• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

AP Liquor Scam: సిట్‌ ఎదుట హాజరైన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి

AP Liquor Scam: సిట్‌ ఎదుట హాజరైన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి

ఏపీ మద్యం కుంభకోణం కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి సిట్‌ విచారణకు హాజరయ్యారు. వీరిద్దరూ ఈ కేసులో ఏ31, ఏ32 నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మే 16 వరకు తదుపరి చర్యలు చేపట్టవద్దని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని విజయవాడలోని సిట్‌ కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో… నాటి సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్‌ పూర్తికాలపు డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీలను ఇటీవల సిట్‌ నిందితులుగా చేర్చింది. ఈ కేసులో ఏ 33 నిందితుడుగా ఉన్న గోవిందప్ప మంగళవారం అరెస్టయిన విషయం తెలిసిందే. సిట్‌ అధికారులు తాజాగా ఆయన్ను విజయవాడ సీబీఐ కోర్టులో(CBI Court) హాజరుపర్చారు.

ఏపీ మద్యం కేసలో(AP Liquor Scam) 33వ నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీకి విజయవాడ ఏసీబీ కోర్టు ఈనెల 20వరకు రిమాండ్‌ విధించింది. దీంతో గోవిందప్పను అధికారులు విజయవాడ జైలుకు తరలించారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన రూ.వేల కోట్ల ముడుపుల సొత్తును డొల్ల కంపెనీలకు మళ్లించి ‘అంతిమ లబ్ధిదారు’కు చేర్చడంలో క్రియాశీలక పాత్ర పోషించిన భారతి సిమెంట్స్‌ పూర్తికాలపు డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీని సిట్‌ అరెస్టు చేసింది. ఈ కేసులో 33వ నిందితుడి (ఏ33)గా ఉన్న ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్‌(YS Jagan) కు అత్యంత సన్నిహితుడు. జగన్‌ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలన్నీ చూస్తుంటారు. నెల రోజులుగా పరారీలో ఉన్న గోవిందప్ప బాలాజీ కోసం మూడు రాష్ట్రాల్లో గాలించిన సిట్‌ బృందాలు… కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని చామరాజనగర జిల్లా బీఆర్‌హిల్స్‌ అటవీ ప్రాంతంలో ఉన్నారని గుర్తించి అక్కడే మాటు వేశాయి. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఎరకనగడ్డె కాలనీలోని ఓ వెల్‌నెస్‌ సెంటర్‌ బయట ఆయన్ను అదుపులోకి తీసుకున్నాయి.

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ సిండికేట్‌ లో గోవిందప్ప బాలాజీది కీలక పాత్ర అని సిట్ ప్రాధమిక విచారణలో తేలింది. ‘‘కెసిరెడ్డికి గోవిందప్ప అత్యంత సన్నిహితుడు. ప్రధాన బ్రాండ్లు ఆపి అనుకూల బ్రాండ్ల విడుదలలో కీలక పాత్ర పోషించారు. సొంత బ్రాండ్లు మార్కెట్లోకి తీసుకొచ్చి రూ.కోట్లు కొల్లగొట్టారు. సిండికేట్‌లో గోవిందప్పది కీలక పాత్ర అని ఏపీబీసీఎల్‌ అధికారులు సత్యప్రసాద్‌, వాసుదేవరెడ్డి చెప్పారు. డిస్టిలరీలు, సప్లయర్ల కమీషన్లు గోవిందప్పకు చేరాయి. లిక్కర్‌ ద్వారా వచ్చిన మొత్తాన్ని వివిధ రూపాల్లో మళ్లించారు. అక్రమ సొమ్ముతో స్థిరాస్తులు, లగ్జరీ కార్లు కొనుగోలు చేశారు. డబ్బు ఎలా మళ్లించాలో గోవిందప్పకు తెలుసు. ఇలాంటి కేసుల్లో పదేళ్ల వరకు శిక్ష పడుతుంది’’అని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

Tags: #AndhraPradesh#APLiquorScam#DhanunjayaReddy#KrishnaMohanReddy#LiquorScam#PoliticalScam#SITInvestigation
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Hyderabad – Vijayawada : శాటిలైట్ టోల్ ప్రారంభం

Next Post

Aryan Khan:డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి

Related Posts

Andhra Pradesh: ఇదేంది జ‌గ‌న్..!
Andhra Pradesh

Andhra Pradesh: ఇదేంది జ‌గ‌న్..!

Andhra Pradesh: కేబినెట్ లోకి నాగబాబు..?
Andhra Pradesh

Andhra Pradesh: కేబినెట్ లోకి నాగబాబు..?

Virat Kohli:  అక్కడే సెటిల్..?
Big Story

Virat Kohli: అక్కడే సెటిల్..?

PRIYANKA CHOPRA: తీవ్ర విషాదం..!
Entertainment

PRIYANKA CHOPRA: తీవ్ర విషాదం..!

Tirumala: ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్న  రేణిగుంట విమానాశ్రయం
Andhra Pradesh

Tirumala: ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్న రేణిగుంట విమానాశ్రయం

Air India Plain Crash: DNA ద్వారా 184 మృతదేహాల గుర్తింపు..!
Big Story

Air India Plain Crash: DNA ద్వారా 184 మృతదేహాల గుర్తింపు..!

Next Post
Aryan Khan:డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి

Aryan Khan:డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Andhra Pradesh: ఇదేంది జ‌గ‌న్..!

Andhra Pradesh: ఇదేంది జ‌గ‌న్..!

Andhra Pradesh: కేబినెట్ లోకి నాగబాబు..?

Andhra Pradesh: కేబినెట్ లోకి నాగబాబు..?

Virat Kohli:  అక్కడే సెటిల్..?

Virat Kohli: అక్కడే సెటిల్..?

PRIYANKA CHOPRA: తీవ్ర విషాదం..!

PRIYANKA CHOPRA: తీవ్ర విషాదం..!

Recent News

Andhra Pradesh: ఇదేంది జ‌గ‌న్..!

Andhra Pradesh: ఇదేంది జ‌గ‌న్..!

Andhra Pradesh: కేబినెట్ లోకి నాగబాబు..?

Andhra Pradesh: కేబినెట్ లోకి నాగబాబు..?

Virat Kohli:  అక్కడే సెటిల్..?

Virat Kohli: అక్కడే సెటిల్..?

PRIYANKA CHOPRA: తీవ్ర విషాదం..!

PRIYANKA CHOPRA: తీవ్ర విషాదం..!

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info