెక్నాలజీని అనుసంధానించి స్మార్ట్ సిటీగా, బ్లూ గ్రీన్ రాజధాని నగరం నిర్మాణం చేపడుతున్నాం.
ప్రస్తుతం యుద్ధ ప్రభావంతో వివిధ అంశాలపై ఇబ్బందులు వస్తున్నాయి. గ్యాస్ కొరత లాంటివి ఎదుర్కోంటున్నాం
యుద్ధం తర్వాత మనల్ని మనం చాలా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటోంది
అమరావతి తర్వాత మరో పెద్ద ప్రాజెక్టు పోలవరం. గోదావరిలో వచ్చే 50 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా ఈ ప్రాజెక్టు నిర్మాణం
2019 వరకూ 72 శాతం పనులు కూడా పూర్తి చేశాం. కానీ గత పాలకులు దానిని పట్టించుకోక ధ్వంసం చేశారు
రూ.440 కోట్లతో నిర్మించిన డయాఫ్రాం వాల్ వాళ్ల హయాంలో ధ్వంసమైపోయింది. మళ్లీ అదే పనిని రూ.1000 కోట్లతో చేపట్టాల్సి వస్తోంది
త్వరలోనే ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఇతర రాష్ట్రాలకూ ప్రయోజనం కలిగేలా చేయవచ్చు.
ఏపీలో మూడు రీజియన్లుగా అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నాం.
అమరావతిలో త్వరలోనే క్యాంటం కంప్యూటర్ పనిచేయటం ప్రారంభిస్తుంది.
త్వరలోనే క్వాంటం కంప్యూటర్ తయారీకి అవసరమైన పరికరాల తయారీ కూడా చేసేలా చేస్తున్నాం
ఇప్పుడు గూగుల్ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. రిలయన్స్ కూడా డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది
2047 స్వర్ణాంధ్ర ద్వారా రాష్ట్రాభివృద్ధికి విజన్ రూపకల్పన చేశాం
వ్యవసాయం, సేవల రంగం, పారిశ్రామిక రంగం అభివృద్ధికి వీలుగా ప్రణాళికలు రూపొందించుకున్నాం
ఉద్యాన, ఆక్వా రంగాల్లో కూడా ఎగుమతుల ద్వారా వృద్ధి సాధించేలా చర్యలు చేపట్టాం
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో యువ పారిశ్రామిక వేత్తల అవసరం చాలా ఉంది. దీనిని అందిపుచ్చుకోవాలని కోరుతున్నాను
ఏపీని దేశంలోనే అగ్రస్థాయి ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా విజన్ డాక్యుమెంట్ రూపోందించాం
*15 శాతం వృద్ధి రేటు నిలకడగా కొనసాగేలా చర్యలు తీసుకున్నాం.










