విడుదలకు ముందు చాలా వివాదాలను మోసుకొచ్చింది బ్యాడ్ గర్ల్. అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ తమిళ చిత్రానికి వర్ష భరత్ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకులు వెట్రి మారన్ – అనురాగ్ కశ్యప్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా కథాంశం, ప్రధాన పాత్ర వివాదానికి దారి తీసాయి.
ఒక అందమైన టీనేజీ బ్రాహ్మణ యువతి తనకు నచ్చినట్టు జీవించాలని కోరుకుంటుంది. తనకంటూ కొన్ని ఇష్ఠాయిష్టాలు ఉన్నాయి. అయితే ఇది చుట్టూ ఉన్న సమాజానికి నచ్చదు. కారణం ఏదైనా ఈ మూవీ టీజర్ విడుదల కాగానే, వివాదానికి దారితీసింది. నిర్మాతలు బ్రాహ్మణ సమాజాన్ని తప్పుగా తెరపై చూపుతున్నారని, కించపరుస్తున్నారని చాలా మంది ఆరోపించారు.
ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు దక్కినా కానీ వాణిజ్యపరంగా ప్రభావం చూపలేకపోయింది. బ్యాడ్ గర్ల్ నవంబర్ 4న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ఓటీటీలో విడుదలవుతుంది.
ఈ బోల్డ్ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్ స్టార్ ఛేజిక్కించుకుంది. థియేట్రికల్ విండో దాదాపు తొమ్మిది వారాల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత ఓటీటీలోకి వస్తుంది. బ్యాడ్ గర్ల్‌లో శాంతి ప్రియ, శరణ్య రవిచంద్రన్, హృదు హరూన్, టీజే అరుణాసలం, శశాంక్ బొమ్మిరెడ్డిపల్లి కీలక పాత్రల్లో నటించారు. ఒక విలేజ్ లోని బ్రాహ్మణుల కుటుంబం నుంచి వచ్చిన టీనేజీ అమ్మాయి కథను తెరపై వీక్షించవచ్చు.












