దర్శక నిర్మాతలు కథలు రాసుకునేటప్పుడు ఫలానా పాత్ర కోసం ఫలానా వ్యక్తి అయితే సెట్ అవుతారు అని ముందే ఆలోచించి.. ఆ పాత్రలను తయారు చేస్తారు. అయితే తీరా సినిమాలు తెరకెక్కించాలనుకున్నప్పుడు ఆయా పాత్రలకు సంబంధించిన ప్రముఖులను కలిసి.. వారికి కథ కూడా వినిపిస్తారు. అయితే కథ నచ్చి కొంతమంది ఒకే చెబితే.. మరి కొంతమంది కథ నచ్చక రిజెక్ట్ చేస్తారు. ఇంకొంతమంది కథ నచ్చినా తమకున్న కమిట్మెంట్ వల్ల ఆ పాత్రను వదులుకోవాల్సి వస్తుంది. అలా వదులుకున్న పాత్రలు ఇంకొకరికి చేరి వారికి అదృష్టంగా మారుతూ ఉంటాయి.ఈ క్రమంలోనే ప్రముఖ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ వదులుకున్న ఒక పాత్రను ఏకంగా ఒక యంగ్ బ్యూటీ సొంతం చేసుకొని. ఇప్పుడు వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలోనే ఏకంగా బడా ప్రాజెక్టులో ఈ యంగ్ బ్యూటీకి అవకాశం కల్పించడం వైరల్ గా మారుతోంది.
ఇకపోతే ఈ సినిమా నుంచి కియారా అద్వానీ తప్పుకోవడంతో.. ఇంతకీ కియారా అద్వానీ వదులుకున్న ఆ మూవీ ఏంటి? ఏ పాత్ర కోసం ఆమెను సంప్రదించారు? ఆమె ఎందుకు రిజెక్ట్ చేసింది? మరి ఆమె స్థానాన్ని భర్తీ చేసిన ఆ యంగ్ బ్యూటీ ఎవరు ? ఇలా కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. విషయంలో వెళ్తే.. ప్రముఖ డైరెక్టర్ దినేష్ విజన్ దర్శకత్వం వహిస్తున్న ‘శక్తి శాలిని’ సినిమా కోసం ముందుగా కియారా అద్వానీని సంప్రదించారు. అయితే ఆమె తనకున్న కమిట్మెంట్ కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఆ స్థానంలో ‘సైయారా’ మూవీతో తొలిసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న అనీత్ పడ్డాకు ఈ అవకాశం లభించినట్లు సమాచారం.. ఇకపోతే ఈ సినిమాను నిర్మిస్తున్న మాడాక్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ మాత్రం కాస్టింగ్ మార్పును బహిరంగంగా ఖండించినప్పటికీ ..ఈ ప్రాజెక్ట్ నుంచి కియారా బయటకు వచ్చిందనే వార్తలు మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నాయి.
ఈ సినిమాను 2025 చివరి నాటికి విడుదల చేస్తామని భావించినా.. కొన్ని కారణాలవల్ల వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా నుండి కియారా తప్పుకోవడానికి మరో కారణం కూడా వినిపిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే .. ఈ సినిమా కథ వినిపించినప్పుడు కియారాకు ఇందులో బలమైన పాత్ర ఇస్తామని మేకర్స్ తెలియజేశారట. కానీ ఆ పాత్ర ఇవ్వలేదని అందుకే చర్చల తర్వాత.. కియారా స్నేహపూర్వకంగానే ఈ పాత్ర నుంచి తప్పుకున్నట్లు సమాచారం.
ఈ మేరకు కియారా అద్వానీ సినిమా నుండి తప్పుకోవడంతో ఆ స్థానంలో అనీత్ పడ్డాను తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే ఈ పాత్రపై మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. అటు మాడాక్ ఫిలిమ్స్ కూడా భవిష్యత్తులో కియారాకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా శక్తిశాలిని మూవీ నుంచి కియారా తప్పుకోవడంతోనే అనీత్ పడ్డా భారీ ప్రాజెక్టులో అవకాశాన్ని దక్కించుకుంది. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన రెండవ సినిమాతోనే ఇంత పెద్ద ప్రాజెక్టును దక్కించుకోవడం నిజంగా ప్రశంసనీయమని చెప్పవచ్చు. మరి సైయారా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనీత్ పడ్డా ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.