సెట్స్ మీద ఉన్న స్టార్ సినిమాల హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. ఐతే కొంతమంది సినిమా గురించి నిత్యం ఆడియన్స్ లో ఏదో ఒక టాపిక్ ట్రెండింగ్ లో ఉండాలని అలా లీక్స్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. మరికొందరు మాత్రం తాము డిసైడ్ చేసిన టైంలో ప్రమోషన్స్ చేస్తూ సోషల్ మీడియా షేక్ చేస్తారు. స్టార్ హీరోల ఫ్యాన్స్ మాత్రం ఆ హీరో సినిమా అప్డేట్స్ రోజు ఇచ్చినా కూడా సర్ ప్రైజ్ అవుతుంటాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాల అప్డేట్స్ హడావిడి మొదలైంది.
ఓ పక్క ప్రభాస్ తో సందీప్ వంగ చేస్తున్న స్పిరిట్ వాయిస్ నోట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు. ఇక గ్లోబ్ త్రొట్టర్ మూవీ ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమా నవంబర్ బ్లాస్ట్ కి సిద్ధమైంది. మరోపక్క చరన్ పెద్ది నుంచి సాంగ్ వచ్చి చార్ట్ బస్టర్ అయ్యింది. ఇకా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న స్టార్స్ తమ సినిమాల అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు. ఐతే ఈ టైం లో పుష్ప రాజ్ అదే మన అల్లు అర్జున్ ఎందుకో సైలెంట్ గా ఉన్నాడు.
అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా అట్లీ డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా అనౌన్స్ మెంట్ తోనే వావ్ అనిపించారు. ఐతే సినిమా ఓ పక్క షూటింగ్ జరుపుకుంటున్నా కూడా సినిమా గురించి ఎక్కడ ఏ లీక్ రాలేదు. సినిమాలో హీరోయిన్ గా దీపిక పదుకొనె ని అనౌన్స్ చేస్తూ చివరగా ఒక వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఆ తర్వాత సైలెంట్ గా షూటింగ్ చేస్తున్నారు.
ఐతే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలన్నీ తమ అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి కాబట్టి అల్లు అర్జున్ అట్లీ సినిమా నుంచి కూడా ఏదైనా అప్డేట్ ఇస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. పుష్ప 1 అండ్ 2 సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు అల్లు అర్జున్. ఈసారి దాన్ని మరింత పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు.
అల్లు అర్జున్ అట్లీ సినిమా నుంచి ఒక గ్లింప్స్ అయినా రిలీజ్ చేస్తే బాగుంటుందని అల్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు. అట్లీ ఈ సినిమా కోసం హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నాడట. సినిమా తప్పకుండా ఇండియన్ సినిమాల్లో ప్రత్యేకమైన బొమ్మగా ఉంటుందని అంటున్నారు. మరి ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల అప్డేట్స్ వస్తున్న ఈ టైం లో అల్లు అర్జున్ కూడా తన సినిమా నుంచి ఏదైనా అప్డేట్ ఇస్తే ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతారని చెప్పొచ్చు.


















