ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2 దర్శకుడు రాజ్ నిడిమోరు, నటి సమంత గురించి కొంతకాలంగా నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తరచూ కలిసి కనిపించడంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. సామ్ ప్రొడక్షన్ డెబ్యూ మూవీ శుభం సమయంలో ఇద్దరూ తొలిసారి బహిరంగంగా కనిపించారు.
ఆ తర్వాత విదేశాలకు పలుమార్లు సామ్ వెళ్లగా.. ఆమె వెంటే రాజ్ నిడిమోరు ఉంటున్నారు. ఆయన సింగిల్ పిక్స్ తోపాటు రాజ్ తో దిగిన ఫొటోలు కూడా సమంత షేర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కొన్ని నెలల్లో చాలా సార్లు అలా జరిగింది. దీంతో రాజ్ నిడిమోరు, సమంత ఇద్దరూ.. త్వరలో ఒక్కటి కానున్నారని ప్రచారం జరుగుతోంది.
అదే సమయంలో రాజ్ నిడిమోరు భార్య శ్యామాలి.. ఎప్పటికప్పుడు సందేశాత్మక పోస్టులు పెడుతున్నారు. రీసెంట్ గా తెలివితక్కువగా ప్రవర్తించడానికి కూడా తెలివిగా స్పందించండంటూ పోస్ట్ చేశారు. నిష్పాక్షికత అంటే ఇక్కడ మీరు ఏది సొంతం చేసుకోకూడదు.. అలాగే ఏది కూడా మిమ్మల్ని సొంతం చేసుకోకూడదంటూ కూడా రాసుకొచ్చారు.
అలా అటు రాజ్ తో సామ్ పోస్టులు & షికార్లు.. ఇటు శ్యామాలి పోస్టులు.. దీంతో ఆ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కానీ ఇప్పటి వరకు ఓపెన్ గా సమంత గానీ, రాజ్ నిడిమోరు గానీ, శ్యామాలి గానీ రెస్పాండ్ అవ్వడం లేదు. ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు.
ముఖ్యంగా సామ్ ను ఇప్పుడు అనేక మంది నెటిజన్లు, అభిమానులు క్వశ్చన్ చేస్తున్నారు. కొన్ని నెలలుగా రూమర్స్ వస్తున్నా.. ఇప్పటికైనా ఏదో క్లారిటీ ఇవ్వండని అడుగుతున్నారు. ఒకవైపు రూమర్స్ వస్తూనే ఉన్నా.. మరోవైపు పోస్టులు పెడుతున్న సామ్.. ఉందని చెప్పడం లేదు.. లేదని చెప్పడం లేదు.. అసలేం జరుగుతుందో చెప్పాలని అంటున్నారు.
కాగా.. రాజ్- డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2, సిటడెల్: హనీ బన్నీ వెబ్ సిరీసుల్లో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఆయా ప్రాజెక్ట్‌ల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే రాజ్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. శుభం మూవీకి క్రియేటివ్ డైరెక్టర్ గా రాజ్ నిడిమోరు వర్క్ చేశారు. మరి వారిద్దరి మధ్య ఏం జరుగుతుందో.. ఎప్పుడు ఓపెన్ అవుతారో వారికే తెలియాలి.