బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశంప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన నేపథ్యంలో నిందితురాలు కొండా సురేఖపై 21 ఆగస్టు 2025 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితురాలికి నోటీసు జారీ చేయాలన్న కోర్టు.కేటీఆర్ పైన కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారన్న కేటీఆర్ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టుఫిర్యాదుతోపాటు సాక్ష్యుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్ల పరిశీలించిన తర్వాత, నిందితురాలు కొండా సురేఖపై ప్రాథమిక కేసు ఉన్నట్టు గుర్తించిన కోర్టు
ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ తో పాటు సమంత విడాకుల వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే. తారక రామారావుపై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను BNS సెక్షన్ 356 కింద పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఈ నెల 21 లోపు నిందితురాలికి నోటీసు జారీ చేయాలని ఆదేశించింది.కొండా సరేఖ తరుపు న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాలను కోర్టు పట్టించుకోలేదు. కేటీఆర్ చేసిన ఫిర్యాదు ఊహాగానాల ఆధారంగా ఉందని, సరైన సమాచారం లేదని, ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ పరిధి తదితర అంశాలపై వారు లేవనెత్తిన అంశాలను కోర్టు తోసిపుచ్చింది.కొండా సురేఖ చేసిన ఆరోపణలు నిరాధారంగా ఉన్నాయని కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ పోగుల చేసిన వాదనతో ఏకీభవించిన కోర్టు, నిందితురాలిపై కేసు నమోదు చేయవచ్చని తేల్చిచెప్పింది.
కోర్టు ఈ క్రింది అంశాలను స్పష్టం చేసింది :
ఫిర్యాదును స్వీకరించే అధికారం కోర్టుకు ఉందని, హైకోర్టు ఆదేశం (క్రిమినల్ పిటిషన్ నెం. 5670/2024) ప్రకారం చట్టపరంగా నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొందిసురేఖ చేసిన వ్యాఖ్యలు, అడ్డగోలుగా చేసిన ఆరోపణలు ఇంతకుముందే మీడియాలో వచ్చాయి అనడానికి ఎలాంటి ఆధారం లేదని, ఈ నిర్దిష్ట ప్రకటనలు, ఆమె స్వయంగా చేసినవిగా సూచిస్తున్నాయని కోర్టు నిర్ధారించింది.ఈ పెన్‌డ్రైవ్‌కు సెక్షన్ 65-B సర్టిఫికేట్ అవసరమన్న వాదన ఈ దశలో అప్రస్తుతమని, విచారణ సమయంలో దానిని చట్టపరంగా పరిశీలిస్తామని తెలిపింది
ఒక పెన్‌డ్రైవ్‌కు సంబంధించిన సెక్షన్ 65-B సర్టిఫికేట్‌పై వాదనను కోర్టు ‘సంబంధం లేనిదిగా’ పరిగణించింది. ఎందుకంటే పెన్ డ్రైవ్‌లోని విషయాలను పరిశీలించే దశ ఇంకా రాలేదని, ఒకవేళ చట్టపరమైన నిబంధనల ప్రకారం ఉంటే, విచారణ సమయంలో ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని తేల్చిచెప్పింది.ఈ పరిశీలనల ఆధారంగా, సెక్షన్ 222 r/w 223 BNSS కింద సెక్షన్ 356 BNS ప్రకారం నేరాన్ని స్వీకరించి, దీనిని క్రిమినల్ కేసుగా నమోదు చేయాలని, నిందితురాలికి 21 ఆగస్టు 2025 నాటికి నోటీసు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది.
తమ ముందున్న ఫిర్యాదుతోపాటు.. ఒకటి నుంచి ఐదు (PW1 నుండి PW5) వరకు సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలాలు, ఇతర పత్రాలను సమగ్రంగా పరిశీలించినప్పుడు, నిందితురాలిపై BNSS సెక్షన్ 222 r/w 223 కింద, BNS సెక్షన్ 356 ప్రకారం శిక్షార్హమైన నేరానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు కోర్టు గుర్తించింది. అందువల్ల, కోర్టు BNS సెక్షన్ 356 ప్రకారం నేరాన్ని పరిగణనలోకి తీసుకుని, 21-08-2025 లోపు క్రిమినల్ కేసు (CC) నమోదు చేయడంతోపాటు నిందితురాలికి నోటీసు జారీ చేయాలని కూడా కోర్టు ఆదేశాలు జారీచేసింది.