పెద్ది పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా విషయంలో కూడా దూకుడు చూపిస్తున్నాడని తెలుస్తుంది. బుచ్చి బాబు డైరెక్షన్ లో చేస్తున్న పెద్ది 2026 మార్చి 28 రిలీజ్ అనౌన్స్ చేశారు. అనుకున్న డేట్ కి ఎట్టిపరిస్థితుల్లో తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎక్కడ తగ్గకుండా బడ్జెట్ పెట్టేస్తున్నారట. ఐతే చరణ్ పెద్దినే కాదు నెక్స్ట్ సుకుమార్ తో చరణ్ చేసే సినిమాను కూడా వాళ్లే నిర్మిస్తున్నారు.
RC17వ సినిమా సుకుమార్ డైరెక్షన్ లో ఫిక్స్ అయ్యింది. సుకుమార్ రామ్ చరణ్ కాంబో అనగానే అందరికీ రంగస్థలం గుర్తుకొస్తుంది. రంగస్థలం చిట్టి బాబు పాత్రలో రామ్ చరణ్ అదరగొట్టాడు. ఐతే ఈసారి సుకుమార్ దానికి మించే పాత్రలో ఈ సినిమా చేస్తున్నాడట. అంతేకాదు RC 17 సినిమా కౌబాయ్ కథతో వస్తుందన్న టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ వెండితెర మీద కౌబాయ్ కథలు ఒకప్పుడు బాగా వచ్చాయి. కానీ ఇప్పుడు అవి తగ్గాయి.
చరణ్ తో సుకుమార్ తీసే కథ కౌబాయ్ కథ అంటున్నారు. రామ్ చరణ్ ఎలాగు హార్స్ రైడింగ్ లో దిట్టని తెలిసిందే. సో మరోసారి చరణ్ టాలెంట్ ని ఫుల్లుగా వాడేయాలని సుకుమార్ ఫిక్స్ అయ్యాడు. చరణ్ తో సుకుమార్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఈ ఇయర్ ఎండింగ్ లోనే సెట్స్ మీదకు వెళ్తుందట. ప్రస్తుతం సుకుమార్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నాడని తెలుస్తుంది. త్వరలోనే సినిమా ఫైనల్ కాస్టింగ్ అనౌన్స్ చేస్తారట.
పెద్ది సినిమా షూటింగ్ పూర్తి చేయడం ఆలస్యం సుకుమార్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లేలా చూస్తున్నాడు రామ్ చరణ్. తప్పకుండా ఈ కాంబో రేంజ్ అంచనాలకు తగినట్టుగానే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. పుష్ప తర్వాత సుకుమార్ రేంజ్ ఏంటో తెలిసిందే. సో ఎలా చూసినా సరే ఈ సినిమా మాస్ రాంపేజ్ పక్కా అని చెప్పొచ్చు. చరణ్ కూడా సుకుమార్ సినిమా అనే సరికి మరింత ఫోకస్ చేస్తున్నాడు. పెద్ది తో మాస్ హిట్ టార్గెట్ పెట్టిన చరణ్ ఆర్సీ 17 అదే సుకుమార్ సినిమాతో పాన్ వరల్డ్ ని షేక్ చేయాలని చూస్తున్నాడు. ఈ కాంబో మీద ఉన్న అంచనాలు అలాంటివి కాబట్టి సుక్కు, చరణ్ బొమ్మ బ్లాక్ బస్టర్ షురూ అనేస్తున్నారు.