రాజకీయాల్లో ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే.. ఇబ్బందులు తప్పవు. ఎంత నిజాయితీ ఉన్నప్పటికీ.. కొంత లౌక్యం అవసరం. లౌక్యంలేని రాజకీయాలు.. ఉప్పలేని పప్పుతో సమానం అంటారు. అలానే.. తాజాగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైఖరి కూడా ఉంది. ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడి.. ఇరకాటంలో పడ్డారు. ఎక్క డైనా సరే.. కొంత లౌక్యం జోడించే అలవాటు ఉన్న పవన్ .. కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఇటీవల మౌనంగా ఉం టున్నారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. పలు అంశాలపై చర్చించేందుకు అవకాశం ఉంది.
ఇదే విషయం.. అధికార పార్టీ నాయకుల మధ్య కూడా చర్చ జరిగింది. మెడికల్ కాలేజీలు, యూరియా, రైతుల సమస్య, విశాఖ ఉక్కుఫ్యాక్టరీ వంటివాటిపై చర్చ పెడితే.. ఆయా విషయాలపై ప్రస్తుతం వైసీపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారానికి కౌంటర్ ఇచ్చినట్టు అవుతుందని నాయకులు భావించారు. ఎందుకంటే.. ప్రస్తుతం ఈ విషయాలను అధికార పార్టీ నాయకులు ప్రస్తావించరు. ఇక, ప్రతిపక్షం నాయకులు సభకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఎమ్మె ల్యేలు.. ప్రస్తావిస్తున్న సమస్యలు కేవలం వారి వారి నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై తామే చర్చకు పెట్టాలని తద్వారా ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని సీఎం చం ద్రబాబు భావించారు. వాస్తవానికి రైతుల సమస్య, మెడికల్ కాలేజీల పీపీపీ విధానం సహా.. ఇతర అంశాలపై బయట మీడియాతో మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. అయితే.. సభలో చెప్పడం ద్వారా మరింతగా ప్రజలకు చేరుతాయని భావించారు. ఈ నేపథ్యంలో ఆయా అంశాలను తామే స్వయంగా లేవనెత్తి సభలో చర్చించాలన్నది చంద్రబాబు వ్యూహం. ఈ విషయంలో పవన్ కల్యాణ్ వాయిస్ మరింతగా ప్రజల్లోకి వెళ్తుందని ఆయన భావించారు.
కానీ, ఈ విషయంలో స్పందించేందుకు పవన్ కల్యాణ్ విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ నేతల అంతర్గత సమాచారం మేరకు.. పీపీపీ, రైతుల సమస్యలు, యూరియా వంటిఅంశాలపై తమకంటే.. కూడా టీడీపీ వారికే అవగాహన ఎక్కువగా ఉంటుందని.. వారికే అవకాశం ఇవ్వాలని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. దీంతో తొలిరోజే ఆయా అంశాలను ప్రస్తావించాలని భావించిన ప్రభుత్వం తర్వాత.. వెనక్కి తగ్గినట్టు తెలిసింది. అయితే.. వచ్చే సోమవారం లేదా.. మరో రోజు ఈ అంశాలను ప్రస్తావించడం ఖాయమని టీడీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎండగడతామన్నారు.