ఇటీవలి కాలంలో గ్లామర్ రంగంలో తెలుగమ్మాయిలకు చెప్పుకోదగ్గ అవకాశాలొస్తున్నాయనే చెప్పాలి. ప్రతిభతో పాటు దూసుకుపోయే తత్వం ఉంటే చాలు భాషతో సంబంధం లేకుండా ఛాన్సులిస్తున్నారు. నయనతార, దీపిక పదుకొనే, ఆలియా రేంజులో స్టార్లు కాలేకపోయినా కానీ, తమకంటూ ఒక స్థాయి ఉందని తెలుగమ్మాయిలు నిరూపిస్తున్నారు. శ్రీలీల, డింపుల్ హయాథీ, ప్రియాంక జవాల్కర్, రక్షిత ఇంకా చాలా మంది కథానాయికలుగా రాణిస్తున్నారు.
తెలంగాణకు చెందిన అనన్య నాగళ్ల తనదైన అందం ప్రతిభతో ఇటీవల తెలుగు సినీపరిశ్రమలో తనని తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది. స్టార్ రేంజ్ అవకాశాలు లేకపోయినా, తన రేంజుకు తగ్గ పాత్రల్లో అవకాశాల్ని అందుకుంటోంది. ముఖ్యంగా అనన్య చుట్టూ పాజిటివ్ వైబ్స్ తనకు పరిశ్రమలో గుర్తింపును తెచ్చాయి. గత ఏడాది పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ లాంటి సినిమాలతో అభిమానుల ముందుకు వచ్చింది. ఈ ఏడాది తన తదుపరి సినిమా గురించి ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇటీవల సీఎం రేవంత్ చేతులమీదుగా ప్రతిష్టాత్మక గద్దర్ తెలంగాణ స్పెషల్ జూరీ పురస్కారాల్ని కూడా అందుకుంది.
ఇక అనన్య నాగళ్ల తన సోషల్ మీడియా ప్యాన్స్ కు నిరంతరం టచ్ లో ఉంటోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్, అప్ డేట్స్ ని, లైఫ్ లో ముఖ్యమైన విషయాలను, కొన్ని అందమైన ఫోటోషూట్లను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా అనన్య అందమైన శారీ లుక్ లో కనిపించిన ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. అనన్య పాక్షికంగా తన అందాల్ని ఆవిష్కరించే క్రీమ్ కలర్ శారీ, అందమైన డిజైనర్ బ్లౌజ్ లో ప్రత్యక్షమైంది. ఇక ఈ ఫోటోషూట్ లో అనన్యలోని ఇన్నర్ అందాలను ఆవిష్కరించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. మునుపటితో పోలిస్తే, ఇటీవల అనన్య ఘాటైన ఫోటోషూట్లతో పరిశ్రమను ఆకర్షిస్తోందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ తెలుగమ్మాయి ప్రయత్నానికి మెచ్చి దర్శకనిర్మాతలు అవకాశాలు కల్పించాలని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు.
`పింక్` రీమేక్ వకీల్ సాబ్ లో అనన్య నాగళ్ల నటనకు మంచి పేరొచ్చింది. పవన్ కల్యాణ్ లాంటి స్టార్ సినిమాలో ఆరంభ రోజుల్లోనే ఈ భామ అవకాశం అందుకుని అందరినీ ఆకర్సించింది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలొచ్చాయి. ప్రస్తుతం కొంత గ్యాప్ వచ్చినా కానీ, తిరిగి కరీర్ పరంగా పుంజుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
💕@AnanyaNagalla
's Latest photoshoot 📷 #AnanyaNagalla pic.twitter.com/8Oawa4melP— news7telugu (@news7telug2024) August 17, 2025