టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిత్ర పరిశ్రమలో ఉన్నత స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. సినిమా బిజినెస్ పరంగా ఆయన ఆరితేరి ఉన్నారు. ఆయన అనుభవాన్ని యంగ్ ప్రొడ్యూసర్స్ కు పంచుతూ వారి ఎదుగుదలకు కూడా ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో తన కొడుకులు అల్లు వెంకటేష్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ లను చిత్ర పరిశ్రమలో నిలబెట్టేందుకు కూడా ఎంతో కష్టపడ్డారు. దానికి అనుగుణంగా వారు ముగ్గురు కూడా చిత్ర నిర్మాణ పరిశ్రమలో తమ సత్తాను చాటుతూ వస్తున్నారు.
ఇప్పటికే అల్లు అర్జున్ తెలుగు సినిమాల రేంజ్ ను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప లాంటి ఐకానిక్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇక అల్లు వెంకటేష్ నిర్మాత గా కొనసాగుతున్నారు. మరోవైపు తమ బిజినెస్ లను చూసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇక మిగిలింది అల్లు శిరీష్. అల్లు శిరీష్ కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెండితెరపైకి వస్తూనే ఉన్నారు.
అయితే అల్లు అరవింద్ ఇద్దరు కొడుకులు అల్లు వెంకటేష్, అల్లు అర్జున్ పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో సంతోషంగా ఉంటున్నారు. ఇక వారింట్లో బ్యాచిలర్ గా ఉంది అల్లు శిరీష్ మాత్రమే. ప్రస్తుతం అల్లు శిరీష్ కు 38 ఏళ్లు. అయినప్పటికీ ఇంకా అల్లు శిరీష్ బ్యాచిలర్ లైఫ్ నే లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు శిరీష్ కు పెళ్లి ఎప్పుడు అవుతుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా అల్లు శిరీష్ పెళ్లికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతి త్వరలోనే అల్లు శిరీష్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు అంటూ ఆ వార్తల సారాంశం.
లేటెస్ట్ రిపోర్టు ప్రకారం.. అల్లు శిరీష్ కు తన భాగస్వామి దొరికేసిందని అంటున్నారు. అమ్మాయి రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిందిగా చెబుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ రెడ్డి కమ్యూనిటీ నుంచి స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అల్లు శిరీష్ కూడా ఆ కమ్యూనిటీ అమ్మాయిని ప్రేమించినట్టు తెలుస్తుంది. ఇక వీరి గురించి ఇంట్లో వాళ్లకి కూడా తెలిసిపోయిందని టాక్. ఇరు కుటుంబాలు కూడా వారి వివాహానికి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అల్లు శిరీష్ శుభవార్త చెప్పబోతున్నారని అంటున్నారు.
ఇక అల్లు శిరీష పెళ్లి వార్తలపై ఎలాంటి అధికారిక సమాచారం అయితే అందలేదు. కానీ సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో మాత్రం గట్టిగానే ప్రచారం జరుగుతుంది. దీనిపై మునుమందు అల్లు శిరీష్ అందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కనీసం అల్లు అరవింద్ అయిన ఈ విషయంపై స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి. గతంలోనూ అల్లు శిరీష్ పెళ్లికి సంబంధించి, రిలేషన్ షిప్స్ కు సంబంధించి కొన్ని పుకార్లు వచ్చాయి. కానీ వాటిని ఎప్పటికప్పుడు అల్లు శిరీష్ కొట్టిపారేస్తూనే వచ్చారు. ఈ విషయంలో ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.