షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సినీఆరంగేట్రం ఇటీవల నిరంతరం వార్తల్లో నిలుస్తున్న అంశం. త్వరలో ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్ తో ఆర్యన్ దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నాడు. ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగుకి రానుంది. ఈ సందర్భంగా ప్రచార వేదికలపై నెట్ ఫ్లిక్స్ సీఈవోతో కలిసి ఆర్యన్ ఖాన్ ప్రచారఫర్వం చర్చగా మారింది.
నెట్‌ఫ్లిక్స్ సహ సీఈవో టెడ్ సరండోస్ తో ఆర్యన్ సెల్ఫీ సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారుతోంది. అయితే ఫోజులు బాగానే ఉన్నాయి కానీ..రిలీజ్ తేదీ ఫిక్స్ చేసారా లేదా? అంటూ ఖాన్ అభిమానులు సీరియస్ గా రిప్లయ్ ఇస్తున్నారు. ఆర్యన్ సినిమాలో నటించిన స్టార్లు అందరితో సరండోస్ ఫోజులిచ్చారని ఇప్పటికే రిలీజైన ఫోటోలు చెబుతున్నాయి.
ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్ ఫిబ్రవరి2025లో అధికారికంగా ప్రారంభమైంది. గౌరీ ఖాన్ సమర్పించిన ఈ సిరీస్‌ను బిలాల్ సిద్ధిఖి – మానవ్ చౌహాన్ కలిసి రూపొందించారు. ఆర్యన్‌తో పాటు ఈ ఇద్దరూ రచయితలుగాను పని చేసారు. ఈ షో ద్వారా బాలీవుడ్ అసలు రంగు బయటపడనుందని గుసగుస వినిపిస్తోంది. దానికి తగ్గట్టే షో శీర్షిక కూడా ఆసక్తిని పెంచుతోంది. “బాలీవుడ్ గ్లామర్ వెనుక సినిమాల మాదిరిగానే నాటకీయ ప్రపంచం ఉంది.. ఆ నాటకీయత ఏమిటనేది తెరపై చూడండి.. నెట్‌ఫ్లిక్స్ సిరీస్, ది BA***DS ఆఫ్ బాలీవుడ్ త్వరలో ప్రారంభమవుతుంది“ అని శీర్షికను ఇచ్చారు. ఈ సిరీస్ లో పలువురు బాలీవుడ్ సూపర్ స్టార్లు అతిథి పాత్రల్లో నటించారు. ఆర్యన్ కోసం ఇండస్ట్రీ ప్రముఖులంతా సహకరించారు. అయితే కంటెంట్, స్క్రీన్ ప్లే, తెరకెక్కించిన విధానం ప్రజలకు కనెక్ట్ చేయడంలో ఆర్యన్ ఏ మేరకు సక్సెసవుతాడో వేచి చూడాలి.