అనుష్కను తెలుగు ప్రేక్షకులు ఎంతో అభిమానం గా స్వీటీ అని పిలుచుకుంటారు. నాలుగు పదుల వయసు దాటిన.. ఈ హీరోయిన్ ఇంకా పెళ్లి చేసుకోలేదన్న విషయం తెలిసిందే.ఎన్నో సంవత్సరాలుగా అనుష్క, ప్రభాస్ మధ్య ప్రేమాయణం జరుగుతుందని .. వీరిద్దరే పెళ్లి చేసుకుంటారని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్త గురించి ఇద్దరు కూడా ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు.
ఈ క్రమంలో తాజాగా అనుష్క పెళ్లి గురించి వస్తున్నా.. మరో వార్త అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అదేమిటంటే అనుష్కకి.. ఓ స్టార్ క్రికెటర్‌తో పెళ్లి కుదిరిందట. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్నాయి.ఈ క్రికెటర్ ఎవరు అనేది ఇంకా బయటకి రానప్పటికీ.. రెండు కుటుంబాలు ఈ పెళ్లికి అంగీకరించాయని సమాచారం. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ, ఇండస్ట్రీలో సైతం ఈ వార్తలే వినిపిస్తున్నాయి.
తాజాగా ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ – “నాకు పెళ్లిపై నమ్మకం ఉంది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. పెళ్లిని నేను వ్యతిరేకించను” అని చెప్పారు. మరి అనుష్క నిజంగానే త్వరలో క్రికెటర్ ని పెళ్లి చేసుకోనుందా లేకపోతే ఇవి పుకార్లు మాత్రమేనా తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.