అమరావతి: ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం
మహిళల ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, నూతన బార్ పాలసీ సహా 12 కీలక నిర్ణయాలు
అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో 12 అంశాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రజా సంక్షేమం, పారిశ్రామిక అభివృద్ధి, చట్టవ్యవస్థ, విద్యుత్, టూరిజం రంగాలలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా మహిళల ప్రయాణాలకు ఉచిత ఆర్టీసీ సౌకర్యం అనేక వర్గాల్లో హర్షం నింపుతోంది.
ఏపీ క్యాబినెట్ సమావేశం – ముఖ్య నిర్ణయాలు
✅ మొత్తం 12 అంశాలపై చర్చ, మంత్రివర్గ ఆమోదం లభించింది.
-
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం.
-
జూలై 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఆమోదం.
-
నూతన బార్ పాలసీకి ఆమోదం.
-
నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ యూనిట్లు 150 నుంచి 200 యూనిట్లకు పెంపు.
-
ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ టెక్ హబ్ పాలసీ 4.0కు ఆమోదం.
-
ఏపీ టూరిజం కార్పొరేషన్ పరిధిలోని 22 APTDC హాస్టళ్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేందుకు అనుమతి.
-
తిరుపతి రూరల్ – పేరూరు గ్రామంలో ఓబరాయ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన TTD భూముల బదలాయింపును రద్దు.
-
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున SBI, UBI బ్యాంకులకు ₹900 కోట్ల గ్యారెంటీ ఇవ్వడంపై ఆమోదం.
-
APIICకి ₹7,500 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి.
-
5 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి ఆమోదం.
-
మావోయిస్టులు, RDF పార్టీపై నిషేధాన్ని మరో ఏడాది పాటు కొనసాగించనున్నారు.
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు సామాన్య ప్రజల అవసరాలను తీర్చడమే కాక, రాష్ట్రాభివృద్ధిలో కీలక మలుపు కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.