ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Karnataka: బెంగళూరు విషాదానికి బాధ్యులెవరు..?

Karnataka: బెంగళూరు విషాదానికి బాధ్యులెవరు..?
ADVERTISEMENT

కర్ణాటక ప్రభుత్వం, పోలీసులు, క్రికెట్ పరిపాలనతో ముడిపడి ఉన్న అనేక అధికార వ్యవస్థల వైఫల్యం కారణంగా ఒక క్రికెట్ కార్యక్రమంలో అత్యంత దారుణమైన తొక్కిసలాటకు బెంగళూరు వేదికగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన అనేక అంశాలు, అధికార వ్యవస్థలతో పాటు వాటి నిర్ణయాలపై కఠిన ప్రశ్నలను లేవనెత్తాయి.కానీ ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు పూర్తిస్థాయిలో దొరకలేదు. ఇంకా కొన్ని ఊహలకే పరిమితమయ్యాయి.18 ఏళ్ల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్‌ టైటిల్‌ను గెలిచిన ఆనందం భారత ఐటీ రాజధానిగా పేరున్న బెంగళూరులో పతాకస్థాయికి చేరింది.మంగళవారం రాత్రి జట్టు గెలుపొందగానే అభిమానులు, టపాసులతో సంబరాలు చేసుకున్నారు. అనేక ప్రాంతాల్లో తెల్లవారుజామున 3 గంటల వరకు నగర పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.

విక్టరీ పరేడ్ బెంగళూరులోని విధాన సభ నుంచి స్టేడియం వరకు జరుగుతుందని బుధవారం ఉదయం 7:01 గంటలకు ఆర్సీబీ అధికారిక ఎక్స్ హ్యాండిల్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. తమ పోర్టల్ నుంచి ఉచిత పాస్‌లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కూడా అందులో పేర్కొన్నారు.రోడ్ షో గురించి మధ్యాహ్నం 3.14 గంటలకు ఆర్సీబీ హ్యాండిల్ నుంచి మరో ప్రకటన వచ్చింది. అలాగే, పోలీసులు, ఇతర అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను ప్రజలంతా పాటించాలని ఆ ప్రకటనలో కోరారు.విక్టరీ పరేడ్ నిర్వహించడానికి ఆర్సీబీకి (రాత్రి 1:45 నుంచి ఉదయం 7:00 గంటల మధ్యలో) ఏ అథారిటీ అనుమతి ఇచ్చిందనే ప్రశ్నకు సమాధానం ఇంకా తెలియాల్సి ఉంది.”ఆఖరి ఓవర్ వరకు ఏ జట్టు గెలుస్తుందనే సంగతి ఎవరికీ తెలియదు. జట్టు సభ్యులు జూన్ 4వ తేదీనే బెంగళూరుకు బయల్దేరారు. ఈ లోపే నగరంలో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసే సమయం ఉందా? ఇది అంత తేలికైన విషయం కాదనే సంగతి గమనించాలి” అని బీబీసీతో కర్ణాటక మాజీ డీజీపీ ఎస్టీ రమేష్ అన్నారు.

బందోబస్తు ఏర్పాటు చేసే సమయంలో ఎక్కడి నుంచి ఎవరు వస్తారు? ఎక్కడి నుంచి వెళతారు? ఆ సమయంలో రద్దీని ఎలా నియంత్రించాలి? అనే విషయాలు చూడాల్సి ఉంటుంది.అదే సమయంలో, ఎలాంటి నేరాలు జరగకుండా చూసుకోవాలి. భారీ సంఖ్యలో ప్రజలంతా గుమిగూడినప్పుడు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తులపై నిఘా ఉంచడం చాలా ముఖ్యం. మోహరించాల్సిన భద్రతా దళాల సంఖ్యను కూడా చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటారు.”శాంతిభద్రతల అంశం కూడా ఉంది. ఇదంతా ప్లాన్ చేయడానికి పోలీసుల వద్ద సమయం ఉందా? ఇంత తక్కువ సమయంలో పోలీసు బలగాలను సమీకరించాలి. అంటే పొరుగు జిల్లాల నుంచి కూడా పోలీసు బలగాలను సమీకరించాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయడానికి నగర పోలీసుల వద్ద అంత సమయం ఉందా? ఎవరికీ ఏమీ తెలియదు” అని బీబీసీతో రమేష్ వివరించారు.

స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు సన్మాన కార్యక్రమం జరుగుతుందని బెంగళూరు సిటీ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. అలాగే, ట్రాఫిక్ ఆంక్షల సమాచారమిస్తూ మధ్యాహ్నం 3:28 గంటలకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే, అందులో రోడ్ షో ఉంటుందా? లేక కేవలం బస్ పరేడ్ ఉంటుందా? అనే సమాచారం ఇవ్వలేదు.అలాగే ఆర్సీబీకి విధాన సభ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విక్టరీ పరేడ్ చేయడానికి అనుమతి ఇవ్వలేదని పోలీసుల తరఫు నుంచి సోషల్ మీడియాలో ఎక్కడా ఎటువంటి ప్రకటనా రాలేదు.బుధవారం మధ్యాహ్నం హోంమంత్రి జి. పరమేశ్వర అధ్యక్షతన జరిగిన సమావేశంలో, విక్టరీ పరేడ్‌ను ఇంత తక్కువ సమయంలో నిర్వహించలేమని నగర పోలీసులు ఎందుకు చెప్పలేదనే చర్చ ఇప్పుడు ఎక్కువగా జరుగుతోంది.

”ఇది సాధ్యం కాదని అధికారులకు పోలీసులు చెప్పి ఉండాలి. ఇందులో ఎదురయ్యే ఇబ్బందుల గురించి కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం, ఆర్సీబీ బృందానికి అర్థమయ్యేలా చెప్పి వారితో సమన్వయం చేసుకొని ఉండాల్సింది. ఇది కచ్చితంగా సాధ్యమయ్యే పని కాదని కచ్చితంగా ముఖ్యమంత్రి, హోం మంత్రికి చెప్పి ఉండాలి” అని రమేష్ అన్నారు.రమేష్ చెప్పిన మాటలతో మరో పోలీస్ అధికారి కూడా ఏకీభవించారు. అయితే ఆయన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.”ఇదొక రాజకీయ నిర్ణయం. పోలీసుల నిర్ణయం కాదు (వేడుకలకు అనుమతి ఇవ్వడం). అభిమానులకు గెలుపు మజా తగ్గిన తర్వాత కొన్ని రోజులకు ఈ వేడుకను నిర్వహించి ఉండాల్సింది. అప్పుడు ఇంత రద్దీ ఉండదు. అప్పుడు ఇలా ప్రాణాల మీదకు రాకుండా ఉండేది” అని ఆయన వివరించారు.

ఈ మొత్తం కార్యక్రమాన్ని కేఎస్‌సీఏ, ఆర్సీబీ నిర్వహించాయని విలేఖరుల సమావేశంలో హోం మంత్రి అన్నారు. ప్రభుత్వం కేవలం ఈ కార్యక్రమానికి హాజరైందని స్పష్టం చేశారు.ప్రభుత్వం కేవలం ఈ వేడుకకు హాజరైనట్లయితే, మరి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, జట్టుకు స్వాగతం పలకడానికి హెచ్‌ఏఎల్ విమానాశ్రయానికి వెళ్లాల్సిన అవసరం ఏంటని కాంగ్రెస్ నాయకుడొకరు అన్నారు.ఆర్సీబీ పోర్టల్ నుంచి ఉచిత పాస్‌లు తీసుకొని స్టేడియం లోపలికి వెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో ఈ తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.స్టేడియం సిబ్బంది, ఎవరినీ లోపలికి అనుమతించలేదు. ఎందుకంటే ప్రజలు, స్టేడియానికి చేరుకునే లోపే స్టేడియంలోని 32వేల సీట్లు అభిమానులతో నిండిపోయాయి. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు.తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ ఇన్‌స్టా హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.

Tags: #AccountabilityMatters#BengaluruIssues#BengaluruNews#BengaluruTragedy#BengaluruUpdate#BreakingNews#CityNews#Karnataka#KarnatakaCrisis#KarnatakaPolitics#NewsAlert#PublicSafety#SocialAwareness#VishadaVarthalu#WhoIsResponsible
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Pawan Kalyan: షాకింగ్ డెసిషన్..!

Next Post

Elon Musk: కొత్త పార్టీ..!

Related Posts

AliaBhatt
Entertainment

AliaBhatt:బాలీవుడ్ స్టార్ అలియా భట్ పుట్టినరోజు – అందం, ప్రతిభతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి నటి

NepaliGang
Crime

NepaliGang:జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ – పనిమనుషులుగా చేరిన నేపాలి గ్యాంగ్ రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు దోచుకెళ్లింది

MusiProject
Big Story

MusiProject:మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ తీవ్ర విమర్శలు – “లక్షన్నర కోట్ల ఆస్తిని జీరో వాల్యూ చేయాలా?”

TirumalaLaddu
Andhra Pradesh

TirumalaLaddu:తిరుమల లడ్డూ నెయ్యి వివాదం – జగన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు, రాజకీయంగా చర్చ

War : ఎందుకు ఇరాన్‌పై కఠినంగా నిలుస్తోంది United States? పూర్తి కథనం
Big Story

War : ఎందుకు ఇరాన్‌పై కఠినంగా నిలుస్తోంది United States? పూర్తి కథనం

DrugsParty
Big Story

DrugsParty:టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు అరెస్ట్

Next Post
Elon Musk: కొత్త పార్టీ..!

Elon Musk: కొత్త పార్టీ..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

AliaBhatt

AliaBhatt:బాలీవుడ్ స్టార్ అలియా భట్ పుట్టినరోజు – అందం, ప్రతిభతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి నటి

NepaliGang

NepaliGang:జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ – పనిమనుషులుగా చేరిన నేపాలి గ్యాంగ్ రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు దోచుకెళ్లింది

MusiProject

MusiProject:మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ తీవ్ర విమర్శలు – “లక్షన్నర కోట్ల ఆస్తిని జీరో వాల్యూ చేయాలా?”

TirumalaLaddu

TirumalaLaddu:తిరుమల లడ్డూ నెయ్యి వివాదం – జగన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు, రాజకీయంగా చర్చ

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info