ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రివిలేజెస్ కమిటీ ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. గతంలో ఆయన గుంటూరు అర్బన్ ఎస్పీగా పనిచేసిన సమయంలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్‌ను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ అంశాన్ని ప్రివిలేజెస్ కమిటీ సీరియస్ గా తీసుకుంది.
గత ప్రభుత్వ హయాంలో అమ్మిరెడ్డి గుంటూరు అర్బన్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నారా లోకేష్‌పై సోషల్ మీడియా వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేశారని, అవి ఒక ప్రజాప్రతినిధి గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రివిలేజెస్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఒక బాధ్యతాయుతమైన ఐపీఎస్ హోదాలో ఉండి రాజకీయ పరమైన పోస్టులు పెట్టడం సర్వీస్ రూల్స్‌కు విరుద్ధమని కమిటీ భావిస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి వివరణ ఇచ్చేందుకు మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు మిటీ ఎదుట విచారణకు హాజరుకావాలని అమ్మిరెడ్డిని ఆదేశించింది. అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ హాల్‌లో ఈ విచారణ జరగనుంది.
మండలి సభ్యుల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకునే అధికారం ప్రివిలేజెస్ కమిటీకి ఉంటుంది. అమ్మిరెడ్డి ఇచ్చే వివరణ ఆధారంగా కమిటీ తదుపరి చర్యలను ఖరారు చేయనుంది. అమ్మిరెడ్డి ప్రమోటెడ్ ఐపీఎస్. ఆయన వైసీపీ హయాంలో రెచ్చిపోయారు. వైసీపీ లీడర్ కు ఎక్కువ.. ఐపీఎస్‌కు తక్కువ అన్నట్లుగా విధులు నిర్వర్తించేవారు. ఇది ఒక్కటే ఫిర్యాదు కానీ.. ఆయన చేసిన పనుల్ని టీడీపీ నేతలు మర్చిపోలేరు.
#APLegislature


















