డైరెక్టర్ సినిమా కథ చెప్పినప్పుడే అది హిట్ అవుతుందా లేదా ఫట్ అవుతుందా అనేది హీరోలు, నిర్మాతలు గెస్ చేయగలరు. అలా డౌట్ అనిపించిన కొన్ని సినిమాలను హీరోలు, నిర్మాతలు సున్నితంగా తిరస్కరిస్తారు. కానీ ఇంకొన్ని మాత్రం అలా అనిపించినప్పటికీ.. సెట్స్ పైకి వెళ్తాయి. తీర థియేటర్లలో బొమ్మ పడితే అది ఫట్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అలా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు ఓ సినిమాలో భారీ నష్టం జరిగిందని మీకు తెలుసా? అది కూడా ఆయన కొడుకు అల్లు అర్జున్ వల్లేనట. దీని గురించి ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా తెలిపారు. మరి ఏ సినిమా? అరవింద్ ఎలా లాస్ అయ్యారో తెలుసుకుందాం!
అల్లు అర్జున్ ఆర్య నుంచి పుష్ప వరకు కెరీర్ జర్నీలో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. సుదీర్ఘ కెరీర్ లో అనేక పాత్రలు చేశారు. అందులో విభిన్నంగా ట్రై చేసిందే బద్రినాథ్ సినిమా. ప్రముఖ డైరెక్టర్ వివి వినాయర్ తెరకెక్కించారు. తమన్నా హీరోయిన్ గా నటించింది. 2011లో రిలీజైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేదు. అయితే ఈ సినిమా కథను మొదట అల్లు అరవింద్ రిజెక్ట్ చేశారట. ఎక్కడో తేడా కొడుతుందని తొలి నుంచీ భావించారట.
కానీ బన్నీ మాత్రం ఎందుకో కథను నమ్మాడు. ఇందులో యాక్షన్ సీన్స్ భారీగా ఉండడంతో చేయాలని భావించారు. అంతే ఇక.. తండ్రి అరవింద్ ను ఒప్పించి మరీ బద్రినాథ్ సినిమా చేశారు. దీనికి అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అయ్యిందట. అప్పుడు బన్నీ మార్కెట్ ఈ సినిమా బడ్జెట్ కంటే చాలా తక్కువగా ఉండడంతో అరవింద్ డౌట్ గానే సినిమా నిర్మించారు. రిలీజ్ తర్వాత ఆయన అనుకున్నట్లే సినిమా ఫట్ అయ్యింది.
హై క్లాస్ విజువల్స్, ఔట్ డోర్ లో భారీ సెట్టింగులు, స్టార్ కాస్టింగ్ ఉండడంతో సినిమాకు బడ్జెట్ బాగానే అయ్యింది. దీంతో బద్రినాథ్ సినిమాతో సుమారు రూ.40 కోట్ల దాకా నష్టం వచ్చినట్లు అరవింద్ చెప్పారు. ఇది ఆయనకు తగిలిన అతి పెద్ద దెబ్బ అని, ఈ అనుభవంతో కొన్ని రోజులపాటు భారీ బడ్జెట్ సినిమాల జోలికి వెళ్లలేదని అన్నారు. అయితే సినిమా కెరీర్ లో ఇలాంటివి అప్పుడప్పుడు మంచే చేస్తాయని, మరోసారి ఇలాంటి జరగకుండా జాగ్రత్తగా ఉండేందుకు ఉపయోగపడుతుందని అరవింద్ అన్నారు.