అమెరికాలో వైట్‌హౌస్ దగ్గర కాల్పులు.. నేషనల్ గార్డ్స్పై కాల్పులు జరిపిన దుండగుడు.. ఇద్దరు నేషనల్ గార్డ్స్ మృతి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు.. నిందితుడికి కూడా బుల్లెట్ గాయాలైనట్లు సమాచారం.. కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్.. కాల్పులు జరిపిన మృగాన్ని వదిలేది లేదన్న ట్రంప్.. మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ట్రంప్ వార్నింగ్..
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో, అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు సమీపంలో కాల్పులు చోటుచేసుకున్న ఘటన ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఇందులో భాగంగా… ఇద్దరు నేషనల్ గార్డ్స్ పై దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. ఈ సందర్భంగా స్పందించిన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్… దీన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణిస్తూ.. మాజీ ప్రెసిడెంట్ బైడెన్ ను నిందించారు. అవును… వాషింగ్టన్ డీసీలో ఇద్దరు నేషనల్ గార్డ్స్ పై కాల్పులు జరపడాన్ని ఉగ్రవాద చర్యగా, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరంగ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించారు. ఈ సందర్భంగా.. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ను నిందించారు. నిందితుడు 2021 ఎయిర్ లిఫ్ట్ లో ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికాకు వచ్చాడని అన్నారు. ఆ దేశాన్ని నరకంతో పోల్చారు.
ఇదే సమయంలో… సెప్టెంబర్ 2021లో బైడెన్ పరిపాలన విమానంలో అతడిని తీసుకొచ్చిందని.. బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన పరిపాలన ఆఫ్గనిస్థాన్ నుంచి మన దేశంలోకి ప్రవేశించిన ప్రతీ గ్రహాంతరవాసినీ తిరిగి పరీక్షించేలా చేస్తుందని అన్నారు. మన దేశాన్ని ప్రేమించని, ప్రయోజనం చేకూర్చని వలస వచ్చిన వారిని తొలగించాల్సిన అవసరం ఉందని తెలిపారు!
బుధవారం మధ్యాహ్నం అమెరికా రాజధానిలో మొహరించిన ఇద్దరు వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్స్ పై వైట్ హౌస్ కు కొద్ది దూరంలోనే కాల్పులు జరగగా.. దీన్ని మేయర్ లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిగా అభివర్ణిస్తున్నారు. ఈ సందర్భంగా.. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు సైనికుల పరిస్థితి విషమంగా ఉందని ఎఫ్.బీ.ఐ. డైరెక్టర్ కాష్ పటేల్, వాషింగ్టన్ మేయర్ మురియెల్ బౌసర్ తెలిపారు.
వైట్ హౌస్ కు కొద్ది దూరంలో ఇద్దరు నేషనల్ గార్డ్స్ పై కాల్పులు జరిపిన వ్యక్తి ఆఫ్ఘాన్ జాతీయుడని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అతని గుర్తింపును మరింత ధృవీకరించాల్సి ఉందని అనారు. ఇతడు గార్డ్స్ పై ఒంటరిగానే కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. అనంతరం ఇతనిపైనా కాల్పులు జరిపిన అధికారులు.. అనంతరం అబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని 2021లో అమెరికాలోకి ప్రవేశించిన 29 ఏళ్ల ఆఫ్ఘాన్ జాతీయుడు రహ్మనుల్ల లకన్వాల్ గా అధికారులు గుర్తించారు. అతడు ఒంటరిగానే ఈ పనికి పూనుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. 2021లో యూ.ఎస్.ఐ.సీ… ఆఫ్ఘాన్ జాతీయులకు ఆశ్రయం కోసం దరఖాస్తులను వేగవంతం చేసిన “ఆపరేషన్ అలైస్ వెల్ కమ్” కింద ఇతడు అమెరికాకు వచ్చి బెల్లింగ్ హోమ్మ్ లో పునరావాసం పొందాడు.


















