భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా దీపిక చిద్విలాసానికి లోటేమీ లేదు. ఆస్తి ఐశ్వర్యంలో దేశంలో టాప్ 10 కథానాయికల జాబితాలో దీపిక పేరు ఉంది. ముంబైలో అత్యంత భారీ భవనం, ఖరీదైన ఏరియాల్లో అపార్ట్ మెంట్లు, లగ్జరీ కార్లు, మెట్రో నగరాల్లో సొంత స్థలాలు, కమర్షియల్ స్సేసెస్ సహా అనేక విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. 2022లో ఒక బ్రాండ్‌ను కూడా ప్రారంభించి ఎంటర్ ప్రెన్యూర్ గా మారింది. ఈ వ్యాపారం ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఒక్కో సినిమాకి 15-20 కోట్ల మధ్య పారితోషికం అందుకుంటున్న దీపిక పదుకొనే, ఇటీవలే ప్రభాస్- సందీప్ వంగాల స్పిరిట్ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దర్శకుడితో విభేధాల గురించి తెలిసినదే.
ఇదిలా ఉంటే, పరిశ్రమ అగ్ర కథానాయిక దీపికా పదుకొనే నికర ఆస్తుల విలువ ఎంత ఉంటుంది? అంటూ అభిమానులు ఆరాలు తీస్తున్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. దీపిక నికర ఆస్తి రూ. 500 కోట్లుగా ఉందని సమాచారం. వెటరన్ నటి జూహి చావ్లా రూ. 4,600 కోట్లు, ఐశ్వర్య రాయ్ బచ్చన్ రూ. 900 కోట్లు, ప్రియాంక చోప్రా రూ. 650 కోట్లు, కరీనా కపూర్ ఖాన్ రూ. 550 కోట్లు, అలియా భట్ రూ. 550 కోట్ల ఆస్తులతో మొదటి 5 స్థానాల్లో ఉండగా, భారతదేశంలో ఆస్తి అంతస్తుల్లో ఆరో కథానాయికగా దీపిక పేరు వినిపిస్తోంది. దీపికా పదుకొనే ఆదాయ వనరుల వివరాల్లోకి వెళితే.. దీపిక సినిమాలతో సంపాదించడమే గాక, బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ కూడా భారీగా ఆర్జిస్తోంది. లూయిస్ విట్టన్, లెవీస్, జియో, పెప్సి, అడిడాస్, యాక్సిస్ బ్యాంక్, ఒప్పో, విస్తారా, చోపార్డ్ వంటి బ్రాండ్లను ఎండార్స్ చేస్తోంది. దీపిక తన వ్యాపార భాగస్వామి జిగర్ షాతో కలిసి 2022లో 82°E పేరుతో సొంత వ్యాపార బ్రాండ్ ని ప్రారంభించింది.
దీపిక ఇటీవల తన భర్త రణ్ వీర్ తో కలిసి బాంద్రాలో డ్రీమ్ హౌస్ ని నిర్మించుకుంది. ఈ ఇంటి కోసం రూ.119 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ ఇల్లు షారుఖ్ ఖాన్ `మన్నత్` పక్కన ఉన్న 11,266 చదరపు అడుగుల క్వాడ్రప్లెక్స్లో నిర్మించారు. 2013లో దీపిక రూ. 16 కోట్ల విలువైన విలాసవంతమైన ఇంటిని తన భర్తతో కలిసి కొనుగోలు చేసింది. వర్లిలోని బ్యూమోండే టవర్స్‌లో 5-బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌ను సొంతం చేసుకున్నారు. దీని ధర రూ.40 కోట్లు. అంతేకాకుండా అలీబాగ్‌లో దాదాపు రూ.22 కోట్ల ఖరీదు చేసే బంగ్లా వీరి సొంతం.
దీపిక గ్యారేజీలో ఖరీదైన కార్లు ఉన్నాయి. రేంజ్ రోవర్, మెర్సిడెస్-బెంజ్ బెంజ్, బీఎండబ్ల్యూ వంటి టాప్ బ్రాండ్స్ కార్లను కొనుగోలు చేసింది. కుమార్తె దువా పుట్టిన తర్వాత దీపిక పూర్తిగా విరామంలో ఉంది. సినిమాల విషయానికి వస్తే, తదుపరి అమితాబ్ తో `ది ఇంటర్న్`లో ప్రధాన పాత్ర పోషించనుంది. 2015లో అదే పేరుతో వచ్చిన హాలీవుడ్ సినిమా హిందీ రీమేక్. దర్శకుడితో విభేధాల కారణంగా, ప్రభాస్ స్పిరిట్ లో అవకాశాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే.