• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Chinnaswamy Stadium Stampede: విషాదంగా మారిన విజయం

Chinnaswamy Stadium Stampede: విషాదంగా మారిన విజయం

బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట 11మంది మృతి.. 47మందికి గాయాలు
ఐపీఎల్‌ విజేత ఆర్‌సీబీ అభినందన సభలో ఘటనఅభిమాన ఆటగాళ్ళను చూసేందుకు పోటెత్తిన జనాలువిషాదాన్ని ఊహించలేదు : కర్నాటక సీఎం సిద్ధరామయ్యప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ సహా పలువురి విచారంస్టేడియం కెపాసిటీ 30వేలు, వచ్చింది రెండు లక్షల మందికి పైనేఘటనపై మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశంమృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా

విజయోత్సవ సభ కాస్తా విషాదంగా మారింది. 18 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మంగళవారం జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) విజయం సాధించిన నేపథ్యంలో ఆ బృందాన్ని సన్మానించడానికి కర్నాటకలోని బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ సన్మాన కార్యక్రమానికి వచ్చే తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వేలాదిగా అభిమానులు, ప్రజలు స్టేడియానికి పోటెత్తారు. స్టేడియం గేట్లు తెరవగానే ఒక్కసారిగా లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో తోపులాట మొదలైంది. జనాన్ని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జి కూడా చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇది తొక్కిసలాటకు దారి తీసింది. ఈ విషాద ఘటనలో ఆరేండ్ల బాలికతో సహా 11మంది మృతి చెందగా, 47మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భయపడుతున్నారు.తొక్కిసలాట జరిగిన ప్రాంతం వద్ద హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. చెప్పులు చెల్లాచెదురుగా పడివున్నాయి. తొలుత విధానసౌధలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్‌లు క్రీడాకారుల బృందాన్ని సన్మానించారు. అక్కడి నుంచి వారు స్టేడియానికి రావాల్సి ఉంది. ఈలోగానే ఈ విషాదం సంభవించింది. తొక్కిసలాట కారణంగా క్రీడాకారుల సన్మాన కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. స్టేడియంవైపు వెళ్ళే మెట్రోలు, ఇతర వాహనాలను కూడా ఆపేశారు.
బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట 11మంది మృతి.. 47మందికి గాయాలు
ఐపీఎల్‌ విజేత ఆర్‌సీబీ అభినందన సభలో ఘటనఅభిమాన ఆటగాళ్ళను చూసేందుకు పోటెత్తిన జనాలువిషాదాన్ని ఊహించలేదు : కర్నాటక సీఎం సిద్ధరామయ్యప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ సహా పలువురి విచారంస్టేడియం కెపాసిటీ 30వేలు, వచ్చింది రెండు లక్షల మందికి పైనేఘటనపై మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశంమృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా
బెంగళూరు : విజయోత్సవ సభ కాస్తా విషాదంగా మారింది. 18 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మంగళవారం జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) విజయం సాధించిన నేపథ్యంలో ఆ బృందాన్ని సన్మానించడానికి కర్నాటకలోని బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ సన్మాన కార్యక్రమానికి వచ్చే తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వేలాదిగా అభిమానులు, ప్రజలు స్టేడియానికి పోటెత్తారు. స్టేడియం గేట్లు తెరవగానే ఒక్కసారిగా లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో తోపులాట మొదలైంది. జనాన్ని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జి కూడా చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇది తొక్కిసలాటకు దారి తీసింది. ఈ విషాద ఘటనలో ఆరేండ్ల బాలికతో సహా 11మంది మృతి చెందగా, 47మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భయపడుతున్నారు.తొక్కిసలాట జరిగిన ప్రాంతం వద్ద హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. చెప్పులు చెల్లాచెదురుగా పడివున్నాయి. తొలుత విధానసౌధలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్‌లు క్రీడాకారుల బృందాన్ని సన్మానించారు. అక్కడి నుంచి వారు స్టేడియానికి రావాల్సి ఉంది. ఈలోగానే ఈ విషాదం సంభవించింది. తొక్కిసలాట కారణంగా క్రీడాకారుల సన్మాన కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. స్టేడియంవైపు వెళ్ళే మెట్రోలు, ఇతర వాహనాలను కూడా ఆపేశారు.
ఈ విషాదాన్ని ఊహించలేదు : సీఎం సిద్ధరామయ్య
రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా
ఇంతటి విజయోత్సవ సమయంలో ఇలాంటి విషాదాన్ని అస్సలు ఊహించలేదని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. విధానసౌధ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అంచనాలకు మించి జనాలు స్టేడియానికి పోటెత్తారని అన్నారు. విధానసౌధకు వెలుపల దాదాపు లక్ష మంది ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ గుమిగూడారని తెలిపారు. కానీ అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగలేదన్నారు. ”చిన్నస్వామి స్టేడియంలో దాదాపుగా 30వేలమంది పడతారు, కానీ గేట్ల వద్ద దాదాపు రెండు మూడు లక్షలమంది ఉన్నారు. తోపులాట ఉంటుందని ఊహించాం. రాత్రే ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది, ఉదయానికి మేం సన్నద్ధం కావాల్సి వచ్చింది. కాకపోతే ఇంత జనాన్ని ఊహించలేదు” అని ముఖ్యమంత్రి చెప్పారు. అయినా చేయగలిగినంతవరకూ ఏర్పాట్లు చేశామన్నారు. మృతి చెందిన వారిలో ఎక్కువమంది యువతేనని ఆయన విచారం వ్యక్తం చేశారు.
బీజేపీ రాజకీయాలు చేస్తోంది
ఈ ఘటన విషయంలో బీజేపీ తీరును సిద్ధరామయ్య తప్పుబట్టారు. అనూహ్యంగా వచ్చిన జనం కారణంగా ఈ సంఘటన జరిగినా.. ప్రతిపక్ష బీజేపీ దీనిపై రాజకీయాలు చేస్తోందనీ, కానీ తాను అలా చేయాలనుకోవడం లేదని సీఎం అన్నారు. భద్రతా యంత్రాంగం వైఫల్యమా లేక మరేదైనా ఉందా అనే విషయం తేల్చుకునేందుకు మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. 15రోజుల్లో నివేదిక వస్తుందని ఆయన అన్నారు. ఈ తొక్కిసలాటలో మరణించినవారి కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి ఉచిత చికిత్సనందిస్తామని తెలిపింది.
పోలీసులను నిందించొద్దు : డిప్యూటీ సీఎం
తొక్కిలాటపై పోలీసులను తప్పు పట్టవద్దని డిప్యూటీ సీఎం డి.కె శివకుమార్‌ అన్నారు. ”పరిస్థితిని చూసి దానికి తగినట్టుగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రణాళికలను కూడా మార్చాం. చేయగలిగినదంతా చేశాం. అయినా, ఆ జనాన్ని నియంత్రించడం ఎవరి వల్లా కాలేదు. ఇందుకు పోలీసులను నిందించరాదు” అని ఆయన చెప్పారు.
వ్యవధి లేదు
మంగళవార రాత్రే ఫైనల్‌ మ్యాచ్‌ జరగటం.. ఆ తర్వాత రోజే ఈ వేడుకలను నిర్వహించటంపై అందరిలోనూ ప్రశ్నలను కలగజేస్తున్నాయి. ఈ వేడుకలను తర్వాత నిర్వహించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదనీ, ఇంత తక్కువ వ్యవధిలో ఎందుకు నిర్వహించారని అంతా అనుకుంటున్నారు. అయితే, ఆర్‌సీబీ తరఫున ఆడిన క్రీడాకారుల్లో చాలామంది ఈ రాత్రికే దేశాన్ని వీడాల్సి ఉన్నది. వారికి ఉన్న ఇతర కార్యక్రమాల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ సన్మాన సభను ఇంత తక్కువ వ్యవధిలో ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి నసీర్‌ అహ్మద్‌ చెప్పారు.

ప్రధాని, రాహుల్‌, ఖర్గే ప్రభృతుల ఖండన
తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలియచేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషాద సమయంలో తన మనస్సు బెంగళూరులోనే ఉందన్నారు. కేంద్రరక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్రం ఆందోళనను వ్యక్తం చేశారు.
మనిషి జీవితం కంటే ఏ వేడుక కూడా ఎక్కువ కాదని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. హృదయవిదారకంగా మారిన పరిస్థితుల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు అవసరమైన సాయాన్ని కర్నాటక ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఈ ఘటనపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. గాయపడి, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు పరామర్శించారు. కర్నాటక గవర్నర్‌ తావర్‌చంద్‌ గెహ్లాట్‌ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలన్నారు. మాజీ సీఎం, ఎంపీ బసవరాజు బొమ్మై ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. సరైన ప్రణాళిక లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందనీ, ఇందుకు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి హెచ్‌.డి.కుమారస్వామి డిమాండ్‌ చేశారు.
బాధితులకు రూ. 5లక్షలు
తొక్కిసలాట ఘటనపై కర్నాటక రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్పందించింది. దీనిపై విచారాన్ని వ్యక్తం చేసింది. మరణించినవారి కుటుంబాలకు రూ.5లక్షలు అందచేస్తామని ప్రకటించింది.

18 ఏళ్ల కల నెరవేరిన వేళ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంబరాలు కాస్తా విషాదానికి దారితీశాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో పది మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 18 ఏళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ కప్ గెలవటంతో.. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు భారీగా తరలిరావటం.. పోలీసులు వారిని నియంత్రించలేకపోవటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది మంది వరకూ చనిపోగా.. వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమంలో తొక్కిసలాట ఘటనపై.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటన తననెంతో కలిచివేసిందంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. బాధితుల్లో చిన్నారులు కూడా ఉన్నారన్న వార్తలు మరింత బాధను కలిగిస్తున్నాయన్న పవన్ కళ్యాణ్.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

” బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవంలో తొక్కిసలాట జరగడం బాధాకరం. ఈ తొక్కిసలాటలో దురదృష్టవశాత్తు ప్రాణనష్టం సంభవించడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఈ ఘటన చాలా హృదయ విదారకమైనది. మరణించిన వారిలో పిల్లలు కూడా ఉండటం మరింత బాధిస్తోంది. వేడుకలు చేసుకోవాల్సిన సమయం.. ఇంత విషాదంగా మారడం చాలా దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.” అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

మరోవైపు 2025 ఐపీఎల్ ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ మీద ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది, 2009, 2011, 2016లో ఐపీఎల్ ఫైనల్‌కు చేరినా.. విజేతగా నిలవడంలో తడబడిన ఆర్సీబీ.. ఈసారి తుదిపోరులో కడదాకా పోరాడి ఐపీఎల్ విజేతగా నిలిచింది. దీంతో దేశవ్యాప్తంగా విరాట్ కోహ్లి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌ విజేతగా నిలిచిన ఆర్సీబీకి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే సంబరాల వేళ ఇలా విషాదం జరగటం అందరినీ కలిచివేస్తోంది.

The tragic incident of a stampede during the @RCBTweets victory celebrations at Bengaluru’s M. Chinnaswamy Stadium, resulting in the unfortunate loss of lives, is truly shocking and heartbreaking. The fact that children are among the deceased makes it even more painful. It is…

— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) June 4, 2025

Tags: #BengaluruNews#ChinnaswamyStadium#ChinnaswamyTragedy#CricketNews#CricketStampede#CrowdManagement#IndiaNews#IPLIncident#MatchTragedy#PublicSafety#RCBFans#SportsEventCrisis#SportsSafety#StadiumCrowdControl#StadiumStampede#TragicVictory#Vishadham
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Tabu: లేటు వ‌య‌సులో ఘాటు ఫోజు!

Next Post

Ap Govt: మరింత ఖుషీ!

Related Posts

Andhra Pradesh: ఇదేంది జ‌గ‌న్..!
Andhra Pradesh

Andhra Pradesh: ఇదేంది జ‌గ‌న్..!

Andhra Pradesh: కేబినెట్ లోకి నాగబాబు..?
Andhra Pradesh

Andhra Pradesh: కేబినెట్ లోకి నాగబాబు..?

Virat Kohli:  అక్కడే సెటిల్..?
Big Story

Virat Kohli: అక్కడే సెటిల్..?

PRIYANKA CHOPRA: తీవ్ర విషాదం..!
Entertainment

PRIYANKA CHOPRA: తీవ్ర విషాదం..!

Tirumala: ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్న  రేణిగుంట విమానాశ్రయం
Andhra Pradesh

Tirumala: ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్న రేణిగుంట విమానాశ్రయం

Air India Plain Crash: DNA ద్వారా 184 మృతదేహాల గుర్తింపు..!
Big Story

Air India Plain Crash: DNA ద్వారా 184 మృతదేహాల గుర్తింపు..!

Next Post
Ap Govt: మరింత ఖుషీ!

Ap Govt: మరింత ఖుషీ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Andhra Pradesh: ఇదేంది జ‌గ‌న్..!

Andhra Pradesh: ఇదేంది జ‌గ‌న్..!

Andhra Pradesh: కేబినెట్ లోకి నాగబాబు..?

Andhra Pradesh: కేబినెట్ లోకి నాగబాబు..?

Virat Kohli:  అక్కడే సెటిల్..?

Virat Kohli: అక్కడే సెటిల్..?

PRIYANKA CHOPRA: తీవ్ర విషాదం..!

PRIYANKA CHOPRA: తీవ్ర విషాదం..!

Recent News

Andhra Pradesh: ఇదేంది జ‌గ‌న్..!

Andhra Pradesh: ఇదేంది జ‌గ‌న్..!

Andhra Pradesh: కేబినెట్ లోకి నాగబాబు..?

Andhra Pradesh: కేబినెట్ లోకి నాగబాబు..?

Virat Kohli:  అక్కడే సెటిల్..?

Virat Kohli: అక్కడే సెటిల్..?

PRIYANKA CHOPRA: తీవ్ర విషాదం..!

PRIYANKA CHOPRA: తీవ్ర విషాదం..!

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info