ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఇద్దరూ కలసి కట్టుగా ఈసారి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. గతంలో ఎపుడూ ఇలా జరగలేదు. బాబు మానాన ఆయన ఢిల్లీకి వెళ్తే లోకేష్ విడిగా వెళ్ళేవారు. ఈసారి మాత్రం కలిసే వెళ్తున్నారు. ఇది రాజకీయంగా ఒక విశేషంగా చూస్తున్నారు. ఇక ఢిల్లీలో బాబు లోకేష్ ఇద్దరూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు అని అంటున్నారు. ఢిల్లీకి వస్తున్న తండ్రీ కొడుకులు అక్కడ కేంద్ర పెద్దలతో కూడా భేటీల మీద భేటీలు వేయనున్నారు అని అంటున్నారు.
బాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఐఐ సదస్సులో పాల్గొంటారు అని అంటున్నారు ఇక ఈ సదస్సు తరువాత బాబు షెడ్యూల్ కూడా బిజీగా ఉండనుంది. ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలుస్తారు అని అంటున్నారు. జీఎస్టీ 2.0 మీద ప్రచారాన్ని కర్నూలు జిల్లాలో అక్టోబర్ 16న నిర్వహిస్తున్నారు. దానికి ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు పలువురు హాజరవుతున్నారు. అంతే కాదు ఏపీ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ హాజరు ఇతర రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. దాంతో చంద్రబాబు నిర్మలా సీతారామన్ ని ఈ సదస్సుకు రావాలని లాంచనంగా ఆహ్వానించనున్నారు అని అంటున్నారు.
చంద్రబాబు ఈసారి పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా భేటీ అవుతారు అని అంటున్నారు. నరేంద్ర మోడీని కూడా ఏపీ పర్యటనకు అధికారికంగా ఆహ్వానిస్తూనే అనేక అంశాల మీద ఇరువురు నేతల మధ్య చర్చలు జరుగుతాయని అంటున్నారు. ఏపీలో తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో పాటుగా జాతీయ స్థాయి రాజకీయ పరిణామాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ నెలలోనే ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీకి వెళ్ళిన బాబు ఇపుడు మోడీతో మాత్రం భేటీ వేయడమే విశేషం. మరి ఏ రాజకీయ అంశాలు చర్చకు వస్తాయో చూడాల్సి ఉందని అంటున్నారు.
మరో వైపు నారా లోకేష్ కూడా కేంద్ర మంత్రులతో భేటీలు వేస్తారని అంటున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చిస్తారు అని అంటున్నారు ఒక రోజంతా సాగే తండ్రీ కొడుకుల ఢిల్లీ టూర్ తరువాత బాబు నేరుగా విజయనగరం జిల్లా పర్యటనకు వస్తారని లోకేష్ తిరిగి అమరావతికి బయల్దేరి వెళ్తారు అని అంటున్నారు. మొత్తం మీద ఒకేసారి కలసి తండ్రీ కొడుకులు చేసే హస్తిన పర్యటన ఆసక్తిని కలిగిస్తోంది అని అంటున్నారు.