ఏపీకి నాలుగవ సారి సీఎంగా చంద్రబాబు ప్రస్తుతం ఉన్నారు. ఎపుడో ముప్పయ్యేళ్ళ క్రిందట చంద్రబాబు సీఎంగా తొలిసారి ప్రమాణం చేశారు. మళ్ళీ ఇన్ని దశాబ్దాల తరువాత అదే పదవిలో ఉంటూ తన ముప్పై వసంతాల జీవితాన్ని తలచుకోవడం అంటే అది ఏ కొందరికో కానీ సాధ్యం కాదు ఆ ఘనతను చంద్రబాబు అయితే సాధించారు. ఇదిలా ఉంటే బాబు తన విజయ రహస్యం అయితే ఎవరికీ పెద్దగా చెప్పిన దాఖలాలు లేవు.
అయితే తన ముఖ్యమంత్రిత్వంలో మూడు దశాబ్దలా వేడుకను జరుగుపుకుంటున్న వేళ బాబు తొలిసారి ఓపెన్ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు అధికార నివాసంలో అధికారులు ప్రజా ప్రతినిధులతో కూడిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు ఈ సందర్భంగా అనేకమైన ఆసక్తికరమైన విషయాలను ఆయన పంచుకున్నారు. ప్రతి నిత్యం కొత్తగా ఆలోచనలు వస్తాయని అదే నా సక్సెస్ ఫార్ములా అని బాబు చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే తనకు ఎపుడు అధిక ప్రాధాన్యత శాంతి భద్రతలు అని చంద్రబాబు చెప్పారు. తాను సీఎం గా ఉన్నపుడు ఎప్పుడు దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో హైదరాబాద్ లో మత కలహాలు అయినా తెలంగాణాలో నక్సల్స్ సమస్యలు అయినా రాయలసీమలో ఫ్రాక్షన్ సమస్య అయినా తాను పట్టుదలగా తీసుకుని పనిచేసి అవి లేకుండా చూశాను అని చెప్పారు.
తాను ఎపుడూ గతాన్ని గుర్తు పెట్టుకుంటాను అని భవిష్యత్తుకి ఆ విధంగా ప్రణాళికలు వేసుకుంటాను అని చంద్రబాబు చెప్పారు. అంతే కాదు గతంలో సక్సెస్ అయిన పాలసీలను స్టడీ చేయాలని సూచించారు అధికారులైనా, ప్రజా ప్రతినిధులు అయినా ఒక తపనతో పని చేస్తేనే ఫలితాలు వస్తాయని బాబు పేర్కొన్నారు. అంతే కాదు ఎప్పటికప్పుడు మారుతున్న తరాలకు అనుగుణంగా కొత్తగా ఆలోచిస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన చెప్పారు. అదే తన రాజకీయ జీవితంలో విధానంగా పెట్టుకున్నానని అదే తన విజయ రహస్యమని బాబు వివరించారు.
ఇక తాను సంస్కరణలను ఇష్టంగా చేశాను అన్నారు. వాటి వల్ల సమాజానికి మేలు జరుగుతుందని అనుకున్నపుడు కొందరు వ్యతిరేకించినా మొండిగా వెళ్లాను అన్నారు. రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా ప్రజలకు మేలు జరుగుతుందని ఆలోచించే అలా చేశాను అని అన్నారు. అలా సంస్కరణలను అమలు చేస్తున్నపుడు కొన్ని సందర్భాలలో కొన్ని నిర్ణయాలను ఉద్యోగ, కార్మిక సంఘాలు వ్యతిరేకించేవని ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే ప్రజలకు మంచి జరుగుతుందనుకుంటే భయపడేవాడిని కాదని ఆయన చెప్పారు.
తాను ఎపుడూ వినూత్నంగా ఆలోచనలు చేశాను కొత్తదనం కోసం తపన పడ్డాను అని బాబు చెప్పారు. రోటీన్ కి భిన్నంగా పని చేస్తేనే ఫలితాలు వస్తాయని చంద్రబాబు చెప్పారు. తన ఆలోచనలే జాతీయ స్థాయి పాలసీలో ఎన్నో సార్లు పంచుకోవడం గర్వకారణంగా ఉంటుందని చంద్రబాబు చెప్పారు. మొత్తం మీద చంద్రబాబు తన మూడు దశాబ్దాల నాటి ముఖ్యమంత్రిత్వాన్ని తన అనుభవాలను అధికారులకు ప్రజా ప్రతినిధులకు వివరిస్తూంటే వారంతా ఎంతో ఆసక్తిగా వినడం జరిగింది. బాబు రోల్ మోడల్ అని టీడీపీ నాయకులు కొనియాడుతారు. అయితే ఇంతటి సుదీర్ఘమైన అనుభవం ఉన్న సీఎం తో పనిచేయడం తమ లక్ అని అధికారులు కూడా అనుకోవడమే బాబు గొప్పతనం అంటారు.