ప్రభుత్వ సేవలకోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా వాటిని ఇంటినుంచే పొందేందుకు రాష్ట్రప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్‌ను తీసుకొచ్చింది. మనమిత్ర పేరిట అమలవుతున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఎక్కడినుంచైనా సేవలు పొందేందుకు, ఫిర్యాదులు చేసేందుకు సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ పౌరసేవలు అందిస్తున్న ప్రభుత్వం వాటిని 700కు పెంచాలని నిర్ణయించింది. ఈనెల 15వ తేదీనుంచి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ సేవలను అందించేలా చర్యలు చేపట్టారు.
ఈ ఏడాది జనవరిలో 26 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 161 సేవలతో ‘మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్’ ప్రారంభం కాగా, సేవలను క్రమంగా పెంచారు. ప్రస్తుతం 500 సేవల దాకా అందుతున్నాయి. వీటిని 15వ తేది నుంచి 700దాకా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాలనలో టెక్నాలజీ వినియోగానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం ‘మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్’ పేరుతో పౌరసేవలు సెల్‌ఫోన్ ద్వారా అందుబా టులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇందులో విద్యార్థులకు పరీక్షల హాల్ టికెట్లు, రేషన్ కార్డుల సేవలు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ స్టేటస్‌లు తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
పౌరులు ఒక్క క్లిక్‌తో లైసెన్సులు, పన్నులు, బిల్లులు చెల్లించవచ్చు. ఆలయాల దర్శనాల బుకింగు, పరీక్షల ఫలితాలు ఇంటివద్దనుంచే తెలుసుకునే అవకాశం కల్పించారు. అన్ని శాఖల డేటాను ఆర్టీజీఎస్ఈ ప్రభుత్వం అనుసందానం చేసింది. ప్రతిఒక్కరి వ్యక్తిగత సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది. దీనిని శాఖలవారీగా మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్‌కు అనుసంధానం చేశారు.
క్యూఆర్ కోడ్‌తో ధ్రువపత్రాలు, ఇతర పౌరసేవలు పొందవచ్చు. భవిష్యత్తులో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా నకిలీ, అసలు గుర్తించే సౌలభ్యం అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ వాట్సాప్ నెంటరు. 9552300009ను మనమిత్ర పేరిట మీ ఫోన్‌లో నమోదుచేసుకోవాలి. ఆ నెంబరుకు హాయ్ అని సందేశం పంపాలి. వెంటనే ఏపీ ప్రభుత్వ లోగోతో ఒక సందేశం వస్తుంది. తద్వారా మీకు కావాల్సిన సేవను ఎంపిక చేసుకోవాలి. వెంటనే మీకు వాట్సాప్ ఏఐ ఆధారిత చాట్ బాక్స్‌లో లభ్యమయ్యే అన్ని ప్రభుత్వ సేవల జాబితా కనిపిస్తుంది. అందులో మీకు కావాల్సిన సేవను ఎంపిక చేసుకోవచ్చు. వాయిస్ కమాండ్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. మీరు కోరుకున్న సేవకు సంబంధించి చాట్ బాక్స్ మరికొన్ని అదనపు వివరాలు అడగవచ్చు. మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబరు, లేదా సర్వీస్ రిక్వెస్ట్ ఐడీ
కలెక్టరేట్లో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ బోర్డు లాంటివి, మీరిచ్చిన వివరాలను ఒక్కసారి తనిఖీ చేసి, తర్వాత అందులో సిస్టమ్ మీకు రియల్ టైం అప్‌డేట్స్ ద్వారా ఒక కన్ఫర్మేషన్ సందేశం పంపుతుంది. చెల్లింపులకోసం భద్రతతో కూడిన ఒక పేమెంట్ లింకును కూడా పంపుతుంది. మీరు జరిపిన లావాదేవీలకు సంబంధించి డిజిటల్ కాపీ లేదా రసీదును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చాట్‌బాక్స్‌లో ధ్రువీకరణ పత్రాలు, రశీదులు లేదా అక్నాలెడ్జ్‌మెంట్ రూపొందించి మీకు అందిస్తుంది.