మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ట్రిపుల్ ట్రీట్ ఉంటుందని అభిమానులెంతో ఆశగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. మూడు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వస్తాయని అంతా ఎదురు చూస్తున్నారు. అవి ఏ రూపంలో ఎలా? ఉంటాయన్నది గెస్ చేయలేదు గానీ..అభిమానులకు మాత్రం బిగ్ ట్రీట్ లాగే ఉంటుందని భావిస్తున్నారు. తాజాగా అభిమానుల అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయి. అభిమానులు కోరుకుంటున్నట్లు మూడు అప్ డేట్స్ తో మెగాస్టార్ ముందుకు రావడానికి రెడీ అవుతు న్నట్లు తెలిసింది.
విశ్వంభర’ చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ చేయాలని దర్శకుడు వశిష్ట ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలిసింది. అదో రోజు రిలీజ్ తేదీ కూడా ప్రకటించబోతున్నారుట. మేకర్స్ డేట్ పై ఈనెల 20 వ తేదీలోగా నిర్ణయం తీసుకుంటారని అత్యంత సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తుంది. విశ్వంభరకు సంబంధించి ఈ రెండు తప్పని సరిగా ప్రకటించాలని మేకర్స్ స్ట్రాంగ్ గా ఫిక్సైనట్లు తెలుస్తోంది. అలాగే అనీల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి 157వ సినిమా ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా లో చిరంజీవి లుక్ పై ఆద్యంతం ఆసక్తి నెలకొంది. ఇప్పటికే చిరంజీవి స్లిమ్ లో ఆకట్టుకుం టున్నారు. దీంతో 157 లుక్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. అదే రోజు టైటిల్ కూడా ప్రకటిస్తారని సమాచా రం. సినిమా మొదలవ్వడానికి ముందే బోలెడంత హడావుడి చేసిన అనీల్ రావిపూడి అన్నయ్య బర్త్ డేకి హడావుడి చేయకుండా ఉంటాడా? అని అభిమానులు ఎంతో నమ్మకంతో ఎదురు చూస్తు న్నారు.
ప్రస్తుతం చిరంజీవి ఈ రెండు సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారు. విశ్వంభర చిత్రానికి సంబంధించి డబ్బింగ్ చెబుతున్నారు. ఈ సినిమా సీజీ వర్క్ వేగంగా జరుగుతోంది. ఆ పనులతో పాటు వశిష్ట డబ్బింగ్ పనులు చూస్తున్నాడు. 157వ సినిమా షూటింగ్ లో కూడా చిరంజీవి పాల్గొంటున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తైన సంగతి తెలిసిందే. జనవరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది టార్గెట్.