ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Andhra Pradesh | గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్న మంత్రి నారాయణ మనమడు

Andhra Pradesh | గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్న మంత్రి నారాయణ మనమడు
ADVERTISEMENT

రాష్ట్రాలతో సంబంధం లేకుండా కొందరు రాజకీయ నాయకులు.. కొన్ని ప్రముఖుల కుటుంబాలు తెలుగు ప్రజలకు సుపరిచితం. ఈ కోవలోకే వస్తారు ఏపీ మంత్రి నారాయణ.. ఏపీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. వీరిద్దరికి మనమడైన ఎనిమిదేళ్ల జిష్ణు ఆర్యన్ సాధించిన రికార్డు చూసినప్పుడు పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెత గుర్తుకు రాక మానదు. తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈ చిచ్చరపిడుగు పేరు నమోదైంది. ఇంతకూ ఇతగాడు సాధించిన రికార్డు చూసినప్పుడు.. పిల్లాడి టాలెంట్ కు ఫిదా కావాల్సిందే.

నిమిషం వ్యవధిలో (60 సెకన్లు సుమా) 216 డెసిమల్స్.. గోల్డెన్ రేషియోను నాన్ స్టాప్ గా చెప్పేసిన ఆర్యన్ గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్నాడు. దీన్ని చదివినప్పుడు.. పిల్లాడి తాతల బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో.. చిన్నారిని తక్కువగా అంచనా వేయటం పొరపాటే అవుతుంది. ఎనిమిదేళ్ల చిన్న వయసులో ఇతడు సాధించిన రికార్డు అసాధారణమైనది. ఇంతకూ ఈ పోటీ ఎలా ఉంటుంది? ఆ పిల్లాడు ఎంతటి క్లిష్టమైన అంశాన్ని ఆచీవ్ చేశాడన్నది చూస్తే.. పిల్లాడి బ్రెయిన్ ఎంత షార్ప్ గా ఉంటుందో అర్థమవుతుంది.

గోల్డెన్ రేషియో సుమారు 1.6180339887…. అనేది ఒక ఇరేషనల్ నంబర్. అంటే.. దాని దశాంశాలు ఎప్పటికి ముగియవు. అదే సమయంలో ఈ క్రమ పద్దతిలోనూ రిపీట్ కావు. దీంతో.. ప్రతి అంకెను విడిగా గుర్తుంచుకోవాలి. అలాంటిది 216 అంకెల్ని గుర్తు పెట్టుకోవటం అంటే సామాన్యమైన విషయం కాదు. అందులోనూ నిమిషం వ్యవధిలో అంటే చాలా అంటే చాలా కష్టమైన పని. సాధారణంగా ఒక సగటు స్థాయి వ్యక్తి తన షార్ట్ టర్మ్ మెమరీలో 5 నుంచి 9 అంకెల్ని మాత్రమే గుర్తు పెట్టుకునే వీలుంది.

నారాయణ.. గంటా మనమి విషయానికి వస్తే.. నిమిషం వ్యవధిలో 216 అంకెల్ని పలకటానికి అతడికి ఒక్కో అంకెను చెప్పేందుకు కేవలం 0.27మిల్లీ సెకన్ల సమయమే ఉంటుందన్నది మర్చిపోకూడదు. 216 నంబర్లను మర్చిపోకుండా ఒకేలాంటి ఫ్లోలో పూర్తి చేయటం అసాధారణ మెమరీతోనూ.. అత్యంత కష్టమైన శిక్షణతోనూ సాధ్యమవుతుంది. ఇలాంటి ఫీట్లను మెమరీ అథ్లెట్స్ పూర్తి చేస్తారు. కాకుంటే.. ఎనిమిదేళ్ల వయసులోనే అంటే మాత్రం.. ఈ పిల్లాడు అసాధారణ మెమరీతో పాటు.. అత్యంత చురుకైన పిల్లాడిగా చెప్పాల్సిందే. ఈ తరహా ఫీట్ సాధించాలంటే ఏకాగ్రతతో పాటు.. కఠినమైన ప్రాక్టీస్ తోనే సాధ్యమని చెప్పాలి.

ఇక.. ఈ పిల్లాడి తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాల్సిందే. ఆర్యన్ తండ్రి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కొడుకు. అతడి పేరు రవితేజ. ఇక.. ఆర్యన్ తల్లి మంత్రి నారాయణ కుమార్తె శరణి. ఆర్యన్ తల్లిదండ్రులు ఇద్దరు నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు. చివరగా..మరో ఆసక్తికర అంశాన్ని చెప్పి ముగించాలి. పేరుకు తగ్గట్లు ఉండటం చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఈ మేజిక్ పిల్లాడి పేరుకు అర్థం వెదికితే.. జిష్ణు అంటే విజేత అని అర్థం. ఆర్యన్ అంటే గొప్ప/విద్యావంతుడని అర్థం. చాలా సందర్భాల్లో జిష్ణు అనే పేరున్న అబ్బాయిలు తెలివైనవారిగా.. దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారని చెబుతుంటారు.

Tags: #goldenratio#guinnessworldrecord#jishnuaryan#mathprodigy#TeluguNews#younggenius
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Andhra Pradesh | బయట విమర్శలు… లోపల స్నేహ హస్తాలు!

Next Post

Revanth Reddy | మిరాకిల్ కాదు.. ప్రజల మద్దతే కాంగ్రెస్ శక్తి: సీఎం రేవంత్

Related Posts

“సిద్దిపేటపై వివక్ష లేదు – హరీష్‌కు సీఎం రేవంత్ కౌంటర్”
Latest

“సిద్దిపేటపై వివక్ష లేదు – హరీష్‌కు సీఎం రేవంత్ కౌంటర్”

“భవిష్యత్‌కు బాటలు వేస్తున్న నిర్ణయాలు – ISB వేదికగా చంద్రబాబు విజన్”
Andhra Pradesh

“భవిష్యత్‌కు బాటలు వేస్తున్న నిర్ణయాలు – ISB వేదికగా చంద్రబాబు విజన్”

ShrutiHaasan
Entertainment

ShrutiHaasan:అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ 2026లో శృతి హాసన్ స్టైలిష్ మెరుపులు

TelanganaPolitics
Big Story

TelanganaPolitics:బీఆర్ఎస్-బీజేపీ బంధంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు – ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసులపై కీలక ప్రశ్నలు

GodavariTragedy
Crime

GodavariTragedy:భద్రాచలం సమీపంలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతు – ఉగాది సెలవులు దుర్ఘటనగా మారిన ఘటన

NaraDevaansh
Andhra Pradesh

NaraDevaansh:తిరుమలలో సీఎం చంద్రబాబు కుటుంబ దర్శనం – దేవాన్ష్ జన్మదినం సందర్భంగా అన్నదానం, భక్తి, వినయం ఆకట్టుకున్న సందర్భం

Next Post
Revanth Reddy | మిరాకిల్ కాదు.. ప్రజల మద్దతే కాంగ్రెస్ శక్తి: సీఎం రేవంత్

Revanth Reddy | మిరాకిల్ కాదు.. ప్రజల మద్దతే కాంగ్రెస్ శక్తి: సీఎం రేవంత్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

“సిద్దిపేటపై వివక్ష లేదు – హరీష్‌కు సీఎం రేవంత్ కౌంటర్”

“సిద్దిపేటపై వివక్ష లేదు – హరీష్‌కు సీఎం రేవంత్ కౌంటర్”

“భవిష్యత్‌కు బాటలు వేస్తున్న నిర్ణయాలు – ISB వేదికగా చంద్రబాబు విజన్”

“భవిష్యత్‌కు బాటలు వేస్తున్న నిర్ణయాలు – ISB వేదికగా చంద్రబాబు విజన్”

ShrutiHaasan

ShrutiHaasan:అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ 2026లో శృతి హాసన్ స్టైలిష్ మెరుపులు

TelanganaPolitics

TelanganaPolitics:బీఆర్ఎస్-బీజేపీ బంధంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు – ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసులపై కీలక ప్రశ్నలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info