ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం అధికంగా పెరిగిపోతుంది. భారత రాజధాని దిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో వాయు కాలుష్యం అధికమవుతోంది. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన గాలి కలిగిన నగరాలను పరిశోధకులు గుర్తించారు. ఈ నగరాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 20 కంటే తక్కువగానే ఉండటం అక్కడి పరిశుభ్రమైన గాలి, వాతావరణాన్ని చాటుతోంది.
ఈ లిస్టులో నార్వే దేశంలోని ఓస్లో నగరం ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉంది. అక్టోబర్ 24, 2025 నాటికి ఓస్లో లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 1 గా ఉంది. ఇక్కడి పరిశుభ్రమైన గాలికి గల కారణం.. ప్రేవేట్ వాహనాల నుంచి వెలువడే శిలాజ ఇంధనాలను తగ్గించుకోవడమే. 2024 చివరి నాటికి ఓస్లోలోని అన్ని ప్యాసింజర్ వాహనాల్లో 89 శాతం వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా మారనున్నాయి. అలాగే 2028 చివరి నాటికి అన్ని ప్రభుత్వ బస్సులు, రైళ్లు, ఇతర వాహనాలు వాయు కాలుష్యం నుంచి విముక్తి పొందనున్నాయి.
రెండో స్థానంలో అమెరికాలోని డెట్రాయిట్ నగరం ఉంది. అక్టోబర్ 24, 2025 నాటికి డెట్రాయిట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 8 గా ఉంది. ఈ నగరం గతంలో అత్యంత కాలుష్యం కలిగిన నగరాల్లో ఒకటిగా ఉండేది. అనేక సంవత్సరాల ప్రచారం, అవగాహన తర్వాత నగరంలోని మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ను నిషేధించారు. దీంతో డెట్రాయిట్ లో స్వచ్చమైన గాలి వీస్తూంది. మూడో స్థానంలో అల్జీరియాలోని అల్జీరీస్ నగరం ఉంది. అల్జిరీస్ నగరంలో అక్టోబర్ 24, 2025 నాటికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 11 గా ఉంది. నాలుగో స్థానంలో కెనడాలోని టోరంటో నగరం ఉంది. టోరంటో నగరం నిత్యం వాహనాలతో రద్దీగా ఉన్నప్పటికీ అక్కడి గాలి నాణ్యత 11 ఉండటం విశేషం.
గాలి నాణ్యతలో ఐదో స్థానంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం ఉంది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ నగరాల్లో సిడ్నీ ఒకటిగా ఉంది. అక్టోబర్ 24, 2025 నాటికి సిడ్నీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 16 గా ఉంది. ఆరో స్థానంలో మలేషియాలోని కౌలాలంపూర్. ఇక్కడ వీధిల్లో ట్రాఫిక్ భారీగా ఉంటుంది. భూములు, అడవుల దహనం కూడా ఇక్కడ అధికంగా ఉంటుంది. ఇక్కడ గాలి నాణ్యత ఇండెక్స్ లో 17 గా ఉండటం విశేషం. ఏడో స్థానంలో పోర్చుగల్ లోని లిస్బాన్ ఉంది. అక్టోబర్ 24, 2025 నాటికి లిస్బాన్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 17 గా ఉంది.
ఎనిమిదో స్థానంలో అమెరికాలోని వాషింగ్టన్ నగరం ఉంది. ఇక్కడ కార్చిచ్చులు కూడా అధికం. కానీ అక్టోబర్ 24, 2025 నాటికి ఇక్కడి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 17 గా ఉంది. తొమ్మిదో స్థానంలో అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీ ఉంది. ఇక్కడి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 17 గా ఉంది. ఇక పదో స్థానంలో నార్త్ మసెడోనియాలోని స్కోప్ జీ నగరం ఉంది. ఇక్కడి గాలి నాణ్యత ఇండెక్స్ 18 గా ఉంది.
 
			



















