బిగ్ బాస్ సీజన్ 9 నేడు మొదలు కాబోతుంది. షోకి సంబందించిన తొలి ప్రోమో కూడా వచ్చేసింది. ఈసారి సీజన్ సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్ ఆట రణరంగమే అంటూ నాగార్జున ఊరిస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచింగ్ ఎపిసోడ్ షూట్ పూర్తైంది. ఈరోజు స్టార్ మా లో రాత్రి 7 గంటల నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 9 తొలి ప్రోమో వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 9 లో రెండు హౌజ్ లు ఉంటాయట. అంతేకాదు సెలబ్రిటీస్ ని కూడా రెండు కేటగిరీస్ కింద హౌస్ లోకి పంపిస్తారట.
సీజన్ 9 ప్రోమో సూపర్ హై ఇచ్చింది. ఇక హౌస్ లోకి వెళ్లే 14 మంది కంటెస్టెంట్స్ లిస్ట్ ఆల్రెడీ బయటకు వచ్చింది. సినిమా స్టార్స్, సీరియల్ స్టార్స్, కమెడియన్స్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్, కామన్ మ్యాన్ నుంచి ఎంపిక చేసిన ఐదుగురు ఇలా అందరు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 లో సెలబ్రిటీ కంటెస్టెంట్స్ గా సీరియల్ యాక్టర్ తనూజ గౌడ, భరణి శంకర్ వెళ్తున్నారు. ఫోక్ సింగర్ రాము రాథోడ్, కమెడియన్ సుమన్ శెట్టి, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయెల్, రీతూ చౌదరి, ఆషా శైనీ, సంజన గర్లాని వచ్చారు. ఇక కామన్ మ్యాన్ గా అగ్నిపరీక్ష ఎదుర్కొని జ్యూరీ మెప్పు పొందడమే కాకుండా బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఓటింగ్ ద్వారా ఐదుగురు హౌజ్ లోకి వచ్చారు.
కామన్ మ్యాన్ గా మనీష్, హరీష్, ప్రియా శెట్టి, శ్రీజ, పవన్ కళ్యాణ్ హౌస్ లోకి వచ్చారు. నేడు ప్రారంభం కాబోతున్న ఈ షో షూటింగ్ ఆల్రెడీ పూర్తి కాగా మొత్తం 14 మెంబర్స్ హౌస్ లోకి పంపించేశారు. ఐతే ఈ సీజన్ లో కూడా బిగ్ బాస్ సీజన్ 9 2.ఓ ఉంటుందట. నాలుగైదు వారాల తర్వాత మరో ఐదుగురు కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపిస్తారట. ఐతే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా కామన్ మ్యాన్ అదే అగ్నిపరీక్షలో టాప్ 13 ఎవరైతే ఉన్నారో వాళ్లలోనే ఎంపిక ఉంటుందని టాక్. ఏది ఏమైనా ఈసారి బిగ్ బాస్ టీం ఈసారి గట్టి ప్లానింగ్ తోనే ఉన్నట్టు అనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్.. ఈసారి ఫైట్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. టాస్కులు, గొడవలు బిగ్ బాస్ ఆడియన్స్ ని కావాల్సినంత స్టఫ్ రెడీ చేస్తున్నారట. బిగ్ బాస్ సీజన్ 9 జోష్ మొదలైంది. నేటి నుంచి మరో 100 రోజుల దాకా బిగ్ బాస్ లవర్స్ కి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు.