ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి సాలిడ్ కమర్షియల్ హిట్ లేకున్నా, మంచి బ్రేక్ పడకున్నా జాన్వీ కపూర్ వరుస సినిమా ఆఫర్లను దక్కించుకోవడంకు కారణం ఆమె అందం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండస్ట్రీలో ఆమె అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటుంది అనే పేరు ఉంది. కానీ హిట్ లేక పోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో విడుదల కాబోతున్న పరమ్ సుందరి సినిమాతో జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో మొదటి కమర్షియల్ బ్రేక్ ను దక్కించుకోబోతుంది అనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అందాల జాన్వీ కపూర్ రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా స్టార్ హీరోయిన్స్ కి తగ్గకుండా మంచి క్రేజ్ ను దక్కించుకుంటూ ఉంది. అందుకే జాన్వీ కపూర్ ఎప్పుడు ఫోటోలు షేర్ చేసినా వైరల్ అవుతూ ఉంటాయి.
ఇటీవలే జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన పరమ్ సుందరి సినిమా నుంచి భీగీ సారి రెయిన్ సాంగ్ వచ్చింది. ఆ పాటకు మంచి రెస్పాన్స్ దక్కింది. జాన్వీ కపూర్ ను మరింత అందంగా ఆపాటలో చూశాం అంటూ అభిమానులు, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ పాటలో చీర కట్టుతో జాన్వీ కపూర్ చూపు తిప్పనివ్వలేదు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అనే విషయం మరోసారి నిరూపితం అయింది. మోడ్రన్ డ్రెస్‌ల్లోనే కాకుండా అందమైన చీర కట్టులోనూ జాన్వీ కపూర్ చాలా బాగుంటుందని, తడిచిన చీర అందాల్లో ఇంకాస్త ఎక్కువ అందంగానే జాన్వీ కపూర్ ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ చీర కట్టు మర్చి పోకుండానే ఈసారి పూల చీరలో జాన్వీ కపూర్ కనిపించింది.
ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ కలిగిన జాన్వీ కపూర్ ఏ ఔట్ ఫిట్‌లో అయినా ఇట్టే ఒదిగి పోతుంది. అందుకే జాన్వీ కపూర్‌ను ఇలా చీర కట్టులో చూస్తే చాలా బాగుందని నెటిజన్స్ అంటున్నారు. భీగీ సారి లో చూసిన ప్రేక్షకులు ఇప్పుడు ఈ పూల చీరలో చూడండి అన్నట్లుగా జాన్వీ కపూర్ ఈ ఫోటోలను షేర్ చేసింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి చీర కట్టు కావడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పటి లాగే జాన్వీ కపూర్ అందాల ఆరబోత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈసారి పరమ్ సుందరి సినిమా కి మరింత ప్రమోషన్ దక్కే విధంగా ఈ ఫోటోలు ఉన్నాయని అంటున్నారు. జాన్వీ కపూర్ ఈ చీర కట్టులో నెవ్వర్ బిఫోర్ అన్నట్లుగా ఉందని కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్టు 29న విడుదల కాబోతున్న పరమ్ సుందరి సినిమాతో జాన్వీ కపూర్ కమర్షియల్ హిట్ కొట్టేనా అనేది తెలియాలంటే మరో రెండు వారాలు వెయిట్ చేయాల్సిందే. ఇక తెలుగులో దేవర సినిమాతో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ వచ్చే ఏడాది రామ్ చరణ్ తో కలిసి ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమాకు గాను ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇవ్వన్నీ కారణాల వల్ల సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు. పరమ్ సుందరి సినిమాతో పాటు పెద్ది సినిమా సైతం బాక్సాఫీస్ ను షేక్ చేసే విధంగా హిట్ అందుకుంటే జాన్వీ కపూర్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాదని పలువురు అంటున్నారు.