ఎవరి జీవితం ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చెప్పలేం. లైఫ్ లో ఏదీ ప్లాన్ చేసి రాదు అని అంటోంది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. జీవితం ఊహించని మలుపులు తీసుకుంటుందని, అది మనల్ని ఎవరూ ఊహించని ప్రదేశాలకు తీసుకెళుతుందని చెప్పింది. తన కెరీర్ విషయంలో తన ఇమాజినేషన్ కు మించి జరిగిందని ఆమె కొత్త సినిమా బైసన్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ సందర్భంలో తెలిపింది.
అవును, కరక్టే ఆమె విషయంలో అదే జరిగింది. ఒక్కటైనా మంచి సినిమాలో నటించాలని కెరీర్ ప్రారంభించిన ఆమెకు, గడిచిన 10ఏళ్లలో అనేక మంచి క్యారెక్టర్లు పడ్డాయి. ఈ ఒక్క ఏడాదిలోనే అనుపమ కీలక పాత్ర పోషించిన డ్రాగన్, జానకీ వర్సస్ స్టేట్ ఆఫ్ కేరళ, పరదా, కిష్కిందపురి సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఈ నాలుగు సినిమాలు నాలుగు విభిన్న కథలు. నాలుగింట్లో అనుపమ నాలుగు వైవిధ్యమైన రోల్స్ చేసింది.
ఇక ఈ ఏడాది ఆమె ఐదో సినిమా కూడా రానుంది. ఆమె హీరోయిన్ గా- చియన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా నటించిన బైసన్ రేపు థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో సినిమా గురించి పలు విషయాలు అనుపమ షేర్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే విధి గురించి అనుపమ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ సినిమా డైరెక్టర్ మారి సెల్వరాజ్ తో గతంలో పెరియేరుమ్ పేరుమాల్ అనే తమిళ సినిమా మిస్ చేసుకుంది. దీంతో అనుపమ కొన్నేళ్లుగా నిరాశ చెందింది.
ఆయనతో పని చేసే అవకాశం మళ్లీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిందట. అలా కొన్నేళ్లకు మళ్లీ అదే డైరెక్టర్ తో బైసన్ లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. నేను ప్రేమమ్ చేసినప్పుడు, నాకు సినిమా గురించి ఏమీ తెలియదు. ప్రతిదీ కొత్తగా, ఏదో మాయాజాలంగా అనిపించింది. ఇప్పుడు పదేళ్ల తర్వాత, బైసన్ ఫొటో షూట్ సమయంలో నేను మళ్లీ అలాగే ఫీల్ అయ్యాను. అని అనుపమ చెప్పింది. అని తన పదేళ్ల కెరీర్ ను సింపుల్ గా వివరించింది.
కాగా, ఇప్పుడు ఆమె కొత్త సినిమా బైసన్ విడుదలకు రెడీ అయ్యింది. రేపే థియేటర్లలోకి వస్తున్నా.. అనుమలో ఎలాంటి ఆందోళన, భయం కనిపించడం లేదు. ఆమె ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అతిగా ఆలోచించడం లేదు. ఫలితం ఏదైనా స్వీకరించడానికి రెడీ అన్నట్లు కనిపించింది. ఆ క్రంలోనే విధి తనను ఊహకు మించి ఉన్నత శిఖరాల్లోకి తీసుకెళ్లిందని చెప్పింది.