ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి పవన్ కల్యాణ్, అకీరా వచ్చారు. రీసెంట్ గానే నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ చనిపోయిన విషయం తెలిసిందే. నేడు ఆమె పెద్దకర్మను నిర్వహించారు. ఇందులో పవన్ కల్యాణ్ తన కొడుకు అకీరా నందన్ తో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, అకీరాను అరవింద్, అల్లు అర్జున్ దగ్గరుండి మర్యాదలు చేశారు. కనకరత్నమ్మ ఫొటోకు పవన్ కల్యాణ్ నివాళి అర్పించారు. అతని వెంట అకీరా కూడా నివాళి అర్పించాడు. అనంతరం కాసేపు కలిసి మాట్లాడుకున్నారు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ స్పెషల్ గా కాసేపు మాట్లాడుకున్నారు. అటు మెగా బ్రదర్ నాగబాబు కూడా ఫ్యామిలీతో కలిసి వచ్చాడు.
నాగబాబు దంపతులు కనకరత్నమ్మకు నివాళి అర్పించారు. మరికొద్ది సేపట్లో చిరంజీవి, రామ్ చరణ్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పది రోజుల క్రితం ఆమె అనారోగ్య కారణాలతో చనిపోయిన విషయం తెలిసిందే. చిరంజీవి, అల్లు అర్జున్ కలిసి ఆమె పాడె మోసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చిరంజీవి అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. పవన్ కల్యాణ్ తర్వాత రోజు వచ్చి అరవింద్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇప్పుడు పెద్ద కర్మకు మెగా కుటుంబంతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు వచ్చి ఆమె చిత్రపటానికి నివాళి అర్పిస్తున్నారు. ఈ ఏర్పాట్లను చిరంజీవి భార్య సురేఖ, అరవింద్ దగ్గరుండి చూసుకుంటున్నారు.