టాలెంటెడ్ హీరోయిన్ బాలీవుడ్ స్టార్ బ్యూటీ అమీశా పటేల్ కు సంబంధించిన ఆసక్తికరమైన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. బాలీవుడ్ ఛానెల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను నిర్మోహమాటంగా పంచుకుంది. ఈ క్రమంలో తన సెలెబ్రెటీ క్రష్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రముఖ ఇంటర్నేషనల్ స్టార్ హీరో అంటే తనకు చాలా ఇష్టమని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అమీశా పటేల్ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
నార్త్ ఇండియాలో అమీశా పటేల్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లోనూ పనిచేసింది. స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. 25 ఏళ్లుగా అమీశా పటేల్ చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా కనిపిస్తూనే ఉన్నారు. విభిన్న పాత్రలు పోషిస్తూ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంది. దీంతో అమీశా పటేల్ కు సంబంధించిన చిన్న అప్డేట్ అయినా నెట్టింట క్షణాల్లోనే వ్యాప్తి చెందుతుంటుంది.
కాగా, రీసెంట్ ఇంటర్వ్యూలో అమీశా పటేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రముఖ రన్వీర్ అల్లాహాబాదియాస్ పాడ్ కాస్ట్ లో తన సెలెబ్రెటీ క్రష్ గురించి నిర్మోహమాటంగా మాట్లాడింది. ఎలాంటి సంకోచం లేకుండా తనకు హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ పై క్రష్ ఉందని చెప్పుకొచ్చింది. ‘నాకు టామ్ క్రూజ్ అంటే క్రష్ ఉంది. ఒకవేళ మీరు అతనితో పాడ్‌కాస్ట్ చేస్తే దయచేసి నన్ను కూడా ఆ ఎపిసోడ్ కు పిలవండి. నాకు ఆయనంటే చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టం. ఎంతలా అంటే నా పెన్సిల్ బాక్స్‌లో, నా ఫైల్స్ లో అతని ఫోటోనే ఉండేది.
మరొక సీక్రెట్ ఏంటంటే నా గదిలో కూడా ఒక్క టామ్ క్రూజ్ ఫొటోనే ఉంటుంది. . అతను ఎప్పుడూ నాకు క్రష్. నా లైఫ్ లో ఉన్న రూల్స్ అన్నింటినీ పక్కన పెట్టాల్సి వస్తే అది కేవలం టామ్ క్రూజ్ కోసమే చేస్తాను. ఈ విషయాన్ని నేను ఎప్పుడూ ఫన్నీగా చెబుతూనే ఉంటాను. నేను అతని కోసం ఏదైనా చేస్తాను. నేను అతనితో ఒక రాత్రి గడపగలనా అని నన్ను అడిగితే, ఎలాంటి సందేహం లేకుండా అవుననని చెబుతాను. నేను అతనితో వన్ నైట్ స్టాండ్ కు సిద్ధమనే చెబుతాను’ అంటూ అమీశా పటేల్ వ్యాఖ్యానించింది.
ఇక అమీశా పటేల్ కు ప్రస్తుతం 50 ఏళ్లు ఉండటం విశేషం. 1975 జూన్ 9న అమీశా పటేల్ గుజరాతీ కుటుంబంలో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఉన్న మక్కువతో హీరోయిన్ గా మారింది. 2000లో రొమాంటిక్ థ్రిల్లర్ కహో నా ప్యార్ హైతో తొలిసారిగా వెండితెరకు పరిచయం అయ్యింది. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే వస్తోంది. 25 ఏళ్ల కెరీర్ లో అమీశా పటేల్ 40 సినిమాల్లో నటించారు. ఇక టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన బద్రి చిత్రంలో నటించింది. మహేశ్ బాబు సరసన నాని, బాలకృష్ణ సరసన నర్సింహుడు అనే చిత్రాల్లో నటించింది. చివరిగా గదర్ 2లో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది.