తెలుగుజాతి ముద్దుబిడ్డ, దేశం గర్వించదగ్గ నాయకుడిగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన నేతగా నిలిచారు.40 ఏళ్లకు పైగా కొనసాగుతున్న తన రాజకీయ ప్రస్థానంలో ఆయన అనేక రికార్డులు సృష్టించారు. అభివృద్ధి, పరిపాలన సంస్కరణల్లో తనదైన ముద్ర వేసిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ప్రత్యేక పాత్ర పోషించారు.దూరదృష్టి, దార్శనికత, ముందుచూపు ఆయన ప్రధాన ఆయుధాలు. ఐటీ రంగాన్ని రాష్ట్ర యువతకు పరిచయం చేసి, ప్రపంచ స్థాయి మార్పులకు ద్వారాలు తెరిచిన మహామేధావిగా గుర్తింపు పొందారు.నదుల అనుసంధానం ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమని విశ్వసించి, ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసిన చంద్రబాబు, రైతులకు అన్నదాతల మిత్రుడిగా నిలిచారు.అట్టడుగు వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించిన ప్రజానాయకుడిగా, మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం, మహిళా సాధికారత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా ఆయన ముద్ర చిరస్మరణీయమైంది.
చంద్రబాబు సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టి నేటితో 30 ఏళ్లు పూర్తైందని.. తెలుగు నేలపై 4 సార్లు సీఎంగా పనిచేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఇది రానున్న రోజుల్లో ఎవరూ సాధించలేని ఘనత అన్నారు. తన జీవితంలో ఎన్నో సంక్షేభాలు, అవరోధాలు ఎదుర్కొని నిలబడ్డారని.. పార్టీ కూడా ఎన్నో సంక్షోభాలు చూసినా ఆయన చాణిక్యతతో మళ్లీ విజయాల్ని అందించారన్నారు.. హైదరాబాద్ లాంటి మహానగరానికి అంత కీర్తి ఉందంటే అది చంద్రబాబు ఘనతేనన్నారు. ఆరోజు హైటెక్ సిటి నిర్మించకపోయి ఉంటే.. హైదరాబాద్ పరిస్థితి మరోలా ఉండేదన్నారు. మొదటి నుంచి యువత కొత్త మార్గంలో వెళ్లేలా చూస్తున్న నాయకుడు చంద్రబాబు అన్నారు. చిన్నపిల్లాడి దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ చంద్రబాబే స్ఫూర్తిగా ఉంటారన్నారు. టెక్నాలజీతో ఏమైనా సాధించవచ్చని మొదటి నుంచి నమ్మారని.. ఇప్పుడు వ్యవసాయంలోకి కూడా టెక్నాలజీని తీసుకొచ్చి కొంత పుంతలు తొక్కిస్తున్నారన్నారు. ఆ రోజు డ్రిప్పు, స్ప్రింక్లర్లను రాష్ట్రానికి పరిచయం చేశారని.. ఇప్పుడు డ్రోన్ ల ద్వారా పిచికారి చేసే విధానాన్ని తీసుకొచ్చారన్నారు. ఇలా అనేక నిర్ణయాలు, అంశాలు ఆయన నుంచి స్ఫూర్తి పొందానన్నారు. తనను రాజకీయంగా ప్రోత్సహించిన ఆయన.. ఏ కష్టం వచ్చినా వెన్నంటే నిలిచారన్నారు.
చంద్రబాబు మంత్రి వర్గంలో పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను” – మంత్రి నిమ్మల రామానాయుడు చంద్రబాబు నాయకత్వంపై స్పందించారు.