ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం విషయంలో కొత్త ఆలోచనలు చేస్తోంది. అందులో భాగంగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఏపీలోని అయిదున్నర కోట్ల మంది ప్రజల ఆరోగ్యమే మహా భాగ్యంగా భావిస్తోంది. అదే సమయంలో అనారోగ్యం అన్నదే అసలైన పేదరికం అన్న నిర్వచనంతో ముందుకు సాగుతోంది.
ఏపీలో ప్రజలకు సత్వర ఆరోగ్య సేవలు అందించడం కోసం వినూత్నమైన విధానాలను అనుసరించాలన్నది కూటమి ప్రభుత్వం ఆలోచనగా ఉంది. రోగం రావడం నయం చేయడం కాదు, అసలు రోగమే రాకుండా ముందు జాగ్రత్త పడటం అన్నది కూటమి ప్రభుత్వం హెల్త్ పాలసీలో ఒక కీలక విషయంగా ఉండబోతోంది. ప్రివెంటివ్ మెధడాలజీతో కూటమి ప్రభుత్వం హెల్త్ సర్వీస్ లో కొత్తగా ఆలోచిస్తోంది.
ఇక ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రగతిశీలకంగా ఉన్నాయి. టాటా సంస్థ సహకారంతో డిజిటల్ నెర్వ్ సెంటర్ సంజీవని కేంద్రాలు త్వరలో రాష్ట్రమంతటా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. ఐదున్నర కోట్ల రాష్ట్ర ప్రజల హెల్త్ రికార్డులు ఆన్ లైన్ లో పెడుతున్నామని ఆయన తెలిపారు. అంతే కాదు హెల్త్ విషయంలో ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానం అనుసరించడం ద్వారా ఆరోగ్యాంధ్ర ప్రదేశ్‌కు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఏపీలో నూతనన్గా యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తెస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ రెండున్నర లక్షల రూపాయల ఆరోగ్య భీమా అలాగే ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు విలువైన వైద్య సేవలు ఈ పాలసీ కింద అందిస్తామని ఆయన చెప్పారు. అనారోగ్యమే నిజమైన పేదరికం అని కొత్త నిర్వచనం ఇచ్చిన బాబు అందుకే ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీ తమ ప్రభుత్వం నినాదం అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజారోగ్య సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. ప్రతిష్టాత్మక సంస్థలతో కలిసి పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని పేదలకు సేవ చేసే సంస్థలకు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
ప్రజారోగ్య సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ విషయంలో పేదలకు నిస్వార్థంగా సేవ చేసే సంస్థలకు సహకరిస్తామని అదే సమయంలో వారి భాగస్వామ్యాన్ని కూడా తీసుకుని ఏపీని హెల్తీ స్టేట్ గా తయారు చేస్తామని చెప్పారు. ఇక పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పిన చంద్రబాబు అదే సమయంలో రాష్ట్రంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆరోగ్యాన్ని మించిన సంపద మరొకటి లేదని ఆయన ప్రజలకు సూచించారు. ఆరోగ్యం లేకుండా డబ్బు హోదా, ఆస్తులు బంగ్లా కార్లు వంటివి ఎన్ని ఉన్నా ఉపయోగం ఏమీ లేదని చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే ప్రజారోగ్య సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
















