ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

APGovt:సంక్షేమం దానం కాదు – సాధికారతకు మార్గం: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు

APGovt:సంక్షేమం దానం కాదు – సాధికారతకు మార్గం: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు
ADVERTISEMENT

*సంక్షేమం అంటే దానం కాదు… సాధికారతకు మార్గం*

*హాస్టళ్లకు కొత్త లుక్ రావాలి… హాస్టళ్ల నిర్మాణాలకు, మరమ్మతులకు నిధులిస్తాం*

*యువత ఉపాధి కోసం జాబ్ మేళాలు నిర్వహించండి*

*త్వరలో శాశ్వత కుల ధృవపత్రాలు*

*విద్యా రుణాలపై వడ్డీ భారం తగ్గించేలా త్వరలో కొత్త పథకం*

*ప్రాంతాల మధ్య అభివృద్ధిలో పోటీ*

*తొలిరోజు కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు*

సంక్షేమం అంటే పేదలకు చేసే దానం కాదు… వారి అభివృద్ధికి, సాధికారతకు మార్గం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్ధిక అసమానతలు తగ్గించేందుకు అన్ని మార్గాలను వినియోగించుకుందామని చెప్పారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో జరిగిన తొలి రోజు కలెక్టర్ల కాన్ఫరెన్సులో భాగంగా ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్‌లు, సూపర్ సిక్స్ పథకాల అమలు, డ్వాక్రా, మెప్మా గ్రూపుల పనితీరు వంటి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. సంక్షేమం – అభివృద్ధి రంగాలకు సమతూకంగా నిధులు ఖర్చు చేస్తున్నాం. మూలధన వ్యయం కూడా చేస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం, తల్లికి వందనం అందరికీ అందించాం. లబ్దిదారులకు సాయం అందే విషయంలో తలెత్తే చిన్నచిన్న లోటుపాట్లను కలెక్టర్లు సరిదిద్దాలి. మెగా డీఎస్సీ ద్వారా యువతకు 16,347 ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పటికే 6 వేలకు పైగా పోలీసు విభాగంలో ఉద్యోగాలిచ్చాం. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తాం. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజన యువతకే ఉద్యోగాలు ఇచ్చేలా ఉన్న జీవో-3ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. దీనిపై ఏం చేయాలనే అంశంపై ఆలోచన చేస్తున్నాం. అలాగే ప్రైవేటు రంగంలోనూ జాబ్స్ వచ్చేలా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. జిల్లాల్లో యువతకు ఉద్యోగాలు వచ్చేలా జాబ్ మేళాలు ఏర్పాటు చేయాలి.” అని ముఖ్యమంత్రి వివరించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్త్రీ శక్తి విజయవంతమైంది. ఈవీ బస్సులతో ఖర్చు తగ్గుతుంది. కమర్షియల్ కాంప్లెక్సుల నిర్మాణం, కార్గో ద్వారా ఆర్టీసీ ఆదాయం సమకూర్చుకోవచ్చు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం ద్వారా ఏటా రూ.33 వేల కోట్ల వ్యయం చేస్తున్నాం. అక్టోబరు 1వ తేదీన 3 లక్షల మంది ఆటో డ్రైవర్లకు రూ.15 వేల ఆర్ధిక సాయం చేస్తాం.” అని చంద్రబాబు పేర్కొన్నారు.

*అన్ని వర్గాలకూ అండగా…*

వడ్డెర్లకు క్వారీల్లో రిజర్వేషన్లు పెట్టడంతో పాటు సీనరేజీలో మినహాయింపు ఇస్తాం. ఇమామ్, మౌజన్లకు కూడా గౌరవవేతనం ఇస్తున్నాం. విజయవాడలో హజ్‌హౌస్ త్వరలోనే పూర్తి అవుతుంది. హజ్ యాత్రికులకు రూ.1 లక్ష ఆర్ధిక సాయం చేస్తున్నాం. మసీదుల నిర్వహణకు నెలకు రూ.5 వేలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహిస్తున్నాం. అన్ని దేవాలయ ట్రస్ట్ బోర్డుల్లోనూ బ్రాహ్మణులకు చోటు కల్పించాం. నిర్మాణ రంగంలో వర్కర్ల సంక్షేమం కోసం కూడా బోర్డు ఏర్పాటు చేస్తున్నాం. శాశ్వత కుల ధృవీకరణ పత్రం కూడా త్వరలోనే జారీ చేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు పేరును భోగాపురం ఎయిర్ పోర్టుకు పెడతాం. కల్లుగీత కార్మికులకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించాం. తోట చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలపై విచారణకు ఆదేశించాం. మత్య్సకారుల సేవలో భాగంగా వేట నిషేధ సమయంలో రూ.20 వేలు ఇస్తున్నాం. ఎవరికీ అన్యాయం జరక్కుండా ఎస్సీ వర్గీకరణను కూడా విజయవంతంగా పూర్తి చేశాం. డ్రైవర్ల సాధికారిక సంస్థ ఏర్పాటు చేసే అంశం పరిశీలిస్తున్నాం. నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల చొప్పున వేతనం ఇస్తున్నాం. అర్చకులకు గౌరవ వేతనం రూ.15 వేలకు పెంచాం. వేద విద్యార్ధులకు రూ.3 వేలు ఇస్తున్నాం. జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయించే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. అసంపూర్తిగా ఉన్న కాపు భవనాలను పూర్తి చేసేలా కార్యాచరణ చేస్తున్నాం. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల వారిని ఆదుకునేందుకు కార్యాచరణ చేపట్టాం. రజకులకు దోబీ ఘాట్లు, షెడ్లు, ఇస్త్రీ చేయడానికి ఆధునిక మౌలిక వసతులు కల్పించాలి. 200 యూనిట్లు హ్యాండ్లూమ్‌కు, 500 యూనిట్లు పవర్ లూమ్స్ ఉన్నవారికి ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం.” అని మఖ్యమంత్రి వివరించారు.

*విద్యార్థికి చేయూత-వైద్యానికి భరోసా*

“పాఠశాలల్లో ఉన్న వసతులతో 10 తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా చూడాలి. ఉన్నత విద్య చదువుకునే విద్యార్ధులకు కేంద్రం నుంచి పావలా వడ్డి కింద ఎంతైనా రుణం తీసుకునే అవకాశం ఉంది. ఆ వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేలా విధానాలను రూపొందించండి. సంక్షేమ హాస్టళ్లను కలెక్టర్లు తప్పని సరిగా సందర్శించాలి. విద్యార్ధులకు ఇచ్చే ఆహారం, నీరు, వారికిచ్చే దుప్పట్లు, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలి. అన్ని సంక్షేమ హాస్టళ్ల పునర్నిర్మాణానికి ఎంత వ్యయం అవుతుందో అంచనా వేయండి. అవసరమైతే రాత్రి పూట నిద్రచేసి అక్కడ పరిస్థితుల్ని మార్చండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను మెరుగుపర్చేందుకు నిధులు కొరతలేదు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లల్లో చదివే విద్యార్థులు ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించేలా మరింత కృషి చేయాలి. ఇప్పటికే హాస్టళ్లల్లో చదువుకున్న విద్యార్థులు ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధిస్తున్నారు. ఆ సంఖ్య మరింత పెరగాలి. ఆ దిశగా కలెక్టర్లు ఫోకస్ పెట్టాలి. గతంలో చాలా మంది అధికారులు ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేసేందుకు ఉత్సాహం చూపేవారు. ఎస్ఆర్ శంకరన్ లాంటి వారు దానికి ప్రత్యక్ష ఉదాహరణ. శంకరన్ వంటి వారిని నేటి తరం కలెక్టర్లు ఆదర్శంగా తీసుకోవాలి. కలెక్టర్లు తమ టాలెంట్ తో కొత్త పంథాలో పాలన చేపట్టాలి. యూనివర్సల్ హెల్త్ సర్వీసుల కింద రూ.2.5 లక్షల భీమా రాష్ట్రంలో ప్రజలందరికీ వర్తిస్తుంది. జన ఔషధి కింద జనరిక్ మెడిసిన్స్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చాం. 9 గంటల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. పీ4 మరో గేమ్ చేంజర్ కార్యక్రమం. వాలంటరీగానే అంతా ముందుకు వస్తున్నారు. బలవంతం ఉండదు. పీ4, డ్వాక్రా, మెప్మాను ఇంటిగ్రేట్ చేసి ముందుకు వెళ్లండి. డ్వాక్రా, మెప్మా, పీ4 లాంటి కార్యక్రమాలతో ఇచ్చిన చేయూతతో ఏ మేరకు జీవన ప్రమాణాలు పెరిగాయో చూడాలి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, వర్గాల్లో తలసరి ఆదాయం పెంచేందుకు కృషి చేయాలి.” అని చంద్రబాబు వెల్లడించారు.

*ప్రాంతాల మధ్య పోటీ ఉండాలి… అభివృద్ధి పరుగులు పెట్టాలి*

“అభివృద్ధిలో ఉత్తరాంధ్ర దూసుకెళ్తోంది. ఉత్తరాంధ్రతో రాయలసీమ పోటీ పడుతోంది. ఉత్తరాంధ్రలో ఆర్సెలార్ మిట్టల్, టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలు వస్తున్నాయి. రాయలసీమలో లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకూ పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి. శ్రీసిటీతో పాటు తిరుపతి కేంద్రంగానూ పరిశ్రమలు వస్తున్నాయి. టూరిజం సర్క్యూట్ల ఏర్పాటు ద్వారా ఆర్ధిక ఎకోసిస్టం ఏర్పాటు అవుతుంది. ఎంఎస్ఎంఈలను కూడా ప్రోత్సహించేలా పాలసీలను తీసుకువచ్చాం. పోర్టులు, ఎయిర్ పోర్టులు కూడా వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నాం. గ్రీన్ ట్యాక్స్‌ను కూడా రద్దు చేశాం. సీ-వీడ్ కల్చర్‌ను లాజికల్‌గా తీసుకెళ్తే పెద్దఎత్తున ఆర్ధిక లబ్ది చేరే అవకాశం ఉంటుంది. బయోఫ్యూయెల్ సహా వివిధ రకాలుగా సీ-వీడ్ వినియోగం పెరిగింది. అవసరమైతే దాని కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేద్దాం.” అని ముఖ్యమంత్రి చెప్పారు.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

GlobalTrade:భారత్–అమెరికా వాణిజ్య చర్చలు ప్రారంభం: ఢిల్లీలో బ్రెండన్ లించ్ పర్యటన

Next Post

HealthyLifestyle:లివర్ సమస్యలు, లక్షణాలు మరియు ఉత్తమమైన ఆయుర్వేద నివారణ మార్గాలు

Related Posts

Revanth Reddy
Big Story

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పవర్ గేమ్.. అధిష్ఠానం కొత్త వ్యూహం వెనుక అసలు కథ ఇదే!

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?
Andhra Pradesh

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

Chandrababu Welfare Policy
Andhra Pradesh

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav
Andhra Pradesh

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

Revanth Reddy Education Speech
Big Story

Revanth Reddy Education Speech: ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు!

Ayurveda Treatment
Andhra Pradesh

Ayurveda Treatment: విరూపాక్షపురం నుంచి మూడు తరాలుగా సాగుతున్న మోహన్‌రావు కుటుంబం ఆయుర్వేద సేవా ప్రస్థానం

Next Post
HealthyLifestyle:లివర్ సమస్యలు, లక్షణాలు మరియు ఉత్తమమైన ఆయుర్వేద నివారణ మార్గాలు

HealthyLifestyle:లివర్ సమస్యలు, లక్షణాలు మరియు ఉత్తమమైన ఆయుర్వేద నివారణ మార్గాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పవర్ గేమ్.. అధిష్ఠానం కొత్త వ్యూహం వెనుక అసలు కథ ఇదే!

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

Chandrababu Welfare Policy

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

Recent News

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పవర్ గేమ్.. అధిష్ఠానం కొత్త వ్యూహం వెనుక అసలు కథ ఇదే!

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

Chandrababu Welfare Policy

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info