ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో విద్య సంస్థలకు దసరా సెలవుల జాబితాను విడుదల చేసింది విద్యాశాఖ. ఈ మేరకు ఈ ఏడాది విద్య క్యాలెండర్ ప్రకారం సెలవులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏపీలో విద్యార్థఉలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వరకు దసరా సెలవులు వస్తున్నాయి. అంటే మొత్తం విద్యార్థులకు 9 రోజుల పాటు సెలవులు వస్తున్నాయి.
జూనియర్ కాలేజీలకు, క్రిస్టియన్ మైనార్టీ స్కూల్లకు దసరా సెలవులు చూస్తే..విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు సెలవులు వస్తున్నాయి.
క్రిస్టియన్ మైనార్టీ స్కూల్లకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఇస్తున్నారు. వీరికి మొత్తం 6 రోజులపాటు దసరా సెలవులు ఉన్నాయి.
ఇక దసరా సెలవులు మాత్రమే కాదు..సెప్టెంబర్ 6న మిలాద్ ఉన్ నబీ, సెప్టెంబర్ 7న ఆదివారం, సెప్టెంబర్ 13న రెండో శనివారం, సెప్టెంబర్ 14న ఆదివారం, సెప్టెంబర్ 21న ఆదివారం సెలవు దినాలు ఉన్నాయి.
సెప్టెంబర్ లో దాదాపు రెండు వారాలపాటు సెలవులు..దసరా 9 రోజుల సెలవులకు తోడు ఈ ఐదు రోజులు కలుపుకుంటే విద్యార్థులకు సెప్టెంబర్ లో దాదాపు రెండు వారాలపాటు సెలవులు వస్తున్నాయి. ఆగస్టు నెలలో కూడా విద్యార్థులకు వరుసగా సెలవులు వచ్చాయి.
సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు
ఇక తెలంగాణలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ప్రకటించింది విద్యాశాఖ. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండగల్లో దసరా ఒకటి. తెలంగాణలో ఒకేసారి బతుకమ్మ దసరా పండగలను పురస్కరించుకుని రాష్ట్రంలోని స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. మొత్తం మీద ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు వరుసగా సెలవు మీద సెలవులు వచ్చాయి.