అల్లు అర్జున్ తో తీస్తున్న సినిమాపై డైరెక్టర్ అట్లీ చాలా కేర్ తీసుకుంటున్నారు. ప్రతీ చిన్న విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి. ఒక్కోక్కరిపై సీన్స్ కూడా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే మెయిన్ ఫీమేల్ లీడ్ దీపికా పదుకొణె క్యారెక్టర్ పై హింట్ ఇచ్చేలా ఓ వీడియో సైతం వదిలారు. సినిమాలో దీపికతో సహా మరో ఇద్దరు హీరోయిన్లను పెట్టారు దర్శుకుడు అట్లీ.
హీరోగా బన్నీకి ఉన్న ఫేమ్ సరిపోతుంది. పుష్పతో మార్కెట్ పెరగడంతో బన్నీకి అపోజిట్ క్యారెక్టర్ కూడా పెద్ద స్టార్ ఉండనవసరం లేదు. ఇక ముగ్గురు హీరోయిన్లతో సినిమాను కాస్త కలరింగ్ టచ్ ఇస్తున్నారు. అయితే సినిమాకు వీటి తర్వాత అత్యంత ముఖ్యమైంది మాత్రం సంగీతమే. తమిళ్ లో ఏదైనా పెద్ద సినిమా ఉందంటే మేకర్స్ తొలి చూపు అనిరుధ్ రవిచంద్రన్ వైపే ఉంటుంది. కానీ, ఈ ప్రాజెక్ట్ కు అట్లీ మాత్రం అనిరుధ్ ను కాదని యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. ఈ ఎంపిక సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
అయితే తాజాగా సాయి మూవీటీమ్ తో చేరడట. ఆయన మ్యూజిక్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. కానీ ఇక్కడ అందరి సందేహం ఒక్కటే. అట్లీ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ను సాయి హ్యాండిల్ చేయగలడా? బన్ని సినిమా అంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మినిమమ్ ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తారు. సినిమాలో ఎక్కడైనా స్టోరీ స్లో అయినా.. బీజీఎమ్ సినిమాను నిలబెడుతుంది. మరి అంతటి హెవీ బాధ్యతలు సాయి ఫుల్ ఫిల్ చేయగలడా అని ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, సాయి అభ్యంకర్ సంగీతం అందించిన తొలి సినిమా డ్యూడ్ రీసెంట్ గా రిలీజైంది. అయితే ఇందులో పాటలు రిలీజైన కొత్తగా మిశ్రమ స్పందనలు వచ్చాయి. కానీ వింటూ ఉంటే ఒక్కొక్కటి మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అంటే సాయి మ్యూజిక్ స్లో బర్న్ వెర్షన్ పాటలన్న మాట! అయితే బన్నీకి ఇలాంటివి సూట్ అవ్వవు. ఆయనకు పాప్ సాంగ్స్ వర్కౌట్ అవుతాయి.
మరి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ కు ఫ్రెష్ సంగీతం అందిస్తాడా అనేది ఆసక్తిగా ఉంది. కానీ, అతడి ఔట్ పుట్ అనేది పూర్తిగా అట్లీపైనే డిపెండ్ అయి ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఎలాంటి ఔట్ పుట్ రాబట్టుకోవాలనేది కంప్లీట్ గా డైరెక్టర్ పై డిపెండ్ ఉంటుంది. చూడాలి మరి ఈ యంగ్ టాలెంటెడ్ నుంచి ఎలాంటి మ్యూజిక్ రాబట్టుతారో! అటు సన్ పిక్చర్స్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తుందని టాక్. బడ్జెట్ విషయంలో అట్లీకి ఫుల్ హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం! ఇంతటి అంచనాలు ఉన్న ఈ ప్రాజెక్ట్ ను అట్లీ ఎలా తీర్చి దిద్దుతారో చూడాలి.


















